రాగసౌరభాలు-8

(తోడి రాగం)

-వాణి నల్లాన్ చక్రవర్తి

          సఖులూ! ఈనెల మనం రాగాలలో కలికితురాయి వంటి రాగం, అత్యంత శ్రావ్యత కలిగిన తోడిరాగం గురించి తెలుసుకుందామా? కొందరు ఈ రాగాన్ని కష్టతరంగా భావించి “తోడి నన్ను తోడెరా” అనుకోవటం కూడా కద్దు. ముందుగా రాగలక్షణాలు తెలుసు కుందాం.

          ఈ రాగం ఎనిమిదవ మేళకర్త రాగం. కటపయాది సూత్రాన్ని అనుసరించి 72 మేళ కర్తల పథకంలో చేర్చడానికి “హనుమ” అనే పదాన్ని కలిపి, హనుమతోడిగా నిర్ణయిం చారు. వెంకటమఖి గారి సాంప్రదాయంలో జనతోడిగా పిలువబడినా, హనుమతోడి, వాడుకలో తోడిగా స్థిరపడింది. ఈ రాగంలోని స్వరస్థానాలు షడ్జమము, శుద్ధ రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మద్యమము, పంచమము, శుద్ధ దైవతము, కైసికి నిషాదము. సర్వస్వరగమకవరీకరక్తి రాగము.మూర్చనాకారక మేళము. షడ్జమము, పంచమము వర్జముతో అత్యంత శ్రావ్యత చేకూరుతుంది. పార్శ్వనాధులు రాగాంగ రాగమని, నారదుడు సూర్యాంశ రాగమని ప్రశంసించిన రాగం. సారంగదేవుల సంగీతరత్నాకరంలో కూడా ఈ రాగం ప్రస్తావన ఉంది. రక్తి రాగాలలో చాలా ఆకర్షణీయం.

          తోడిరాగం రాగాలలో కలికితురాయి వంటిది. జంట ప్రయోగాలకు, దాటు ప్రయోగా లకు కూడా అనుకూలమైనది. విస్తృతమైన రాగాలాపనకు అనువైనది. మంద్ర, మధ్య, తార స్థాయిలలో శోభిస్తుంది. ప్రఖ్యాతి చెందిన మొదటి 10 మేళ కర్తలలో ఒకటి. అనేక జన్య రాగ సంతతి కలిగిన రాగం. గీతం నుంచి పదాలు, తిల్లానాల వరకు ఎంతో అను వైనది. శ్లోకాలకు, పద్య నాటకాలకు అనుకూలమైన రాగం. రాగం, తానం, పల్లవి ఈ రాగంలో శోధిస్తుంది. భక్తి, కరుణ రసాలను చిందించే రాగం.

          కొందరు ఈ రాగం ఉత్తర దేశానికి చెందినదిగా భావిస్తారు. హిందుస్తానీ సంగీతంలో దీనిని “భైరవ్ ధాట్” గా పిలుస్తారు. హిందుస్తానీ తోడిరాగం పూర్తిగా వేరు. తోడిరాగం మనసుకు ప్రశాంతతను కూరుస్తుంది. జలుబు, తలనొప్పి, సైనస్ వంటి సమస్యలకు ఉపశమనాన్ని చేకూరుస్తుందట.

          త్యాగరాజ స్వామి హనుమ సమేత సీతారామలక్ష్మణులను నిత్యం కొలిచేవారు. శ్రీరాముని కృప కోసం 96 కోట్ల రామనామ జపదీక్షకు పూనుకున్నారు. త్యాగరాజుల వారి సోదరుడు జప్యేసుడు, త్యాగరాజస్వామి కీర్తి ప్రతిష్టలకు ఓర్వలేక ఈర్ష్యా సూయలతో స్వామివారి నిత్య కైంకర్యాలు అందుతున్న విగ్రహాలను కావేరీ నదిలో పడవేసినాడు. విగ్రహాలు కనిపించక, వరదలో పిల్లలను కోల్పోయిన తండ్రి వలె విలపించారు త్యాగరాజస్వామి. ఆ శ్రీహరి ప్రహ్లాదుని కోసం స్తంభములో, సుగ్రీవుని కోసం చెట్టు చాటున దాగినాడు, తన కోసం ఎక్కడ దాగినాడు, అని విలపిస్తూ తోడి రాగంలో,“ఎందు దాగినాడు” అనే అద్భుతమైన కీర్తనకు ప్రాణం పోశారు.

          శరభోజి మహారాజు గొప్ప కళాభిమాని. ఆయన ఆస్థానంలో సీతారామయ్య అనే గాయకుడు అకుంఠిత దీక్షతో ఏకధాటిగా ఎనిమిది రోజులు తోడి రాగం గానం చేశారట. ఆయనను తోడి సీతారామయ్యగా కీర్తించారట. సీతారామయ్య తోడిరాగాన్ని తన సంపదగా భావించి, ధనము అవసరమైనప్పుడల్లా ఆ రాగాన్ని కుదువ పెట్టేవాడట. విడిపించుకునే వరకు ఆ రాగాన్ని పాడేవాడు కాదట.

