ప్రముఖ రచయిత్రి చాగంటి కృష్ణకుమారి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(చాగంటి కృష్ణకుమారిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

డాక్టర్. చాగంటి కృష్ణకుమారి విజయనగరానికి చెందిన డాక్టర్.  ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు గారు( చాసో), శ్రీమతి అన్నపూర్ణమ్మగారి కుమార్తె. 36సంవత్సరాల ఉపన్యాసక వృత్తిలో తొలుత ఆరు సంవత్సరాలు విజయనగరం మహారాజా మహిళా కళాశాలలో, మిగిలిన సంవత్సరాలు సింగరేణి మహిళా కళాశాలలో రసాయన శాఖాధిపత్నిగా పనిచేసారు. 1993లో ఆసోసియేట్ ప్రొఫసర్ గా పదోన్నతి పొందారు. తెలుగు అకాడమి లో డెప్యుటేషన్ పై రసాయన శాస్త్ర పుస్తక, పదకోశాల ప్రచురణ విభాగంలో పనిచేసారు. డిగ్రీస్థాయిలో ప్రతిష్టాత్మక బార్క్ (BARC) స్కాలర్ షిప్, ఎం.ఎస్.సి.లో మెరిట్ స్కాలర్షిప్,పిహెచ్డి ప్రోగ్రామ్లో యు.జి.సి.ఫెలోషిప్ ని పొందారు. 1997లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  వీరిని సర్వోత్తమ అధ్యాపక పురస్కారంతో సత్కరించింది. పాప్యులర్ సైన్స్ రచయితగా ఇస్వా , జమ్మిశకుంతల సన్మానాలను పొందారు. 2013లో  రాయల్ సొసైటి ఆఫ్ కెమిస్ట్రి (RSC)లండన్ సభ్యురాలయ్యారు.  

          ఇండియన్ కెమికల్ సొసైటి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కెమిష్ట్రి, ఇండియన్ సైన్స్ రైటర్స్ అసోసియేషన్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వారి కన్వెన్షన్ ల లోనూ, వర్క్ షాపుల్లోనూ పత్రాలను సమర్పించి రెండుసార్లు సర్వోత్తమ పత్ర సమర్పణా అవార్డులను పొందారు. ఆకాశవాణి కేంద్రాలనుండి,ఇందిరాగాంధి సార్వత్రిక విశ్వ విద్యాలయం GYAN VANI కార్య క్రమాలలో వైజ్ఞానిక అంశాలపై సుమారు 80 ప్రసంగాలను ఇచ్చారు. RSC IDLS ; స్థానిక విద్యాసంస్థలవారు నిర్వహించిన సెమినార్లు, వర్క్ షాప్ లలో పాల్గొని సుమారు 50 జనరంజన వైజ్ఞానిక ఉపన్యాసాలను ఇచ్చారు. కృష్ణకుమారి మంచి ఉపన్యాసకురాలు,పరిశోధకురాలు,అనువాదకురాలు.  క్లిష్ట మైన వైజ్ఞానిక విషయాలను చక్కని తెలుగులో ఆసక్తిదాయకంగానూ, సుబోధకంగానూ, సరళంగానూ ఆద్యంతం ఆకట్టుకొనేశైలిలో చెప్పగల రచయిత్రి గా ప్రముఖురాలు.   

          2000 లో లోహ జగత్తు. 2001 లోవైజ్ఞానిక జగత్తు, 2010 లో మేధో మహిళ, భూమ్యాకర్షణకి దూరంగా దూర దూరంగా సుదూరంగా 2012లో రసాయన జగత్తు,  2016లో వైజ్ఞానిక రూపకాలు, 2017లో జీవనయానంలో రసాయనాలు” 2018 లో“వీరి వీరి గుమ్మడి పండు వీరిపేరేమి?”  వైజ్ఞానిక శాస్త్ర గ్రంధాలను ప్రచురించారు. 2013లో శ్రీనివాసరామానుజన్ జీవిత చరిత్రను ఇంగ్లీషునుండి తెలుగుకు అనువదించారు. 2019లో “కంటి వైద్యంలో ప్రాచీన భారత దేశ జ్ఞాన సంపద “ను ఇంగ్లీషు నుండి అనుసృజన చేసారు. మూడు సం వత్సరాలు చైతన్యం పత్రికలో వైజ్ఞానిక క్రాస్ వర్డ్ పజిల్స్ ను తెలుగులో రూపొందించి ప్రచురించారు. ప్రస్తుతం సింగపూర్ తెలుగు లాహిరి రేడియోలోవారం వారం మహిళా స్ఫూర్తి ప్రదాతల కృషిని పరిచయం చేస్తున్నారు. జనవరి2021 నుండి నెచ్చెలి పత్రికలో జ్ఞాపకాల ఊయలలో కాలంను  రాస్తున్నారు. విజ్ఞాన్ ప్రసార్ వారి SCoPE  ఈ-మాస పత్రికకి రచయితగా వున్నారు. వీరు రచించిన పుస్తకాలను  నేషనల్ బుక్ ట్రష్ట్ ,న్యూఢిల్లి; తెలంగాణ అకాడమి ఆఫ్ సైన్సస్ , హైదరాబాద్; వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంటి ప్రతిష్టాత్మక ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. ఈమె రాసిన భారతీయ సాహిత్య నిర్మాతలు: చాగంటి సోమయాజులు(చాసో)మోనోగ్రాఫ్ ని సాహిత్యఅకాడమి 2014ప్రచురించింది.  చాసో స్ఫూర్తి సభలలో ఈమె చాసో కథలను వినిపించేవారు. ఆ అనుభవంతో  ఇప్పుడు “నాన్న కథలు నానోటంట”  శీర్షికన  యూట్యూబ్(Youtube)లో ఆడియో వీడియోలను పెడుతున్నారు.  Chaganty Krishnakumari పేరున వున్న ఈ యూట్యూబ్ చానల్లో తన వైజ్ఞానిక ప్రసంగాలు కూడా క్రమం తప్పకుండా నమోదు చేస్తున్నారు. 

*****

Please follow and like us:

One thought on “ప్రముఖ రచయిత్రి చాగంటి కృష్ణకుమారి గారితో నెచ్చెలి ముఖాముఖి”

  1. ప్రముఖ కథారచయిత ,కథలకు దశదిశ నిర్దేశం చేసిన మా చాసోగారి ముద్దుల కూతురు ,మాతులసమ్మగారిసోదరి కృరుష్ణ కుమారి గారిని గూర్చి కొంత తెలిసినా ఇంతuవిసృతంగా
    ఈ రోజు నెచ్చెలి పత్రికలో చదివి ఆనందంతో ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యాను .నిజం చుట్ట కాలుస్తూ గుంచీ దగ్గర గట్టుమీదకూర్చున్న చాసో గారిని చిన్నప్పుడు చూసి ఎంత మురిసి పోయానో ఈరోజు కృష్ణ కుమారి గారి పరిచయంచదివి అంతే మురిసిపోయాను .తండ్రిని మించిన అననుగాని ,తడ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .వారికి హౄదయపూర్వక నమస్కారములు .. దామరాజు.విశాలాక్షి .విశాఖ పట్తణం .పుట్టినిల్లు .విజయనగరం

Leave a Reply

Your email address will not be published.