
ఒక పరివ్రాజక కల
– శేషభట్టర్ రఘు
నా కాలంలో ఆడపిల్లలు గోరింటాకుతో తిరిగినట్టునా మటుకు నేను గొప్పోడిననే ఖ్యాతితో తిరగాలనికలగనేవాడ్నిఅలా అనుకోవటంలోనే ఒక గమ్మత్తయిన మత్తుందనికలలేవీ లేనివాడ్ని సన్యాసి అంటారనివాడికి అడవులు కొండల్లో జపమాలలు తిప్పటమేపనిగా ఉంటుందని అనుకునే వాడ్ని అప్పుడప్పుడూ కన్న కలలన్నీ గుట్టపోసి చూసేవాడ్నిఏం చేయాలో తోచక మళ్ళీ బుర్రలోనే దాచేవాడ్ని బతకటం అంటే జీవితం చేసే నానా రకాల అలజడినిసితారు తీగల్లా సవరించటం కాదు కనకనా ఖ్యాతి కలలు కూడా గడ్డంలాగే నెరిసిపోయాయిఅప్పుడు పిల్లల నాజూకు వేళ్ళ మీద వాటినిపదిలం చేశానుకొత్త వంతెన మీదికి అడుగులేవో మోపినట్టుతాజాగా పనస పొట్టేదో ఒలిచినట్టుచిరపురాతన వాసనలేవో పెదవుల్లో దాచానుజారుతున్న కాలం మీద ప్రపంచంఅలవాటుగా తన భాషనే రాసుకుంటోంది ఇన్నాళ్ళ గిర గిర తర్వాతలోకంలో నాకు దొరకని అభ్రకమేదో దాక్కుందని తెలిశాకఎండు ద్రాక్షలాంటి వయసు రుచిని మెదడు కొంచెం మరిగాకపరివ్రాజకుడిగా బతకటమే గొప్ప వరం అనిదాని కోసం మూర్ఖత్వాన్ని లోయల్లోకి తోసి రమ్మనిచెప్పింది ఈ నిమిషం పూచిన లేత నీడల ఎండ!
*****

