ఓసారి ఆలోచిస్తే-1

ముందు మాట

-డి.వి.రమణి

          పోరాటం అనేది ఈరోజు కొత్తది కాదు, మొదటిసారి వినటం లేదు … సృష్టి మొదలైనప్పటినించి అనాదిగా వస్తున్న ఈ పోరాటం అన్ని సమయాల్లో ఉన్నది. అన్ని విషయాల్లోనూ …దానికి జత చెయ్యవలసినది “ఆలోచన” ఎప్పుడైనా .

          ఒకప్పుడు ఎంతో మన్నించిన ఆచారాలు వ్యవహారాలు పలచపడి పోవటమే కాకుండా ,క్రమంగా కనుమరుగు అయిపోతుండటం ఆశ్చర్యమో? లేక సృష్టి నియమమో తెలీదు! “కుందేటి కొమ్ములాగా” అదృశ్యమైపోతున్నాయి.

          ఇంక, కుటుంబం అనేది మనిషికి మొదటి ఆవాసం, పుట్టగానే ఒక ఇల్లు, పేరు, తల్లి, తండ్రి, తోబుట్టువులు [ఉంటె}, వారితో కలిసి… బతకటం నేర్చుకుంటాడు, అలాగే పెద్దవుతూ స్వభావాన్ని మలుచుకుంటాడు …

          సమాజం లో స్త్రీ -పురుష వివక్ష ఇప్పటికి సజీవంగా ఉండటం కొంత బాధాకరం,
సర్వైవల్ … అంటే బ్రతకటానికి అవలంభించాల్సిన అంశాలలోంచి “పోరాటం “ మొదలైంది . ఇది రకరకాలుగా మనిషిని మళ్ళిస్తుంది, మారుస్తుంది, పరిస్థితులకి తల వంచేలా చేస్తుంది. కానీ అందులోంచి ఆ పోరాటాన్ని ఎదుర్కొని నిలబడేది నిజమైన శక్తీ-యుక్తి , ఆ యుక్తి కి నాంది “ఆలోచన”

          స్త్రీ జీవితం కొంత భిన్నత తో ఉంటుంది. ఎందుకంటే, సమాజం లో స్త్రీ పాత్ర పురుషుని పాత్ర వేరే విధంగా ఉంటూ ఉంటుంది … కాల క్రమేణా…. ఆర్ధిక స్వేచ్ఛతో బాటు ఇల్లు గడవడానికి స్త్రీ కూడా బయటకెళ్ళి ఉద్యోగం చెయ్యటం అవసరం గా మారింది. అది కాలం లో వచ్చిన మార్పు . మరిఒకటి ఆర్ధికంగా అవసరం ఏర్పడడం కూడా ఒక కారణం

          నాడు : ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం వలన ఒకరు బయటికెళ్లినా మిగతా వాళ్ళ సహకారం ఉండేది. అలకలు, కోపాలు, స్పర్ధలు ఉన్న, నచ్చకపోయినా ,క్రియలో సహకారం ఉండేది … అందరు కలిసి ఉండేవారు. కాబట్టి , పెళ్లి కాకముందు తల్లి, తండ్రి , అన్న తమ్ముళ్లు , అక్క చెల్లెళు ఉంటారు , అదే పెళ్ళి అయ్యాక కష్టమవుతుంది, భర్త సహకారం ఉంటె అదృష్టం, లేకుంటే నరకమే!అప్పుడే మన స్పర్ధలు , అభిప్రాయం బేధాలు వస్తాయి , కుటుంబం చెదిరిపోతుంది.

          నేడు : “న్యూక్లియర్ “ ఫామిలీస్ వచ్చేసాయి ,ఆడపిల్లలు కోరుకుంటున్నారు. అలాగే గొప్ప జాబ్స్ చెయ్యాలి అని , కానీ…ఇంటి పని చెయ్యాలని ఉండదు … ఫలితం!
అబ్బాయి కి తల్లి తండ్రి వొద్దు, ఒక్కరు… ఉండే ప్రైవసీ కావాలి , ఇంట్లో సాయం ఉండదు, ఇంట – బయట కూడా పోరాటమే! అవుతోంది. అప్పుడు ఇంట్లో వంతు లొస్తాయి, నువ్వు చెయ్యి అంటే నువ్వు చెయ్యి అని , పిల్లల పెంపకం లోను, ఇది సామాన్యం అయిపొయింది. 

