ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా….

-చందలూరి నారాయణరావు

రోజులో
ఏదో ఓ సమయంలో
మాటల షార్టు షర్క్యూట్
చీకటిలో ఉండిపోతం
మౌనం ఇద్దరినీ నంజుకు తింటుంది.
. ………..
కాసేపు ఆగక
తగాదా అని నీవు
కాదని నేను
………..
నేను అడిగిందే కావాలని
ఇష్టం యుద్ధం చేస్తుంది నీతో
స్పందన లేకుండా గంట మాట్లాడతావు
చప్పుడు లేకుండా
…………
నీకేమి కావాలో చెప్పవు
నీకేది ఇవ్వాలో తెలియదు.
దేనికి చప్పుడు చేయకుండా
ఏది అర్దం కాదు…..అర్దముండదు
…….
కానీ ఏదో ఓ క్షణంలో
ఇద్దరం కలిసినప్పుడు
దూరంగా మన మాటలు, చూపులు
వెక్కిరిస్తుంటే
నా భుజంపై వాలి బాధపడతావు
……
నేనేం చేయాలి?
మనమేమి కావాలి?
ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా….
జీవితం ఎప్పటికీ
మనల్ని ఓడించలేదు…

*****

Please follow and like us:

2 thoughts on “ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. (కవిత)”

  1. మనకేం కావాలో మనకే తెలియని అయోమయ స్థితి కి , దాని వలన వచ్చే సమస్య కు పరిష్కారం వెతికే ఆసక్తి కి చక్కటి కవితా రూపం. అభినందనలు

  2. వాస్తవికతకు, మనుషుల మధ్య అంతర్లీనమైన అహానికి, ప్రేమకు మధ్య ఘర్షణకు అక్షరరూపంలా ఉన్నది ఈ కవనం.”దూరంగా మన మాటలు, చూపులు వెక్కిరిస్తుంటే.. నా భుజంపై వాలి బాధపడతావు”.. ఇది అందరికీ అనుభవైకవేద్యం..చక్కని భావయుక్తమైన కవితను అందించిన చందలూరి వారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published.