డా. విరించి విరివింటి కవితా సంపుటి ‘రెండవ అధ్యాయానికి ముందుమాట’ పై సమీక్ష

-సుశీల నాగరాజ

 
 
మీ పేరు విరించి లాగ మీ కవితలు unique.They are different in style, the way he takes  the poetry is different. They have   deep depth and also wide width. At a time it is not easy to see  and digest all of them. we have to go inside the poetry and through the lens of the mind to see it.”!!
 
         డాక్టర్ గా మనుష్యుల దేహాలనే కాదు, కవిగా మనసుల్ని బాగుపరుస్తారు. కొత్త ఆలోచనలకు మనసు కిటికీని తెరుస్తారు, కొత్త రంగులను అద్దుతారు!
 
         సిక్ లీవులో  “ముడతలు పడిన రాళ్ళను చూసినట్లుంది.”!!  ఈ ప్రయోగం నేను ఎక్కడా చదవలేదు. పుస్తకం మూసి , కళ్ళు మూసి కూర్చొన్నాను. ఎలా ఊహించాలి అని. సిక్ లీవ్ కోసం వచ్చిన ఆ వ్యక్తి పై వైద్యులుగా బాధ్యత, ఆందోళన, బాధ అన్నీ వ్యక్తమౌతాయి ఆ కవితలో!
 
         Rem కవిత లో ఎన్నో త్యాగాలతో ‌తను కష్టపడి సంపాదించిన బహుమాన్నాన్ని బలవంతంగా లాక్కుని వెళ్ళినప్పుడు తనను, తన బహుమానాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరణదండనంత  వేదనను అనుభవిస్తారు!
 
         కిటికీ బయటి ప్రపంచానికి రెక్క, కారాగృహానికీ తాళం! పిడికిలి అంటే మూసి ఉంచేది! కవిత్వపు టద్దం! సముద్రంలో కలిసిపోయే జీవనది, నదికార్చె కన్నీరు, నీలో ఇంకో నదిని పుట్టించాలి! అద్భుతం!
 
         ముర్రు పాలు పంచుతున్న సమయాన మురిపాలు కోసం ఒకడు కాచుకున్నపుడూ!!! స్త్రీ ని శారీరకంగానే కాదు మానసికంగానూ కాచి వడపోసారు! ఈ కవితకు మీకు చేతులు జోడించి నమస్కారం!
 
         విరించిగారు మనిషి నాడినే కాదు మనసు నాడిపట్టి కవితల్ని రాశారు,. కత్తేకాదూ కలాన్ని అంతే కుశలంగా ఉపయోగించారు!!
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.