షర్మిలాం“తరంగం”-34

షర్మిలాం “తరంగం” నేనే ఇండియన్ !! -షర్మిల  భారతీయత అంటే భిన్నత్వంలో ఏకత్వం అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువు కునేదాన్ని! నేను తెలుగు కుటుంబానికి చెందినా, పుట్టింది తమిళనాడులో తాంబరం ఎయిర్ ఫోర్స్ హాస్పటల్ లో. వత్తుగా ఉంగరాలు తిరిగిన జుట్టు Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-33

షర్మిలాం “తరంగం” మనం ఇంతే ! -షర్మిల  మనం మారడం కష్టం ! మన నరనరాల్లో ఇంకిపోయిన తేడాలని దాటిరాలేం!వారసుడు పుట్టాలి అనే మాట తప్ప వారసురాలు అనే మాట ఎప్పుడన్నా విన్నామా మన దేశంలో ? మెగాస్టార్ కొడుక్కి వారసుడు పుడతాడా ? ఫలానా దర్శకుడికి ఎట్టకేలకు వారసుడు పుట్టాడు … ఇలా వుంటాయి మన రాతలు. రాసే వాడో రాసేదో ఎవరో ఇంకా ఆ పాత వాసన కొడుతూనే వున్నారు. ఆడపిల్లలు మాత్రం ఇంకా Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-32

షర్మిలాం “తరంగం” మినీ భారతం  -షర్మిల  మనుషుల మనస్తత్వాలు రకరకాలుగా వుంటాయి. మామూలుగా గతంలో మాదిరిగా పక్క పక్క ఇళ్ళల్లో నివసించే వారినేచూసే అవకాశం వుండేది. ఇప్పుడలా కాదు అపార్ట్మెంట్ కల్చర్ బాగా ఎక్కువైంది. అంతమంది ఒకే చోట నివశిస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళని సన్నిహితంగా Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-31

షర్మిలాం “తరంగం” లోకో భిన్నరుచిః -షర్మిల  ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా వుంటాయి. నేను ఇష్టపడేదే గొప్ప… పక్క వాళ్ళ ది తక్కువ అనుకునే వాళ్ళు చాలామంది వుంటారు. ఈ మధ్య పంది మాంసం తింటే పంది బుద్ధి, జంతు మాంసం తింటేజంతువుల Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-30

షర్మిలాం “తరంగం” మానవాళి నివాళి  -షర్మిల  ఒక్కోసారి ధైర్యం పోగొట్టుకుంటాం. మన చుట్టూ మమతలు పెనవేసుకున్న వారెందరో నిష్క్రమిస్తుంటే నిస్సహాయంగా  వుండిపోవడం ఎంత శిక్ష ? కరోనా ఎందర్ని ఎత్తుకుపోయిందో తల్చుకుంటే గుండె చెరువవుతుంది. ఆషామాషీగా ముక్కుకి నోటికీ ఒక మాస్క్  వేసుకుంటే దగ్గరకు రాదనుకొనే కోట్లాది జనంలాగానే నేనూ కాబోలనుకున్నాను. కానీ మృత్యుదేవత మారువేషమని నా సన్నిహితులెందరినో పోగొట్టుకున్నాకే అర్ధం అయ్యింది. కరుణాకర్ మా మరిది ఫ్రెండ్.  నేను పెళ్ళయి అత్తగారి ఇంట్లో అడుగుపెట్టిన  దగ్గర నుంచి “వదిన గారూ ! అంటూ నీడలా తిరిగేవాడు. నా కూతురు మాకంటే Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-29

షర్మిలాం “తరంగం” మచ్చల్ని చెరిపేద్దాం ! -షర్మిల (Sharmila) బుల్లీబాయ్ అనే యాప్ లో ముస్లిం మహిళల ముఖాలతో అసభ్యమైన ఫొటోలు మార్ఫింగ్ చేసి వారిని వేలం పాటకు పెడుతూన్న ఉదంతం ఇప్పుడు ఎందరో మహిళల్ని కలవరపెడుతోంది .ఈ ఏప్ లక్ష్యం Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-28

