అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 18

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల, విష్ణు పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియా లో పెర్మనెంట్ రెసిడెంట్స్ గా సిడ్నీలో అడుగు పెడతారు. క్రొత్త ప్రదేశంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవితం సాగిస్తున్నారు. విశాలకి మొదటిసారిగా వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా మొదటి జీతం డాలర్లలో సంపాదిస్తుంది. విష్ణు డ్రైవింగ్ లెసెన్స్ నేర్చుకుంటూ టెస్ట్ కి సిద్ధం
అవుతున్నాడు.

***

          మనస్సు స్థిమితంగా ఉన్నపుడే ఆలోచనలు, ఊహలు విహంగంలా పయనిస్తాయి.
కానీ చాలా శాతం మనిషి కష్టాలలో ఉన్నాను, కష్టం కేవలం తనకు మాత్రమే ఉందని భావిస్తూ, బ్రతుకుని నిట్టూర్పులతో, భారంగా ఈడుస్తూ, హృదయంలో భావనలకు, స్పందనలకు ఆనకట్ట వేసేస్తూ ఉండటం పరిపాటి.

          విష్ణు బయటకు వెళ్ళగానే, విశాల అమ్మ, నాన్నతో క్రొత్తగా ఇంట్లోకి వచ్చాక మాట్లాడ లేదు అనుకుని ఫోన్ చేసింది. ఎందుకంటే ఆ రోజు కాలేజ్ లో స్టూడెంట్స్ కి ఫ్లెక్సీ వీక్ అవడంతో, తను కూడా కాలేజ్ కి వెళ్ళలేదు.

          “అమ్మా! అందరూ ఎలా ఉన్నారు? మేము క్రొత్తగా వేరే చోటికి మారాము. అడ్రస్ రాసుకో. సెవెన్ హిల్స్, ఇంటి నంబర్ సెవెన్” అనగానే వెంటనే తల్లి శారద “అయితే వేంకటేశ్వరస్వామి నిలయం అన్నమాట, ఏడుకొండలు, ఇంటి నంబర్ ఏడు, నీ లక్కీ నంబర్. బలే కలిశాయి.”అంది. దానికి విశాల, “అవును నేనుగమనించనే లేదు అమ్మా! నువ్వు అదృష్టాన్ని, వేంకటేశ్వరస్వామి నిలయంగా చక్కగా చెప్పావు.” అంది  సంతోషం గా. అలా కాసేపు అమ్మతో మాట్లాడాక బెంగ తీరి, విశాల మనస్సు తేలిక పడింది. లైబ్రరీ నుంచి తను తెచ్చుకున్న ఇంటర్నెట్ మార్కెటింగ్ రీసెర్ఛ్ బుక్ పేజీలు తిరగేసింది.

***

          విష్ణు డ్రైవింగ్ టెస్ట్ కి సిద్ధమయ్యి, న్యూ సౌత్ వేల్స్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ  కార్యాలయంలోకి అడుగు పెట్టి, అక్కడ బటన్ ప్రెస్ చేసి టికెట్ తీసుకున్నాడు. అతని నంబర్ అక్కడ స్క్రీన్ పై డిస్ప్లే అయ్యి, మైక్ లో పిలవగానే కౌంటర్ దగ్గరకి వెళ్ళాడు.

          తన లాగ్ బుక్ చూపించి, అప్లికేషన్ ఇవ్వగానే అన్నీ చెక్ చేసి, కారులో వెయిట్ చేయమని కియారా చెప్పింది.

          డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ విష్ణు కి గుడ్ లక్ చెప్పి, కారు తాళాలు చేతిలో పెట్టాడు.