          టి.ఎన్ రాజరత్నంపెళ్లై తమిళనాడులో గొప్ప నాదస్వర విధ్వాంసుడు. తంజావూరు వంటి అనేక దేవాలయాల్లో గంటల కొద్దీ నాదస్వరం పై తోడిరాగం వాయించేవాడట. ఒక్కొక్కసారి తెల్లవార్లు వాయించేవాడట. ఆయన కూడా తోడిరాగాన్ని తన సంపదగా భావించేవాడట.

          ఇవి ప్రచారంలో ఉన్న కొన్ని గాధలు. ఇక ఈ రాగం లో ప్రసిద్ధ రచనలు చూద్దామా?

శాస్త్రీయ  సంగీతం

రాజు  వెడలే 

త్యాగరాజు

కద్దనువారికి 

త్యాగరాజు

ఎందు దాగినాడు

త్యాగరాజు

ఎందుకు దయరాదు

త్యాగరాజు

ఆరగింపవే

https://youtu.be/BH85vTf__Eg?si=gVld8Ln8lQgTWica

త్యాగరాజు

నిన్ను నమ్మినాను

శ్యామ శాస్త్రి

పార్వతీ నిను నే 

శ్యామ శాస్త్రి

రావే హిమగిరి

శ్యామ శాస్త్రి

కమలాంబిక

ముత్తు స్వామి దీక్షితులు

తాయే యశోదా

https://youtu.be/MLe6KWCDoB8?si=muPNiZ2Ku9DWN90j

ఊత్తుకాడు వేంకటకవి

లలిత  సంగీతం

రావేల రసకేళికి

ఎం కే రాము

పీ వీ సాయిబాబా

నీ దయా రస వాహిని

పద్మినిచిత్తరంజన్

చిత్తరంజన్

సినీ సంగీతం

వరాహ  రూపం

https://youtu.be/MLe6KWCDoB8?si=muPNiZ2Ku9DWN90j

కాంతారా

వెడలెను కోదండపాణి

సంపూర్ణ రామాయణం

అఖండ టైటిల్ సాంగ్

అఖండ

సఖులూ! ఇవి ఈనాటి  రాగ  విశేషాలు.  వచ్చే నెల  మరొక  చక్కని  రాగంతో మీ ముందు ఉంటాను.  అంతవరకు  సెలవా మరి?!

 
*****
Please follow and like us:

5 thoughts on “రాగసౌరభాలు- 8 (తోడి రాగం)”

  1. ఎనిమిదవ సంచికగా ఎనిమిదవ మేళకర్తను ఎంచుకొనడం యాదృచ్ఛికమా?

  2. వాణిగారూ,

    నమస్తే. ఈ అంతర్జాల మాసపత్రిక రెండుమూడు రోజుల క్రిందట తారసపడింది. మీ రాగ సౌరభాలు శీర్షిక పేరిట చేస్తున్న రాగ పరిచయం చాలా బాగుంది. మొత్తం ఎనిమిదీ ఒక్క ఉదుటున చదివాను.

    ఒక్కొక్క రాగం గురించిన ఉపోద్ఘాతం, స్వర పరిచయం, సంబంధిత చారిత్రక ప్రస్తావనలూ, ఆ రాగంలో కూర్చిన శాస్త్రీయ, లలిత, సినీ సంగీతాలలో పాటల ఉదాహరణలూ ఎంతో బాగున్నాయి.

    ఇదే విధంగా కొనసాగించండి.

    ఐతే ఒకమాట. మీరు ప్రతి సంచికలోనూ ‘చెలులూ!’ అని మొదలు పెడుతున్నారు. ఈ మాసపత్రికా, అందలి శీర్షికలూ వనితలకే పరిమితమా?

    1. Namaste murthy garu. Meeru abhimaanamtho icchina feed back ki venavela dhanyavaadalu. 🙏🙏 Mee soochana prakaram ikanunchi chelulu Ane sambodhana maanukuntaanu. 😊thanks a ton andi

  3. వాణీ గారు చాలా బాగా రాశారు. తోడి రాగం అంటే చిన్నప్పటి నుంచీ చాలా ఇష్టం. చిన్నతనం లో సంగీతం నేర్చుకునే సమయం లో ‘ అంబ నాదు విన్నపం ‘ అనే కృతి నేర్చుకున్నాను.
    మా అమ్మ, పిన్ని కూడా సంగీతం నేర్చుకున్నారు .పిన్ని కచేరీలు కూడ కొన్ని రోజులు చేసింది.

    ఇప్పటికీ నాకు మన carnatic సంగీతం చాలా ఇష్టం.
    కుదిరినప్పుడు లా వింటూ ఉంటాను.
    తోడి రాగ లక్షణాలు అద్భుతంగా
    వివరించారు

Leave a Reply

Your email address will not be published.