షర్మిలాం “తరంగం” పరువు తీస్తున్న హత్యలివి ! -షర్మిల కోనేరు  ఇప్పుడే ఒక వార్త చదివాను. మహారాష్ట్రలో ఒక యువతి తల ఆమె తమ్ముడే తెగ నరికి తల్లితో సహా పోలీసులకి లొంగిపోయాడు.  ఈ హత్యకి కారణం ఆమెకు నచ్చిన యువకుడ్ని పారిపోయి పెళ్ళిచేసుకోవడమే ! తమ పరువు పోయిందన్న కోపంతో రగిలి పోయారు. పెళ్ళి చేసుకుని అదే వూరిలో ఆ యువకుడి కుటుంబంతో వుంటోంది ఆ అమ్మాయి. తల్లి, తమ్ముడు Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-27

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  యోలో you only live once “ ఉన్నది ఒక్కటే జీవితం “అనేదియువతరం ఇటీవల తరచూ ఉపయోగించే మాట. నాణానికి రెండు ముఖాలున్నట్టు ఉన్న  ఒక్క జీవితాన్ని తమ ఇష్టానుసారంగా విచ్చలవిడిగాబతుకుతామనడం ఒకటి. ఉన్నది ఒకే జీవితం కాబట్టి అర్ధవంతంగా జీవించాలనుకోవడం రెండోది! జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాలంటే ఎన్నో దశలు దాటాలి. బాల్యంలో తల్లితండ్రుల, తాతముత్తవల లాలనలో మాధుర్యం చవిచూస్తాం. కొంచం పెద్దయ్యాకా స్నేహితులే ప్రపంచంగా కనిపిస్తారు. ఈ దశలో కుటుంబం కన్నా ఫ్రెండ్స్ ముఖ్యం అనుకుంటాం. ఈ టీనేజ్ లో పిల్లల పెంపకాన్ని కత్తి మీద సాము తో పోల్చవచ్చు. వాళ్ళ మూడ్స్ ప్రకారం మనం నడుచుకోవాల్సి వస్తుంది. ఫోన్ చాటింగ్ ల కోసం ఫోన్లు ఇవ్వమని డ్రగ్ ఎడిక్ట్ ల్లాగా తహ తహలాడతారు. ఇవన్నీ తగ్గించుకోమంటే వాళ్ళను శతృవుల్లా చూడడం మొదలెడ్తారు. డ్రగ్స్ అంటే గుర్తొచ్చింది టీనేజ్ దాటి యుక్తవయసు వచ్చి స్వతంత్రంగాతిరగడం మొదలెట్టాకా మత్తుకు బానిసలవుతున్న యువతరం కూడాగతంతో పోలుస్తే ఎక్కువయ్యింది. బడాబాబుల పిల్లలైతే డబ్బు కొదవ వుండదు. కానీ వాళ్ళని చూసి వాతలు పెట్టుకునే మధ్య తరగతి పిల్లలుకుటుంబానికి నరకం చూపిస్తున్నారు. నాకు తెలిసిన కుటుంబం గురించి చెప్తాను. తండ్రి చనిపోతే తల్లి ఇద్దరు మగపిల్లలని. ఉన్న ఆస్తులు అమ్మి బ్యాంక్లో వేసుకుని ఆ వడ్డితో సాకుతోంది. ఆ ఇద్దరు పిల్లలూ 19,21 ఏళ్ళవాళ్ళు . డిగ్రీ చదివే ఈ ఇద్దరు పిల్లలూ డ్రగ్స్ కి అలవాటు పడ్డారు. తల్లిని డబ్బులివ్వమని డిమాండ్ చెయ్యడం ఆమె ఇవ్వనని అంటేఇంట్లో వున్న పప్పులు నూనెలు పారబోసి బిభత్సం సృష్టించి డబ్బుతీసుకునే వారు. తలుపులు వేసుకుంటే బద్దలు కొట్టడానికి కూడా వెనుకాడడం లేదట. ఒక ఫంక్షన్ లో కనిపించి ఆ తల్లి ఇవన్నీ చెప్పి ఏడ్చింది. Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-26