          అన్ని వర్గాలలోనూ అంటే పని వాళ్లలో కూడా ఇది సామాన్యం అయిపొయింది వాటి గురించిన నేపధ్యమే ఈ కధలు.!

          ఏ సమయంలోది కథ అనేది కథ లోనే ఉంటుంది , కాబట్టి ప్రత్యేకం గా చెప్పటల్లేదు , వర్గీకరించటం లేదు , చదివి గ్రహించగలరు …

          ఇది నా చుట్టూ సమాజాన్ని పరికించి ,పరిశీలించి ,గమనించిన అంశాలని కధలు గా రాసాను మనోవైజ్ఞానికత కొంచెం జోడించి వివరించాను . .

***

స్వేచ్ఛ (కథ)

          “ అమ్మా , వనజా , జాగ్రత్త తల్లి, నీకు ఇంతవరకు మన ఊరు విడిచి వెళ్లే అవకాశం
గాని అవసరం గాని రాలేదు , అల్లుడు మంచివాడు, అవతలివాళ్ళు అర్ధం చేసుకుని నీకు
కావలసినవి గ్రహిస్తారు అనుకోకు….” ఇలా జాగ్రత్తలు వెళ్లే వరకూ చెప్తూనే ఉంది. కార్లో
సామాన్లు పెడుతున్నారు. దుర్ముహూర్తం గడిచేక వెళ్లాలని కూచుని ఉంటె, చెప్తోంది, సారేతో మొదటిసారి వెళ్తోంది , కానీ మేనరికం కూడా కాదు అని, ఆనంద్ కి ఇచ్చి, అందరి ఇష్టానికి వ్యతిరేకం గా పెళ్లి చేసాడు, వనజ తండ్రి , కారణం అందరికి తెలీదు. కానీ వనజ కి చెప్పాడు, అతను ఆర్మీ కమాండర్ వెంకట్ కొడుకు , బిజినెస్ చేస్తున్నాడు చక్కగా ఇల్లు కొనుక్కుని అతి చిన్న వయసు లోనే బాగా సెటిల్ అయ్యాడు. చాలా ముచ్చట పడిపోయారు అయన. అతన్ని చూసి ఒక్కగా నొక్క కూతురు సుఖఃపడాలి అని ఆశ పడటం తప్పుకాదుగా !

          ఈడు జోడు గా చక్కగా ఉన్నారు. వనజ ఆనంద్ లు,తండ్రి కి నచ్చిందే వాళ్ళ కుటుంబం. ఆ ఆర్మీ డిసిప్లిన్ ఉన్న వాళ్ళ కుటుంబం నచ్చింది, బెల్లంకొండ నించి 4 30 గంటలు ప్రయాణం, ప్రయాణం అంతా కళ్ళు వొత్తుకుంటూనే ఉంది వనజ , ఆనంద్ వనజ చెయ్యి పట్టుకుని కూచున్నాడు ధైర్యం ఇస్తూ .

          హైదరాబాద్ చేరేసరికి 2:30 అయింది, ఆనంద్ మేనత్త హారతి ఇచ్చి లోపలి కి
తీసుకు వొచ్చింది. అప్పటికే చాలా మంది పెళ్ళికిరానివాళ్ళు వచ్చారు వనజ కి
దుఃఖం పక్కకి జరిగింది. కొత్త వాళ్ళు కొత్త చోటు … ఆసక్తిగా అందర్నీ చూస్తోంది.
ఇంటి పక్కనే మేనత్త ఉంటారు. ఆమె ఆనంద్నిపెంచారు. తల్లిలేని ఆనంద్కి ఆమెఅమ్మ, అందర్నీపేరుపేరునా పరిచయం చేశారు..

          పల్లెటూరికి పట్నానికి తేడా కొంచెం కొంచెం అర్ధం అవసాగింది, వనజకి అందరూ
భోజనాలు చేసారు. ఒక్కొక్కళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు, నమ్రత గా తీసుకుంది, సాయంత్రం దాకా ఉండి ,వాళ్ళు వెళ్లిపోయారు. మళ్ళి కలుస్తాము అని. మేడ మీద నాలుగు, కింద నాలుగు బెడ్ రూమ్స్ , పెద్ద హాల్ మెహల్ లా ఉన్న ఇల్లు బోలెడు మంది పనివాళ్ళు, తోట మాలి, కళ్ళు చెదిరేలా ఉన్న సంపద ఆస్తి చూసి మురిసిపోయింది పార్వతి, తండ్రి కూడా చాలా సంతోషించారు.