          ఈ డ్రైవింగ్ టెస్ట్ కోసం, కారు ఒక గంటకి నూట యాభై డాలర్లు కరణ్ కి, ఇది కాకుండా యాభై ఐదు డాలర్లు టెస్ట్ కి ఆస్ట్రేలియా ట్రాన్స్ పోర్ట్ కి, పరీక్ష పాసవ్వగానే మరో అరవై డాలర్లు లైసెన్స్ కోసం ఇలా దాదాపు మూడువందలు డాలర్లు వరకు భారీగానే ఖర్చు పెట్టి టెస్ట్ చేయబోతున్నాడు విష్ణు సాయి. ‘అపుడే దేశానికి క్రొత్తగా వచ్చి, ఇంకా
సంపాదన కూడా మొదలు పెట్టని స్థితిలో, రిస్క్ తీసుకుని లైసెన్స్ కోసం పడే పాట్లు నిజంగా కత్తి మీద సామువంటిదే. గవర్నమెంట్ ఈ విషయంలో క్రొత్తగా కంట్రీకి మైగ్రేట్ అయ్యి, వచ్చినవాళ్ళకి రాయితీలు ఇస్తే, నిజంగా ఎంత బాగుంటుంది? ఇవన్నీ ఎపుడు జరగాలి కనుక, అలా అయితే, జీవితంలో కష్టం ఏముటుంది, నేను విశాల దగ్గర వెలితి పడి, డబ్బు తీసుకోవలసిన అవసరమే ఉండేది కాదు కదా!’ అలా తెలియకుండానే ఆలోచనల అలలు మనసులో తళుక్కుమన్నాయి విష్ణుకి.

          విష్ణుసాయి కారు డ్రైవింగ్ సీట్ లో కూర్చోగానే ఎగ్జామినర్ రాబర్ట్ వచ్చి, కారు లైట్ ఇండికేషన్స్, రోడ్ వర్దీనెస్ చెక్ చేసి ప్రక్క సీటులో కూర్చున్నాడు. విష్ణుసాయి తో “నేను నీకు ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చినపుడు, కారు ఆ దిక్కుగా పోనివ్వాలి. నీకు ఏమైనా  సందేహా లుంటే అడగవచ్చు.” అన్నాడు రాబర్ట్.

          విష్ణు, రాబర్ట్ చెప్పినవన్నీ విని, మనసులో గుండె దడ దడ మని కొట్టుకుంటున్నా, గంభీరంగా, ఆత్మవిశ్వాసం మొహంలో చెక్కు చెదరనివ్వకుండా నవ్వుతూ, “ఐ యామ్ ఫైన్” అన్నాడు. 

          రైట్, లెఫ్ట్, స్ట్రైట్ ఎగ్జామినర్ ఇన్ స్ట్రక్షన్స్ అనుసరిస్తూ విష్ణు కాస్త టెన్షన్ తో కారు నడువుపుతున్నాడు. ఇంతలో పెద్దపెట్టున శబ్దం చేస్తూ, విష్ణు కారు వెనకాల నుంచి
అంబులెన్స్ వ్యాన్ వేగంగా వస్తోంది. విష్ణుకి ఒక్కసారిగా గుండెలో రాయి పడినట్టయింది.

          ‘ఓ మై గాడ్! ఈ ఆంబులెన్స్ ఇపుడే రావాలా?’ మనసు హెచ్చరించింది, ‘విష్ణు డోంట్ గో ఫర్ దర్’, గ్రీన్ లైట్ ఉన్నాగాని, ఎదరకు వెళ్ళకుండా తెలివిగా విష్ణు జాగా ఇచ్చి, బ్రేక్ మీద కాలు పెట్టి పూర్తిగా స్లో డౌన్ అయ్యాడు. క్షణాల్లో ఆంబులెన్స్ దాటుకుంటూ
శరవేగంతో వెళ్ళిపోయింది.

          ఎగ్జామినర్ విష్ణు అలర్ట్ నెస్ కి హెజార్డ్ ఐడెంటిఫై చేసినందుకు బోనస్ పాయింట్స్ స్కోర్ షీట్ లో వేసాడు.

          తరువాత మెయిన్ రోడ్డు దాటి, ప్రక్క సందులోకి మలుపు తిరగగానే, అది స్కూల్ జోన్ కావడంతో, విష్ణు స్పీడు నలభై కిలో మీటర్లకి తగ్గించాడు. నిజంగా ఆ రోజు మాములు కన్నా కాస్త రద్దీగా ఉంది. విష్ణులో ఉన్న సుగుణం, స్ట్రెస్ లెవెల్ ఎక్కువ గా ఉన్నపుడు చాలా అలర్ట్ అయిపోయి, సీరియస్ గా తీసుకుంటాడు. తను చేసే పనిలో కూడా హెజార్డ్ అనాలసిస్ లో గతంలో ఒకపాటి అనుభవం ఇక్కడ అక్కరకు వచ్చింది.