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  దేముడైన రాముడు అందాల రాముడు ! ఇనకులాద్రి సోముడు ఎందువలన దేముడు !! ఈ పాట నాకు ఎందుకో ఇష్టం . అమ్మో ! ఈ మధ్య కాలంలో రాముడిని తలవాలన్నా భయమేస్తోంది ! నా మీద ఏం హిందూత్వ ముద్ర పడుతుందోనని . రామాయణ విషవృక్షం పదో తరగతిలోనే చదివేశానంటే నేను అంతభక్తురాలిని కాదని అర్ధమేగా ! పూజలు చెయ్యను గానీ దేముడ్ని నమ్ముతాను. రాముడైనా జీసస్ అయినా దేముడు అనే ఒక శక్తి మాత్రం  వుందనుకుంటాను. ఒక్కోసారి ముందు దేన్నో తన్నుకుని పడబోతే ఎవరో పడిపోకుండాపట్టుకుని ఆపినట్టనిపిస్తుంది . మన బుర్ర ఎంత గొప్పదంటే మన సర్వ అవయవాలని హెచ్చరించిరాబోయే ప్రమాదాన్ని ఆపుతుంది . కానీ అన్నమయ్య వంటి భక్తుడు “పొడగంటిమయ్యా నిన్నుపురుషోత్తమా ! అనే కీర్తనలో మమ్ము తావై రక్షించే ధరణీ ధరా !! ” అని సాక్షాత్తూ ఆ వెంకటేశుడేమనం నిల్చున్న ఆ తావు తానై కాపాడుతాడని నమ్ముతాడు . మన మెదడో … దేముడో …ఏదో శక్తి మనం గోతిలో పడకుండాకాపాడిందనేది నిజం ! అది దేముడే అని నమ్మి మనకి నిరంతరం ఒక శక్తి ఆలంబనగానిలుస్తుందని అనుకోవడమే ఒక నమ్మకం, నమ్మకం మూఢత్వంగా మారనంత వరకూ ఇబ్బంది లేదు . కానీ నమ్మకాలు మూఢనమ్మకాలుగా మారడం అది విపరీతాలకు దారితీయడం తప్పదు. అందుకే శాస్త్రీయంగా ఆలోచించడం శ్రేయస్కరం. ఇంతకీ రాముడి గురించి చెప్పాను కదా ! నాయనమ్మ పక్కలో పడుకున్నప్పుడు చెప్పిన రామాయణం నుంచి బాపూ తీసిన సీతాకల్యాణం వరకూ చూపించినప్రభావమేమో మరి !రాముడు గుండెల్లో వద్దన్నా కొలువయ్యాడు. పడుకునేటప్పుడు శ్రద్ధాకి నాతో కధ చెప్పించుకునే అలవాటు. ఎన్నని కధలు చెప్పను… మొన్నోరోజు శబరి తాను ఎంగిలి చేసిన పళ్ళను రాముడికి పెట్టిన కధచెప్పాను . ఒక ముదుసలి కొరికి ఇచ్చిన పళ్ళను అసహ్యించుకోకుండా అందులోప్రేమనే  చూసి వాటిని ఆరగించాడు రాముడు ! ఆ ప్రేమతత్వమే రాముడనే మనిషిని దేముడ్ని చేసిందేమోఅనిపించింది ఆ కధ విశ్లేషించుకుంటే … Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-25

