“నెచ్చెలి”మాట 

మాతృదినోత్సవం

-డా|| కె.గీత 

మాతృ దినోత్సవం
అనగానేమి?
మదర్స్ డే-

మదర్స్ డే
అనగానేమి?
మాతృ దినోత్సవం

అయ్యో రాత!
మరోమాట చెబుదురూ-

మాతృ దినోత్సవం
అనగా
అమ్మని గౌరవించుట

శభాష్-
గౌరవించుట అనగానేమి?

వాట్సాపులో
మాంఛి
తల్లీ బిడ్డల బొమ్మొకటి
ఫార్వార్డు
చేయుట-

ఫేసుబుక్కులో
చిన్నప్పటి
ఫోటోలు
గోడనతికించుకుని
ఫోజులు
ఇచ్చుట-

ఆన్ లైనులో
వొంటింటి పాత్రేదో
కొని పడేసి
డోర్ డెలివరీ
ఇప్పించుట-

ఇదంతా చెయ్యడం
కూడా కష్టమైపోయినట్లు
ఇంకొంచెం ముందుకెళ్లి

చిన్నప్పుడంతా
అమ్మ కొంగు పట్టుకుని తిరిగి
పెద్దయ్యాకా
తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్ పాల్జేయుట-

పండగొచ్చినా
పబ్బమొచ్చినా
పట్టించుకోకునుట-
చివరికి పుట్టినరోజొచ్చినా
ఆఫీసు వంక చెప్పుట-

ఇచ్చినప్పుడల్లా
ఇంచక్కా డబ్బులు గెంతుకుంటూ తీసుకుని
చివరికి
ఆస్తి పంపకాలంటూ
వేధించుట-

ఆగండాగండి
‘నిజ’గౌరవాలు ఇక చాలు-

మాతృ దినోత్సవం నాడే
అమ్మని గౌరవించకపోయినా
పాపం పిచ్చి తల్లి
ఏమీ అనుకోదు గానీ

ప్రేమగా ఓ సారి
గుమ్మం తడుదురూ-

ఒక్కరోజు
అన్నీ పక్కనబెట్టి
కష్టం సుఖం
కనుక్కుందురూ-

ఏదో కాస్త కమ్మగా
వండిపట్టుకెళ్లి
‘ఇంద’ అని చేతిలో పెడుదురూ-

బాబ్బాబు
మీకు ఎంతో
పున్నెవొస్తాది గానీ
‘అమ్మా’ అంటూ ఓ సారి
కౌగిలించుకుందురూ-

ఏ అమ్మకైనా
ఇంతకంటే
గౌరవం ఉంటుందా?!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

 ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటు రాసిన వారికే కాక ఆర్టికల్ కు సంబంధించిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఏప్రిల్, 2022 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: శేషు

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: మీటూ కథలపై సమీక్ష (పుస్తకసమీక్ష),  వ్యాస రచయిత్రి: అనురాధ నాదెళ్ల

ఇరువురికీ అభినందనలు!

*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం- మే, 2022”

 1. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంది
  కవిత. నేను ఈ మధ్య’అమ్మ అంబ ఐతే’అనే
  కథ రాశాను.అందులోని ఆంశాలు కూడా
  ఇవే.రచయిత్రి అలతి అలతి పదావతో అనంత
  భావాలు పలికించారు.

  1. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారూ!

Leave a Reply

Your email address will not be published.