“నెచ్చెలి”మాట 

శోభకృత్ ఉగాది!

-డా|| కె.గీత 

శోభకృత్ ఉగాది
అంటే
శోభని కలగజేస్తుందట!
పండుగ
రానూ వచ్చింది
పోనూ పోయింది
లోకంలో
ఎక్కడన్నా
శోభ వుందా?
కళ వుందా?
కాంతి వుందా?

అయ్యో
అసలు
శోభ
ఎక్కణ్ణించొస్తుందీ?!
దిక్కుమాలిన
ప్రపంచం
మారి చస్తేనా?

ఓ పక్క
సంవత్సరం
దాటుతున్నా
యుద్ధం
ఆగదు-
కాదు..
కాదు…
ఆగనిస్తేనా?
దురాక్రమణలూ
ఆయుధ కుతంత్రాలూ
ఆగి చస్తేనా?!

ఇక
శోభ ఏవిటి?
కళ ఏవిటి?
కాంతి ఏవిటి?

మరో పక్క
భూకంపాలు –
మంచుతుఫాన్లు-
టోర్నడోలు –
వైపరీత్యం
టుద పవరాఫ్
వైపరీత్యం

అయినా
మనకేం
పట్టిందిలే
ఇంచక్కా
వేపపువ్వు
పచ్చట్లో
ఇన్నేసి
అరటి పళ్లు
పప్పులు
బెల్లాలు
వేసుకుని
ఆరగిద్దాం!

ప్రపంచపు
వెలుగు
ఎటు పోతే
మనకేం!

తెలుగింట
వెలుగులుంటే
చాలు!!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

మార్చి  2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: కోరాడ నరసింహారావు

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ప్రముఖ రచయిత్రి జలంధర గారితో ఇంటర్వ్యూ 

కోరాడ నరసింహారావు గారికి అభినందనలు!

*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం- ఏప్రిల్, 2023”

  1. ఓ వైపు పండుగ చేసుకోండి అంటూనే కాస్త ప్రపంచపు పరిస్థితిని కూడా గుర్తించండి అంటూ చురక అంటించారు రచయిత్రి. ప్రపంచపు వెలుగు గురించి కూడా అందరం ఆలోచించాల్సిన అవసరం ఉందిగా..

    1. ధన్యవాదాలు దినకర్ రెడ్డి గారూ!

Leave a Reply

Your email address will not be published.