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  సంసారం సంగీతం ఆన్నాడొకాయన …సంసారం సాగరం అంటుందిఒకావిడ . సంసారం నిస్సారం అని కొందరి నిర్వచనం. భార్యాభర్తల బంధం ఎప్పుడూ పాత సినిమాల్లో చూపించినట్టుండదు. తెల్లారేటప్పటికి తలస్నానం చేసి జారు ముడేసుకుని కాఫీ కప్పు చేత్తోపట్టుకుని బెడ్రూంలో పవళించిన భర్తగారిని గోముగా లేపుతుందిహీరోయిన్. అప్పుడు భర్త ఆమె మొహంలోకి తదేకంగా చూస్తూ “జ్యోతీ ! నేనెంతఅదృష్టవంతుడ్ని ” అంటూ కాఫీ కప్పుతో పాటు ఆమె చేయిఅందుకుంటాడు. పాపం ఆ పాత సినిమాల ప్రభావం ఇప్పటికీ చాలా మందికి వదల్లేదు. ఇంకా పెళ్ళాలు ఎదురెదురుగా కాఫీ కప్పులు అందిస్తూ , షూ లేసులుముడేస్తూ ఆనక ఏం ఉద్యోగమైనా చేసుకోవచ్చుగా అని ఆశగా ఎదురుచూస్తూ వుంటారు . అలా వాస్తవంలో చచ్చినా జరగదు ఎవరి కాఫీ వాళ్ళు చేసుకుని ఆఫీసురూముల్లోకి పరిగెత్తాల్సిందే ! అబ్బాయిలనే కాదు అమ్మాయిల ఆలోచనలు ఇలాగే వుంటాయి. “లవ్ యూ హనీ !”అని మాటి మాటికీ భర్త చెప్పాలని .. తననేఅంటిపెట్టుకుని తిరగాలని ఆశపడుతుంది. మగాడు మొగుడయ్యాక “లవ్ యూ !” అని ఆమె కి చెప్పడం పెద్దనామోషీ అనుకుంటాడు. ఏ చీరో , డ్రెస్సో వేసుకుని  బయటకి వెళ్తే బయట వాళ్ళయినా బాగుందనికాంప్లిమెంట్  ఇస్తారేమో గానీ మొగుడు మాత్రం చచ్చినా మెచ్చుకోడు. ఇవన్నీ చిన్న విషయాలు. అన్నీ మనం ఊహించుకున్నట్టు జరగవు. ఊహలకు రెక్కలుంటాయి. అందుకే వాస్తవం కటువుగా కనిపిస్తుంది. మన ఎక్స్పెక్టేషన్ (expectetion) కు తగ్గట్టు ఎదుటి వారువుండాలనుకోవడం అత్యాశ! సరిపెట్టుకునే మనస్తత్వాలు తగ్గిపోతున్న కొద్దీ సంసారం నిస్సారంగా నేమిగిలి పోతుంది. తరాలు మారుతున్న కొద్దీ జీవన విధానాలు మారుతూ వుంటాయి . మా తాత భోజనం చేస్తుంటే నాన్నమ్మ విసిరేది. నా టైం లో టేబుల్ మీద అన్నీ వేడిగా పెట్టి , ప్లేట్ పెట్టాను  తినండి ! అనిచెప్పేదాన్ని. ఇప్పుడు  ఇటూ అటూ కాని తరం  భార్య వంట చేసి పెడితే ప్లేట్ వాళ్ళేతెచ్చుకుని వాళ్ళే వేడి చేసుకుని తింటున్నారు. ఎవరి ప్లేట్ వారు తీసుకునే వరకూ మార్పు వస్తోంది. ఏ దేశం వెళ్ళినా వండి అమర్చే బాధ్యత నుంచి  భారతీయ మహిళకివిముక్తి దొరకదు. కానీ మార్పు అనివార్యం. Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-24

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  ఒకప్పుడు ప్రపంచం ఎంతో అందంగా ఆశావహంగా కనిపించేది. ఇప్పుడు అంతా తల్లకిందులైంది . ఎక్కడ చూసినా వేదన, రోదనలే ! మనుషులు ఏకాంతవాసంలో బతుకుతూ మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నారు. నిన్నే బీబీసీ లో ఒక న్యూస్ Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-23