          మొత్తానికి ఎలాగైతేనేం విష్ణు ఒలింపిక్స్ లో హర్డిల్స్ ఎలా దాటతోరో, అలాగే స్టీరింగ్ వీల్ తో చాకచక్యంగా అన్నీ దాటుకుంటూ, డ్రైవింగ్ టెస్ట్ పూర్తి చేసాడు. డ్రైవింగ్ టెస్ట్ రిజల్ట్ కోసం రోడ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ఆఫీస్ లో ఎదురు చూస్తున్నాడు. కౌంటర్ లో విష్ణు నెంబర్ పిలవగానే వెళ్ళాడు. కియారా కంగ్రాట్యులేషన్స్ చెప్పి, అతనికి లైసెన్స్ కోసం ఫోటో తీసుకుంది. డబ్బు కట్టగానే, రసీదుతో పాటు రెండు ఎరుపు రంగులో ఉన్న పీ బోర్డ్స్
అతని చేతిలో పెట్టింది.

          పీ బోర్డ్ చూడగానే , ‘ఇపుడు నేను అర్జంట్ గా కారు తీసుకోవాలన్న మాట. ఖర్చు మీద ఖర్చు, ఏమిటి తక్షణ కర్తవ్యం?’ అనుకుంటూ బయటికి వచ్చాడు. ఎదురుగా డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ కరణ్ వచ్చి కరచాలనం చేసి, కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు. కారు ముందు ఏది తీసుకోవాలో, కారు డీలర్స్ గురించి కరణ్ ని వాకబు చేసాడు. కారు ముంద స్తుగా ప్రాక్టిస్ కావడానికి, సెకండ్ హ్యాండ్ కారు, ఓల్డ్ మోడల్ తీసుకుంటే తక్కువ పడు తుందని చెప్పి, తనకు తెలిసిన డీలర్ దగ్గరకు తీసుకెళ్ళాడు.

          కారు షోరూంలో సెకెండ్ హ్యాండ్ కారులు ఒకవైపు, బ్రాండ్ న్యూ కార్లు మరొకవైపు బారులు తీరి ఉన్నాయి. మార్కెటింగ్ మేనేజర్ బయటకు వచ్చి, సెకెండ్ హ్యాండ్ కారు 90 మోడల్ చూపిస్తూ, ఎక్కువ కిలోమీటర్లు తిరిగినా, మంచి కండిషన్ లో ఉంది. సింగిల్
ఓనర్, ఆటోమేటిక్ స్టీర్ వీల్ డ్రైవింగ్ అని ఫీచర్స్ వివరించి, టెస్ట్ డ్రైవింగ్ కోసం తీసుకెళ్ళాడు. కారు టొయోటా ఓల్డ్ మోడల్, ఎక్కువ కిలోమీటర్లు తిరిగినందున  రెండు వేల డాలర్లు కి అమ్మచూపాడు.

          వారం రోజులలో కారు విత్ పేపర్ వర్క్ సిద్ధం అవుతాయి అని చెప్పాడు. సెకెండ్ హ్యాండ్ కారు కావడంతో ఫైనాన్స్ తీసుకోవడం కుదరదు అని తెలిసింది. డబ్బు రెడీ చేసుకుని, నెక్స్ట్ వీక్ వస్తానని చెపుతాడు విష్ణుసాయి. బస్ ఎక్కి, ఇంటికి చేరుకుంటాడు విష్ణుసాయి.

          ఇంటికి రాగానే, విశాల తలుపు తీసి, స్వాగతం పలకడం విష్ణుకి క్రొత్తగా  అనిపిం చింది. ఇన్నాళ్ళు ఇద్దరూ కలిసి బయటకి వెళ్ళి, కలిసి ఇంటికి వచ్చేవారు. ఈ రోజు విశాల మొదటిసారి, నవ్వు మొహంతో తలుపు తీసి, టీ కప్ తో దర్శనమిచ్చింది.

          “ఐ యామ్ వెరీ ఈగర్ లీ వెయిటింగ్ ఫర్ ద గుడ్ న్యూస్! చెప్పండి” అంటుంది విశాల.