          వనజకి చాల చిత్రంగా అనిపించింది. ఉన్నది ఇద్దరు ఆనంద్ వాళ్ళ డాడీ కి ఇంత
పెద్ద ఇల్లు అవసరమా???

          పెళ్లి సందడి తగ్గింది, ఒక వారం గడిచింది, రెండు రోజు ల తర్వాత పార్వతి
సుదర్శన్ కూడా వెనక్కి వెళ్లిపోయారు.ఇంట్లో గదుల్లోకి ఇంటర్కం లో ఆర్డర్స్ ఉంటాయి,
పని వాళ్లకి అలా పనులు చేయించే హెడ్ ఆమె పేరు అంబిక, పొద్దునే ఫోన్ లో
“ఏమి చేయించమంటారు అమ్మాయిగారు ? ఇవి… చేయిస్తున్న ఇంకా ఎమన్నా
చేయించాలా? కాఫీ సెండ్ చెయ్యమన్నారా?” అని అడుగుతుంది . మా ఇంట్లో పెరట్లో మల్లె పందిరి కింద కుర్చీల్లో కూచుని అమ్మ నేను శీనన్న పొద్దునే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవటం గుర్తొస్తుంది… కాఫీ తెచ్చిన ఖరీదైన కప్ లో తాగుతుంటే అదెక్కడా కింద పడిపోతుందో అన్న భయం తో కాఫీ కూడా తాగాలి అనిపించదు….

          “వనజా రేపటినించి నువ్వు ఒక్కదానివే ఉండాలి, బహుశా” వనజనే చూస్తూ
అడిగాడు.

          “ మన ముగ్గురికి నేను వండ లేనా? వంట మనిషి అవసరమా? ఏవో పని చేస్తూ
ఉండటం అలవాటు, పని లేక తోచట్లేదు “

          “ అంటే చాలా ఇయర్స్ గా ఉన్నారు ఇప్పుడు వెళ్ళమంటే న్యాయం కాదు కదా ?”
ఇంకేమి మాట్లాడలేదు వనజ… ఏమి చెప్పాలి ఎలా చెప్పాలో తెలీలేదు వంటగది లో
కి వెళ్ళగానే వాళ్ళు ,” అమ్మాయి గారు ఎమన్నా కావాలా?” అంటూ నిలబడతారు
వెనక్కి వోచ్చేస్తుంది ….

          టైం గడవట్లేదు బంగారు పంజరం లో ఉన్న ఫీలింగ్ వొస్తోంది చుట్టూ ఎదో కొండచిలువ చుట్టుకున్నట్టు ఊపిరి ఆడట్లేదు…ఎటు చూసినా సర్ది నీట్ గా ఉండే దాన్లో ఏమి చేస్తుంది, చెయ్యటానికి పని లేదు, ఎప్పుడు దిగులుగా ఉంటుంది పెరట్లో తులసి మొక్క దగ్గర కూచుంటుంది, అంబికాతో చెప్పి పూజ తాను చేసుకోవటం చేస్తోంది.

          ఎందుకు ఇలా ఉంటోందో ? తెలియట్లేదు పెళ్లి జరిగి 6 నెలలు అవుతోన్న వనజ లో
ఇదే ఉదాసీనత, ఆనంద్ ఒక రోజు అడిగాడు, “ ఎందుకెప్పుడు దిగులుగా ఉంటావ్,
అన్నివసతులు ఉన్నాయి కదా నీకు పని లేదు హాయిగా ఉండు “ అని ఒక సారి
చూసి ఊరుకుంది.

          ఆనంద్ ఆ రోజు ఆఫీస్ నించి వొస్తూ రెండు చిలకలని తీసుకొచ్చాడు వాటిని
చూస్తూనే వనజ ఆనందానికి హద్దు లేకండా అయింది. వనజ లో ఉత్సహన్నీ ఆశ్చర్యంగా చూసాడు ఆనంద్… చిలకల్ని చూసి ఇంత ఆనందమా?? ఆశ్చర్యం! వస్తువుల్లో కాకుండా వనజ ప్రకృతి లో అందాన్ని చూసి మురిసిపోతుంది అని అర్ధం అయింది.