షర్మిలాం “తరంగం” కనబడని శత్రువుతో పోరాటం ! -షర్మిల కోనేరు  ఈ బంధాలు శాశ్వతం కాదు అని చెప్తుంది వేదాంతం. ” రాక తప్పదు పోక తప్పదు ” అని అనుకుంటాం నిర్వేదంగా ! జగం అనే రంగస్థలం పైన మనం పాత్రధారులం అని కూడా అంటాం … కానీ ఈ రాక కి పోక కి మధ్య జరిగేవి ఉత్తి సన్నివేశాలేనా ? నాటకంలో నటిస్తాం జగన్నాటకంలో జీవిస్తాం! నటించడం అయిపోగానే పాత్రధారి నిష్క్రమిస్తే ఆ పాత్ర ముగిసినట్టే, కానీ జీవితంలో అలా కాదు ఆ మనిషి తోపెనవేసుకున్న ఎన్నో జీవితాలు అల్లకల్లోలం అవుతాయి. నడి సముద్రంలో జారవిడిచి నావ తీరానికి జేరిపోతే ఒడ్డెక్కడం ఎంత కష్టం! ఇప్పుడు ఈ కరోనా చేసే కరాళ నృత్యంలో పిల్లలకు తలులు , కొందరు పిల్లలకు తండ్రులు దూరం అవుతున్నారు. భర్తను పోగొట్టుకున్న  భార్యలు … భార్యలకు దూరమైన భర్తలు ఇంటరై బేలగా ఈ సంసారాన్ని తోడు లేకుండా ఎలాఈదాలో తెలియక తల్లడిల్లుతున్నారు . వృద్ధ తల్లి తండ్రులకు తీరని శోకం మిగులుతోంది. ఇవన్నీ చూస్తూ ఇంకెన్ని చూడాలో తెల్యక గుండెలు చిక్కబట్టుకుని బతుకుతోంది భారత దేశం . రాజకీయ ఎత్తుగడల్లో మునిగితేలడం  తప్ప ప్రజలి రక్షించే వ్యూహరచన లేని నాయకత్వాన్ని నిందించాలో తమ ఖర్మకిఏడ్వాలో తెలియని జనం శ్మశానాల దగ్గర బారులు తీరుతున్నారు. ఇదంతా మిధ్య అని చెప్పే వేదాంతం మాకొద్దు. జీవితం బుద్భుదప్రాయం కాదు. ఆలింగనాలు , అలకలు, కోపతాపాలు , ఆవేశ కావేషాలు  ప్రేమలు , బాధ్యతలు ఇంకెన్నెన్నో రంగుల సమ్మేళనం. ఒక క్రిమి గాని క్రిమి పడగ విప్పి జనాల్ని కాటేస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాత . ఆప్తుల్ని పోగొట్టుకున్న వారిని వాటేసుకుని ఓదార్చడానికి సాటి మనుషులు సాహసించలేని పాడు కాలం దాపురించింది . కానీ మనిషి ఏనాటికైనా జయిస్తాడు. అంతవరకూ కరోనాతో జరిగే ఈ యుద్ధంలో మరణించిన అమరవీరులకు నివాళులు అర్పిద్దాం . అస్త్రం దొరికే వరకూ మనని మనం కాడుకుంటూ బాధితులకు బాసటగా నిలవడమే అందాకా మనం చేయాల్సిన పని ! ***** షర్మిల Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-22

షర్మిలాం “తరంగం” వెంటాడే రుచులు -షర్మిల కోనేరు  గడిచిపోయిన క్షణాలు జ్ఞాపకాలై ఎప్పుడూ మనవెంటే వుంటాయి. అవి తలుచుకుంటే బడికెళ్ళేటప్పుడు అమ్మ ఇచ్చిన భోజనం క్యారేజీలా కమ్మగా వుంటాయి. స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళే భోజనం క్యారేజీలు గొప్ప సామ్యవాదం నేర్పేవి. పేదాగొప్పా Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-21

షర్మిలాం “తరంగం” ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ ! -షర్మిల కోనేరు  ఏజ్ జస్ట్ ఏ నంబర్ ! ఈ మాట ఇటీవల తరచుగా వినబడుతోంది ! నేను మీడియాలో పనిచేసేటప్పుడు మా రిపోర్టర్లు 50 ఏళ్ళకు పైబడిన వారిగురించి Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-20