          విష్ణు చేతిలో P ప్లేట్ చూపెట్టగానే, “వావ్ యూ ఆర్ ఎ విన్నర్. ఐ యామ్ వెరీ హ్యాపీ, కారు కొనుక్కునే టైమ్ వచ్చేసింది అన్నమాట” అని కిలకిల నవ్వింది విశాల.

          “అవును విశాలా! ఇపుడే కరణ్ తో వెళ్ళి కారు డీలర్ షిప్ లో సెకెండ్ హ్యాండ్ కారు చూసాను, ఐతే అది 90 మోడల్, రెండువేలు డాలర్లు, ఏం చేయాలా? అని  ఆలోచిస్తు న్నాను” అంటాడు విష్ణు. ఇంతలో విష్ణు ఫోన్ మ్రోగటంతో హలో అంటాడు. అవతలి కంఠం గతంలో తను ఇంటర్వ్యూ కి వెళ్ళినపుడు మాట్లాడిన కన్సల్టెంట్.

          “హాయ్ విష్ణూ! ఆర్ యూ స్టిల్ ఇంటరెస్టెడ్ టూ జాయిన్ నైట్ షిఫ్ట్. డిడ్ యూ గెట్ యువర్ డైవర్స్ లైసెన్స్?”అని కన్సల్టెంట్ అడిగింది.

          తనకు ఇలా డ్రైవర్ లైసెన్స్ రాగానే మళ్ళీ తను కలలుగన్న డ్రీమ్ జాబ్ తనను వెతుక్కుంటూ రావడం, ఆ పొజిషన్ ఇంకా ఖాళీగా ఉండటం విష్ణుకి ఆశ్చర్యం కలిగిం చింది. మారు మాట్లాడకుండా ఆ జాబ్ కి యస్ చెప్పాడు విష్ణు. వచ్చే వారమే జాబ్ లో జాయిన్ అవ్వాలని చెప్పింది కన్సల్టెంట్. వివరాలు అన్నీ నోట్ చేసుకున్నాడు విష్ణు.

          విశాల ఎక్సైట్ మెంట్ తో “వావ్, డబల్ ధమాకా!! ఏంటీ? ఈ రోజు మీరు జాక్
పాట్ కొట్టుకొచ్చారు. ఒకేసారి రెండు శుభవార్తలు.”

          “నీకలా ఉందా విశాలా? నాకైతే ఊపిరి సలపడం లేదు. ఇపుడు కారుకి డబ్బు సిద్ధం
చేసుకోవాలి కదా? ఉన్న బ్లాలెన్స్ అంతా ఊడ్చి, కారు తీసుకోవాలి.” “ఏముంది? ఇలా మీరు ఖర్చు పెట్టగానే, క్రొత్త జాబ్ తో మీకు సేలరీ పడుతుంది కదా! అందాక కాస్త ఓపిక పడదాము. వస్తే కష్టము, సుఖము ఒకేసారి దండయాత్ర చేస్తాయి కదా! కాస్త ఆటు, పోటు తట్టుకోవాలి.” అని సర్ది చెపుతుంది విశాల.

          “అవును! అసలు ఈ రోజు ఇస్తే కారు తెచ్చేసేవాడ్నే. ఎరుపు రంగు కారు, ప్రస్తుతానికి మన అవసరాలు తీరడానికి ఆ కారు ఓకే.” అంటాడు విష్ణు.

          మళ్ళీ, వచ్చిన జాబ్ ఆఫర్ గురించి ఆలోచిస్తూ, “కాకపోతే విశాలా! దేశం కాని దేశం లో నేను నైట్ షిఫ్ట్ కి వెడితే నువ్వు ఉండగలవా?” అంటాడు సందేహంగా విష్ణు.

          “ప్రస్తుతానికి నా దగ్గర సమాధానము లేదండీ! అవసరాలు, పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి. తెరపై వేచి చూడుడు. బెంగ పడవలదు” అంటుంది విశాల.

