పాటతో ప్రయాణం-2

– రేణుక అయోల  

          ఈ రోజు “Baat niklegi to phir door talak జాయేగి ” గజల్తోప్రయాణిద్దాం…. 
ఇది జగ్గ్ జీత్ సింగ్ గజల్ నాకు చాలా ఇష్టమైన గజల్స్ లో ఇది ఒకటి…

మాట తూలితే దాని ప్రయాణాన్ని ఆపడం చాలా కష్టం
మన ఆవేశమో, మన ఉక్రోషమో, దుఃఖమో మాటల్లో
దొర్లిపోతాయి దాని నడక మారిపోతుంది
అది ఎవరి ఎవరి పెదాల మీదో నర్తిస్తుంది
మాట ఉద్దేశ్యం మారిపోతుంది ఇంకెవరో మధ్యలో వస్తారు చివరికి మన దుఃఖం మనతో మిగిలిపోతుంది
అరే నా మాట నాకు ఏమైనా సంతోషం మిగిల్చిందా
ఆవేదన తీర్చిందా
అని వెతికి వెతికి అలసిపోతాం చివరికి ఈ మాట ఎందుకు నలుగురితో చెప్పుకున్నాను? నేను సాధించింది ఏమిటి నాకేం ఒరిగింది అనే దశకి చేరుకుంటామనిపిస్తుంది…

          ఈ రోజు ఈ గజల్లో ప్రియుడు ఆమెతో తన మీదవున్న ప్రేమ అందరి ముందు బయటపడితే ఎలావుంటుందో చెప్తూ వుంటాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ ఉంటాడు…
 
          మనకి  ఇక్కడ ప్రేమికుడు ప్రియురాలి సంభాషణలా సాహిత్యం అనిపించినా అదే నిత్య జీవితంలో మన తొందరపాటు మాట ఎంత దూరం తీసుకువెళుతుందొ లోకం ఎలా సతాయిస్తుందో గజల్ వింటూ ఉంటే అనిపిస్తుంది…
 
Ungaliya uthengi
sukhe huye baalon ki taraf
Ik nazar dekhenge gujare huye saalon ki taraf..

అవసరం కాకపోయినా సందర్భం లేకపోయినా
జుట్టుకొసలు ఎండిపోయిట్టు వున్నాయి అంటారు
ఒకచూపు గడిచిపోయిన కాలాన్ని వెతికితే…
లోకం ఎంత నిర్థయగా ఉంటుందంటే 
నిన్ను మాటల్లో పెట్టీ నా గురించి అడుగుతారు
ప్రతీ మాటకి అర్ధాలు వెతుకుతారు
వాళ్ళ మాటలు పట్టించుకోకు
పట్టించుకున్నావంటే  నీ ముఖం మీద వున్న మెరుపుతో
ఒక తీగతో ఇంకోదానికి ముడిపెట్టడానికి ప్రయత్నిస్తారు అంటాడు….

Mere baare mein koyi baat na karana unase
Baat niklegi to phir door talak జాయేగి….

నిజమే కదా మాట జారితే తీసులేము…
ఆ మాటే తుఫానులా అందరి తలుపులు తట్టీ కొన్ని చోట్ల బతుకులకి అర్ధాన్ని మార్చేస్తుంది.
     
          ఈ  గజల్  వింటారుగా…వింటే తప్పకుండా నాలాగే దాని  ప్రేమలో పడతారు….. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.