షర్మిలాం “తరంగం” ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్ ! -షర్మిల కోనేరు  ఏజ్ జస్ట్ ఏ నంబర్ ! ఈ మాట ఇటీవల తరచుగా వినబడుతోంది ! నేను మీడియాలో పనిచేసేటప్పుడు మా రిపోర్టర్లు 50 ఏళ్ళకు పైబడిన వారిగురించి Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-19

షర్మిలాం “తరంగం” మార్పు మంచిదే ! -షర్మిల కోనేరు  “కాలం మారిపోయిందండీ ఆ రోజుల్లో … అని గతంలోకి వెళ్ళి పోతారు. కాలం ఎప్పుడూ మారదు కొత్త పోకడలు వస్తాయంతే . కరెంటు తీగ సన్నగా కనపడ్డా  లావుగా కనబడ్డా లోపల Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-18

షర్మిలాం “తరంగం” మానవా జయోస్తు !!! -షర్మిల కోనేరు  ఒక ఉపద్రవం మానవాళిని చుట్టుముట్టినప్పుడు మనో నిబ్బరంతోముందుకు సాగడం ముఖ్యం. ప్రాణాల్ని , ఆరోగ్యాన్నే కాదు మానవ సంబంధాలనీ కాపాడుకోవాల్సినతరుణం ఇది. కుటుంబ వ్యవస్థ మీద ఈ కూడా కోవిడ్ దాడి మొదలైంది. కంటికి కనిపించనంత చిన్నగా మొదలైన ఈ ఫ్రస్ట్రేషన్ కొండంతగామారక ముందే వేక్సిన్ వస్తే బాగుండును! మొదట కరోనా వైరస్ నియంత్రణకి లాక్డౌన్ పెట్టినప్పడు రోజుకో రకంవంటలు చేసుకుని తిని అందరూ ఒక్కచోట వున్నామన్న ఆనందంతోగడిపారు. అంతా కొద్ది నెలల్లో సర్దుకుంటుందన్న ధీమాతో కాలంగడిపారు. కానీ ఏడాదైనా అదే పరిస్థితి. ముఖ్యంగా స్కూలుకి వెళ్ళే వయసు పిల్లల మానసిక స్థితి దీనంగావుంది. ఇండియాలో పెద్ద క్లాసుల పిల్లలు  కొంతమేర బడికి వెళ్తున్నా మిగతాఅందరూ ఇళ్ళలోనే …. కొండల మీద నుంచి దూకే జలపాతాల్ని  పిల్ల కాలువలోబంధించగలమా ? పైకి చెప్పుకోలేని శిలువల్ని బాల ఏసుల్లా మోస్తున్నారు. స్కూళ్ళు లేవు, తోటి పిల్లలు. స్నేహితులు లేరు. ఆన్ లైన్ పాఠాలు విజ్ఞానాన్ని ఇస్తాయేమో గానీ ఆ పసి మనసులకివేసిన సంకెళ్ళని ఏ ఆన్ లైన్ పగలగొట్టలేదు. ఇంకోపక్క ఇంట్లో తల్లితండ్రుల నిస్సహాయత అసహనంగా మారుతోంది. రోజూ బడికి వెళ్ళే పిల్లలు ఇంట్లో 24 గంటలూ వుంటే వాళ్ళ అల్లరినిభరించలేని తల్లుల మానసిక స్థితి మారుతోంది. పనివత్తిడి వాళ్ళని యంత్రాలుగా మారుస్తోంది. ఒక పక్క సోషల్ గేదరింగ్స్ లేవు , పార్టీలు లేవు , షాపింగ్లు లేవు. ఎంతసేపూ ఇల్లే ఇల్లు. స్వర్గంగా కనపడాల్సిన  ఇల్లు చాలా మంది గృహిణులకి నరకంగాకనిపిస్తోంది. ఇక ఇళ్ళ నుంచి పనిచేసే మహిళల పాట్లు చెప్పలేము. ఇటు ఇంటిలోనే ఎక్కువ సమయం గడపడం వల్ల భార్యా భర్తలసఖ్యతపైన కూడా ప్రభావం చూపిస్తోంది. ఇన్నాళ్ళూ ఆఫీసుకి వెళ్ళి అక్కడ సహోద్యోగులతో కలిసి పని చేసి ఇంటికివచ్చి కుటుంబంతో గడపడం అలవాటైంది. ఇప్పుడు పరిస్థితి అది కాదు . ఏదో నిరాశాపూరిత వాతావరణం అలముకుంటోంది. ఇది పిల్లల్లోనూ పెద్దలోనూ కనిపిస్తోంది. Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-17