***

          నెల రోజులు గడిచాయి చిలకలు 20 రోజులుదాకా బాగానే ఉన్నాయి. ఒక చిలక చాలాడల్ గా అయిపోసాగింది. దాన్నిమాములు చెయ్యటానికి వనజచెయ్యని ప్రయత్నం లేదు. కాజు పెట్టిన తినట్లేదు , ఒక రోజు పక్కకి. పడిపోయింది , చాలాదుఃఖం వొచ్చేసింది బాల్కనీ లో కూచుని ఏడుస్తోంది,తన నిస్సహాయత కి “ఏమైంది వనజా ఎందుకు ఏడుస్తున్నావ్” ఆనంద్ ఆందోళన గా అడిగాడు.

          ‘ ఏమి చెప్పను ఆనంద్ , మీరు మీ ఆఫీస్ వర్క్ తో బిజీ మామయ్యగారు ఎప్పుడు
కనబడరు కనిపిస్తే ‘ఎలా ఉన్నావ్ తల్లి’ అంటారు అంతే, నాకు చుట్టూ మనుషులు
మాటలు అలవాటు ఇక్కడ మౌనమే ఇక్కడ నా ఉనికి ఏమిటి, వేళకి తినటం
ఒక్కదాన్ని, మీరొచ్చాక కాసేపు కూడా మాటలుండవు మీ పనులు అయ్యాక రాత్రి
కాసేపు భార్య గా పక్కమీద ఉండే టైం తప్ప ఏముంది? అదుగో ఆ పక్షి కి నాకు తేడా లేదు, బంగారు పంజరం లో ఉన్నట్టుంది “ అని లోపలికి వెళ్లి చూస్తే ఆ చిలక చని పోయింది రెండోది ఏడుస్తూ దాన్ని జరుపుతోంది దగ్గరకి వెళ్లి ఆ తలుపు తీసేసింది.

          …ఆ చిలక ఎదో అరుస్తూ వనజ బుజాల మీద కాసేపు కూచుని చుట్టూ తిరిగి
రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది.

          ఆనంద్ ఆలోచనలో పడ్డాడు వనజ మాటల్లో నిజం ముళ్ళు లా అనిపించాయి…
“ నాకు స్వేచ్ఛ కావాలి ఆనంద్ నేను చెయ్యగలిగింది రెండు పనులు”
“ ఏమిటి అవి?” అడిగాడు, “ అలోచించి చెప్పండి ఒకటి ఫాషన్ గా డ్రెస్ లు కుట్టటం
బోటిక్ , రెండోది మీ అమ్మగారి పేరుమీద ప్లే స్కూల్ పెట్టటం “ అనేసి వెళ్ళిపోయింది
వనజ.

          ఒక వారం ఆలోచించాడు ఆనంద్. వనజ కోరిక న్యాయమైందే అనిపించింది, దానికి
సంబంధిచినవన్నీ పూర్తిచేసి వనజ చేతిలో పేపర్స్ పెట్టి “ సరేనా , అమ్మ శారద
పేరుతో స్కూల్ పెడదాము నేను తోడుంటాను “ దగ్గరకి తీసుకుని ఇంకా వంటరిగా
పంజరం లో ఉన్నాను అనుకోకు హ్యాపీ గా ఉండు “ అన్నాడు.

          వనజ మనసంతా నిండిపోయింది ఆనంద్ ఇచ్చిన ఆనందంతో. “ వనజ ఏది మనసు లో పెట్టుకోకు నాతో చెప్పు నువ్విలా బాధ పడ్డావని కూడా నాకు తెలియలేదు, చిన్నప్పటి నించి ఒంటరిగా పెరిగిన కారణం గా నాకు హ్యూమన్ ఎమోషన్స్ తెలియవు, నీ రాక తో నా జీవితానికి అర్ధం ఏర్పడింది. నాకు రాని ఆలోచన నీకు వొచ్చింది కదా! 

          వనజ, అర్ధం చేసుకున్నందుకు సంతోషం లో ఉండిపోయింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.