          ఆ మాటతో విష్ణుకి సంతోషం వచ్చి, “విశాలా! మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న కొటేషన్ ని నిజం చేసే అసలైన సరి జోడీ నువ్వు నాకు. నా కష్టాన్ని అర్థం చేసుకున్నావు. ఈ రోజు లైసెన్స్ సింగిల్ హిట్ లో రావడం నిజంగా మిరకిల్!” అంటూ డ్రైవింగ్ టెస్ట్ లో జరిగిన విషయాలన్నీ పూస గుచ్చినట్లు చెప్పాడు విశాలకి విష్ణు.

          చాలా రోజుల తర్వాత విశాల, విష్ణు ఏ విధమైన అరమరికలు లేకుండా కబుర్లు చెప్పుకున్నారు. వారి ఊసులకు చిగురుటాకులు కూడా ఆగిపోయి, గాలి కూడా చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా వింటూ, పరవశిస్తూ సాక్ష్యాలయ్యాయి.

          ఉదయమే నిద్ర నుంచి లేవగానే ఆదరా బాదరాగా విశాల స్నానాదికాలు ముగించు కుని, ఉప్మా కలియబెట్టింది. ఇంతలో తన ఫోన్ మ్రోగటంతో ఎవరై ఉంటారా? అని తీసింది.

          బ్లాక్ టౌన్ మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్ నుంచి మేగీ ఫోన్ చేసి ఈ వారం తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్రోగ్రామ్ ఫినిష్ అవుతుందని చెప్పింది.

          ఆ మాట వినగానే విశాల కి కాస్త నిరుత్సాహం కలిగి కుర్చీ లో ఆలోచిస్తూ ఉండి పోయింది.

          అసలంటూ ఒక జాబ్, ఇన్ కం వస్తూ ఉంటే రేపటి గురించి బెంగ ఉండదాయె. అసలు కొన్ని ఉద్యోగాలు ఐటి రంగమైనా, ఏ రంగమైనా కానీ రిడండెన్సీ, రిట్రెంచ్ మెంట్ ఆర్ ఫైర్ డ్ ఈ మాటలే చాలా చేదుగా ఉంటాయి. అందులో విశాల, ఇపుడిపుడే వికసిస్తున్న ముగ్థ. జీవితపు మాధుర్యాలను చవి చూస్తోంది. తను చేసేది ఇపుడు కేవలం వర్క్ ఎక్స్ పీరియన్స్ మాత్రమే అయినా కానీ, కాస్తంత ఉత్సాహంతో ఆనందంగా రోజు గడిచిపోతుంది.

          “నిన్న అన్నీ గుడ్ న్యూస్ లు విన్నాను, సంతోషంగా గడిచింది అనుకుంటే మళ్ళీ వెంటనే నా వర్క్ ఎక్స్పీరియన్స్ పూర్తి అయింది అన్న వార్త నచ్చలేదు” అంటూ విష్ణు తో తన బాధను పంచుకుంది విశాల.

          “విశాలా! నీ కోసం మరో అవకాశం ఎదురు చూస్తోంది, డోంట్ వర్రీ. రిలాక్స్. ఈ వారం హ్యాపీగా గడిపెయ్యి. ఇక్కడ చుట్టూ వాతవరణం, ప్లేసెస్ అన్నీ పరిశీలించు. నీకు మళ్ళీ ఈ ఫ్రీ టైమ్ దొరకదు” అని విష్ణు ఊరడిస్తాడు.

          “మా మంచి శ్రీవారు. మీరుండగా నాకు దిగులేల? మీ మాటలే ఆణి ముత్యాలు” అని
అమాయకంగా నవ్వింది విశాల. ఇద్దరూ వారం ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి వెళ్ళి, వచ్చి, ఇంటి పనులు చేసుకుంటూ ఆనందంగా గడిపేసారు.

          శుక్రవారం రాగానే విష్ణు కి తను ఉన్న పరిస్థితిలో కారు కొనడం ఎలా? మిగతా ఖర్చులు, ఇంటి అద్దె ఇవన్నీ ఎలా భరించడం అని మనసులో తర్జన భర్జన పడు తున్నాడు. మరో ప్రక్క విశాల, తన వర్క్ ఎక్స్పీరియన్స్ ఈ శుక్రవారం ముగియబోతుంది. తరవాత ఏం చేయాలి? అని మథన పడుతోంది.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.