షర్మిలాం “తరంగం” నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ ! -షర్మిల కోనేరు  ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి . ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-16

షర్మిలాం “తరంగం” నో (వరస్ట్ ) కామెంట్స్ ప్లీజ్ ! -షర్మిల కోనేరు  ఇన్నాళ్ళూ మనకి తెలియని మనుషుల మనస్తత్వాలు ఇప్పుడు బయటపడుతున్నాయి . ఫేస్బుక్ ,ట్విటర్ వంటివి రాక ముందు మూక మనస్తత్వం , ఈ గ్రూపులు కట్టడాలు అంతగా Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-15

షర్మిలాం “తరంగం” ఇండియా వెలిగిపో !! -షర్మిల కోనేరు  దేశమంతా లాక్డౌన్ కాగానే హాస్టళ్ళ నుంచి పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వర్క్ ఫ్రం హోం లని ఇళ్ళకి చేరితే…అబ్బ ఇళ్ళన్నీ మళ్ళీ కళకళలాడుతున్నాయ్అనిఅనుకున్నాను. మరో రెండువారాలకు ఆ ఇంటిఇల్లాలు చాకిరీతో Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-14

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  వెంటాడే అపరిచితులు జీవనయానం లో మనకు తారసపడే అసంఖ్యాక జనప్రవాహంలో కొందరుజీవితాంతం గుర్తుండి పోతారు. ఒకపోర్టర్, డ్రైవర్ , రిక్షావాలా ఎవరైనా కావచ్చు.వాళ్ళు చేసిన ఉడతసాయం జీవిత కాలం తలపుల్లో మిగిలిపోతుంది. సహ ప్రయాణీకులు గమ్యంవచ్చినాక Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-13

షర్మిలాం “తరంగం” -షర్మిల కోనేరు  ఇల్లాళ్లూ వర్ధిల్లండి! ” పాపం పొద్దున్నుంచి ఇంటెడు చాకిరీ , అందుకే మా అవిడకి సాయం చేస్తున్నా ‘” అని ఈ మధ్య మగాళ్ల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట ! కరోనా తల్లి పుణ్యమా Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-12

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  పుణ్యం పంచే పూల దొంగలు నేను మొదటగా అచ్చులో చూసుకున్న ” ఓ పువ్వు పూయించండి “అనే ఆర్టికల్ దూషణ భూషణ తిరస్కారాలకు లోనైంది ! ఇంత భారీ పదం నేను రాసిన ఆ సింగిల్ కాలమ్ Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-11

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  డైటింగోపాఖ్యానం మా చిన్నప్పుడు ముప్పొద్దులా అంత అన్నం , పచ్చడి , మీగడపెరుగు ఏసుకుని కమ్మగా తినేవాళ్ళం . పచ్చడంటే పండుమిరపకాయ కావొచ్చు మావిడికాయ , మాగాయ ఏదో ఒకటి ! పైగా నెయ్యేసుకుని తినే వాళ్ళం Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-10

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  నాగరాణుల కోరల్లో బుల్లితెర తెలుగు సీరియళ్ళలో ఏడుపులు, కుట్రలు లేకుండా ఏ సీరియల్లూ ఎందుకు తీయరు ? ఈ ప్రశ్న తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తల వేయి వక్కలవుతుందని విక్రమార్కుడి భుజం మీద వేలాడుతున్న భేతాళుడు Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-9

