“నెచ్చెలి”మాట 

ఆరోగ్యమే మహాభాగ్యం!

-డా|| కె.గీత 

ఆరోగ్యమే మహాభాగ్యం!
శరీరమాద్యం ఖలు ధర్మసాధనం!!

అవునండీ
అవును-
తెలుసండీ
తెలుసు-
అన్నీ ధర్మ సూక్ష్మాలూ
తెలుసు-

అయినా
ఇప్పుడు
ధర్మ సూక్ష్మాలు
ఎందుకో!

అదేమరి!
మానవనైజం!!
ఏదైనా ముంచుకొచ్చేవరకూ
పట్టించుకోం
పట్టించుకునేసరికే
ముంచుతుంది

ఏవిటట?
ముంచేది-
మునిగేది-

హయ్యో
అదేనండీ
ఆరోగ్యవంతమైన శరీరం-
శరీరపుటారోగ్యం-

తెలుసండీ
తెలుసు-
అన్నీ
తెలుసు-
కానీ
ఇన్నేసి
పనులు చెయ్యకపోతే
కొంపలు మునిగిపోవూ!

“పోవు”

అసలే
జీవితం క్షణభంగురం
హయ్యో! ఇక్కడా
ధర్మ సూక్ష్మాలే –

పనిచేసేవారు లేకపోతే
పనులు ఎక్కడివక్కడ
ఆగిపోవూ!

“పోవు”

సంపాదించేవారు లేకపోతే
అందరి జీవితాలు
చెల్లాచెదురై పోవూ!

“పోవు”

అయినా

ధర్మ సూక్ష్మాలూ
పాటించం!
అయితే
ఏవిటట?

అయితే
మీ ఇష్టం-
త్వరలోనే
ఏ భాగ్యమూ లేని ఆరోగ్యం…
ఏ సాధనానికీ పనికిరాని శరీరం….

ఎంతమాట!
ఎంతమాట!
బాబ్బాబు
అదేదో చెప్పి
పుణ్యం కట్టుకోండి

ఏవీ లేదండీ

ఆరోగ్యమే మహాభాగ్యం!
శరీరమాద్యం ఖలు ధర్మసాధనం!!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

జనవరి 2024 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: రవి
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: గులకరాళ్ళ చప్పుడు (కథ) – శ్వేత యర్రం
ఇరువురికీ అభినందనలు!

*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం-ఫిబ్రవరి, 2024”

  1. ఆరోగ్యమే మహాభాగ్యం!
    “నెచ్చెలి”మాట పసందుగా ఉంది.. ఆరోగ్యంతోనే అందం ఆనందం.

Leave a Reply

Your email address will not be published.