ప్రముఖ రచయిత్రి ప్రతిమ గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(ప్రతిమ గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

“నెల్లూరు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గంలో, ఒక భూస్వామ్య కుటుంబంలో నుండి ఇలా బయటకు రావడమే సాధించిన విజయంగా నేను భావిస్తూ ఉంటాను” అనే ప్రతిమ గారికి పీడితుల పక్షాన నిలబడి, చీకటి కోణాల్లోకి వెలుగులు ప్రసరించేలా మంచి కథలు, కవిత్వం, వ్యాసాలు రాయాలన్నదే అభిలాష. 80 దాకా కథలు రాశారు.

ప్రచురించిన పుస్తకాలు:

1..” పక్షి” కథా సంపుటి 2004
2.. “ఖండిత” కథా సంపుటి 2008
3.. “రెండు భాగాలు” కవిత్వ సంపుటి 2008
4. “సుప్రజ” కథా సంకలనం 2011

“పగిలిన జ్ఞాపకం” కథా సంపుటి ప్రచురణలో ఉన్నది.మరో వ్యాస సంపుటి, కవిత్వ సంపుటి ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.

పురస్కారాలు:

1. చాసో స్ఫూర్తి పురస్కారం 2005 విజయనగరం
2. రంగవల్లి సాహిత్య పురస్కారం 2005 హైదరాబాద్
3.కేతు విశ్వనాథరెడ్డి పురస్కారం 2007 నందలూరు
4. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం 2007 హైదరాబాద్
5. ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారం 2007 హైదరాబాద్
6. నూతలపాటి గంగాధరం కవిత్వ పురస్కారం 2009 తిరుపతి
7. గురజాడ కథా ప్రభాస పురస్కారం 2013 పిఠాపురం
8. గుర్రాల రమణమ్మ కవిత్వ పురస్కారం నెల్లూరు
9. డాక్టర్ పరుచూరి రాజారామ్ సాహిత్య పురస్కారం 2016 గుంటూరు
10. ఏఐసిసి జాతీయ పురస్కారం 2007
11. మాలతి చందూర్ ప్రమదా పురస్కారం 2019 బాలకుటీర్
గుంటూరు
12. ఉమ్మడిశెట్టి సత్యాదేవి పురస్కారం 2019 అనంతపురం

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.