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  చిరాయురస్తు  అమ్మా నాకు బతకాలనుంది …కానీ నేను చచ్చిపోతున్నాను . ” నన్ను ఒకడు వాడి గదికి రమ్మంటున్నాడు , లేకపోతే నా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటున్నాడు అందుకే చచ్చి పోతున్నాను ” అని Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-8

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  మనం మారాల్సిందే మా లక్ష్మి చెప్పిన విషయం విని నిజంగా ఆశ్చర్యపోయాను . ఏంటి ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం ఇద్దరు ఆడపిల్లలు వుండగా రెండు లక్షలు పెట్టి ఒక మగ పిల్లడ్ని కొనుక్కుని పెంచుకుంటున్నారా ! Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-7

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  ఇదీ మాట్టాడుకోవాల్సిందే ! కొన్ని విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి . కానీ వాటిగురించి పెద్ద చర్చే చేయాల్సి వస్తుంటంది ఒక్కోసారి . మన ఇళ్లల్లో ఎంగిలిపళ్లాలు కడిగి మనం పారేసే చెత్తని ఊడ్చి శుభ్రం చేసే Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-6

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు “ఆడదిగాపుట్టడం కంటే అడివిలో మానై పుట్టడం మేలు” అని ఏ ఆడపిల్ల ఎంత నిర్వేదంతో అందో ఏమో! ఒకప్పుడు ఆ నానుడి నాకు నచ్చేదికాదు .నిరాశావాదం లాగా అనిపించేది “నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం” అన్న మహాకవి Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-5

షర్మిలాం”తరంగం” అత్తా కోడళ్ల అంతర్యుద్ధాలు -షర్మిల కోనేరు  “పెళ్లైంది మొదలు మా అబ్బాయి మారిపోయాడేంటో !” అంటా నిట్టూర్చే తల్లులూ ఒకప్పటి కోడళ్లే ! పెళ్లైన కొత్తల్లో”అమ్మ అమ్మ ” అని తిరిగే మొగుడ్ని చూస్తే మండిపోతుందంటూ సణుక్కునే ఆమె కాస్తా Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-4

షర్మిలాం”తరంగం” వ్యక్తిగతాల్లోకి జొరపడొద్దు -షర్మిల కోనేరు  పక్కవాళ్ల జీవితాల్లోకి తొంగి చూసే నైజం మనలో ఎక్కువగానే కనిపిస్తుంది . వాళ్లతో కష్టం సుఖం పంచుకోవడం వేరు వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడడం వేరు. ఎదుటివాళ్ల వ్యక్తిగతాన్ని వాళ్లకే వదిలెయ్యాలనే కనీస స్పృహ లోపిస్తోంది. Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-3

షర్మిలాం”తరంగం” అమ్మాయంటే ఆస్తి కాదురా ! -షర్మిల కోనేరు  అయిదుగురూ సమానంగా పంచుకోమని తల్లి చెప్తే పాండవులు ద్రౌపదిని పంచుకున్నారని భారతంలో విన్నాం . ఆస్తి పంచుకున్నట్టు అమ్మాయిని పంచుకోవడం ఏంటో ! ఆడాళ్లని వస్తువులుగా ఆస్తులుగా చూడడం అప్పుడూ ఇప్పుడూ Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-2

షర్మిలాం“తరంగం”  -షర్మిల కోనేరు ” దైవం మానుష రూపేణా ” అంటారు . ఈ మాట వాడుతున్నానని నేనేదో సంస్కృత పండితురాల్ని అనుకునేరు … నేను ఆరు ఏడో తరగతుల్లో సంస్కృతం నేర్చుకున్నాను గానీ రఘు వంశం , దిలీపుడు అన్న Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-1

షర్మిలాం“తరంగం”  -షర్మిల కోనేరు ” దైవం మానుష రూపేణా ” అంటారు . ఈ మాట వాడుతున్నానని నేనేదో సంస్కృత పండితురాల్ని అనుకునేరు … నేను ఆరు ఏడో తరగతుల్లో సంస్కృతం నేర్చుకున్నాను గానీ రఘు వంశం , దిలీపుడు అన్న Continue Reading

Posted On :