image_print

సంపాదకీయం-ఆగష్ట్, 2025

“నెచ్చెలి”మాట బుద్బుదం -డా|| కె.గీత  “బుద్బుదం” అనగానేమి? అయ్యో, ఇదీ తెలియదా? అదేనండీ జీవితం బుద్బుదమనగా నీటి బుడగ అని అనుకొంటినే! అయినను జీవితానికీ బుద్బుదానికీ సంబంధమేమి చెప్మా! సంబంధమూ బాంధవ్యమూ కాదు- జీవితమే ఒక బుద్బుదం ఎప్పుడు మాయమవునో దానికే తెలియదు మరదేవిటీ? కలకాలం ఉండునదే జీవితం అన్నట్టు గర్వాధికారమున విర్రవీగువారు- ధనాంధకారమున కన్నూ మిన్నూ కానని వారు- కళ్ళు నెత్తికెక్కిన వారు…. తలపొగరువారు…. మున్నగువారికిది తెలియదా? ఎప్పటికీ ఈ భూమి పైన సజీవముగా ఉండునటుల […]

Continue Reading
Posted On :

అపోహలూ-నిజాలూ (శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

అపోహలూ– నిజాలూ (శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -యశోదాకైలాస్ పులుగుర్త “రేపటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ని ప్రకటించింది మా మేనేజ్ మెంట్!”  ఆఫీస్ నుండి వస్తూనే ఇంట్లో అందరికీ వినబడేటట్లుగా చెప్పింది వైష్ణవి. “ఓ, నైస్వైషూ!”  ఇకనుండి పొద్దుట పొద్దుటే ఆఫీస్ వేన్ ఎక్కడ మిస్ అవుతానో అనుకుంటూ పరుగులు పెట్టనక్కర్లేదు. ఎంత మంచి వార్త చెప్పావంటూ,”  భర్త  పవన్,  వైష్ణవి వైపు […]

Continue Reading

ఏఐ ఏజి రాధ (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

ఏఐ ఏజి రాధ  (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -రామలక్ష్మి జొన్నలగడ్డ మనిషిలో మనీ ఉండొచ్చు, షి ఉండొచ్చు- కానీ మనిషి అంటే మగాడు. కేవలం మగాడు. మనిషిలో షి ఉండొచ్చు. కానీ మహిళ మనిషి కాదు. మనిషి అంటే కేవలం మగాడు. అంటే ఈ భూమ్మీద ఉంటున్నది మనుషులూ, మహిళలూ! వీళ్లతో స్టోన్ ఏజి దాటి, మరెన్నో ఏజిలను అధిగమిస్తూ ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు) ఏజిలోకొచ్చాం. ఏ ఏజి తరచి చూసినా- నారీజాతి […]

Continue Reading

“నైరాశ్యపు శిశిరం – ఆశాన్విత వసంతం (హిందీ: “”उम्मीदों का उदास पतझड़ साल का आखिरी महीना है”” – శ్రీమతి అంజూ శర్మ గారి కథ)”

నైరాశ్యపు శిశిరం – ఆశాన్విత వసంతం उम्मीदों का उदास पतझड़ साल का आखिरी महीना है హిందీ మూలం – శ్రీమతి అంజూ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఆటోలో నుంచి దిగి అతను కుడివైపుకి చూశాడు. ఆమె ముందునుంచే బస్ స్టాప్ దగ్గర కూర్చుని అతని కోసం ఎదురుచూస్తోంది. అతని చూపులో మనస్తాపం స్పష్టంగా తెలుస్తోంది. ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ అతను […]

Continue Reading

ఏం చెప్పను! (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)

ఏంచెప్పను?  (డా||కె.గీత ఉత్తమ కవితా పురస్కారం & నెచ్చెలి-2025 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత) – పద్మావతి రాంభక్త ఏమని చెప్పను లోలోతుల్లో మనసుకు ఉరేసే దుఃఖముడులు ఎన్నని విప్పను గోడపై కదిలే ప్రతిముల్లూ లోపల దిగబడి అల్లకల్లోలం చేస్తుంటే ఏమని చెప్పను నా మౌనానికి గల కారణాలకు రంగురంగుల వస్త్రాలు తొడిగి గాలిలోకి ఎగరేస్తుంటే ఏంచేయను నా పెదవులపై తూలిన ప్రతి పలుకును మసిబూసి మారేడుకాయను చేసి పుకారులను వీధివీధిలో ఊరేగించి కృూరంగా ఉత్సవాలు […]

Continue Reading

ప్రమద- పి.వి.సింధు

ప్రమద పి.వి.సింధు -నీరజ వింజామరం  ప్రపంచ బ్యాడ్మింటన్ లో మెరిసిన తెలుగు తార – పి .వి. సింధు తల్లిదండ్రులిద్దరు జాతీయ స్థాయి వాలిబాల్ క్రీడాకారులు అనగానే సహజంగానే వారి పిల్లలు కూడా వాలిబాల్ నే ఎంచుకుంటారని ఎవ్వరైనా అనుకుంటారు. కానీ ఆమె బ్యాడ్మింటన్ ను ఎంచుకుంది. కేవలం ఎంచుకోవడమే కాదు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగాచరిత్రలో పేరు నమోదు చేసుకుంది. ఆమె మరెవరో కాదు మన తెలుగు తేజం పి. […]

Continue Reading
Posted On :

నేనొక జిగటముద్ద (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

నేనొక జిగటముద్ద  (నెచ్చెలి-2025 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – జె.డి.వరలక్ష్మి గురితప్పి పోవడంలేదు నా ఆలోచనలు నువ్వు కానుకిచ్చిన కపట ప్రేమను గుచ్చి గుచ్చి చూపిస్తూ పొడుచుకుంటూ పోతున్నాయి.. మెదడులో దాగిన మోసాన్ని అరచేతుల్లో పులుముకొని వెన్నంటే ఉంటానని నువ్వు చేసిన ప్రమాణాలు గుండె గోడలకు బీటలు తీసి ఉప్పొంగుతున్న రక్తంబొట్లను కన్నీరుగా నేలరాలకముందే ఆవిరి చేస్తున్నాయి.. విసురుగా నోటి నుండి వచ్చే ఆ మాటల నిప్పురవ్వలు నన్ను నిలబెట్టి నిలువెల్లా దహించేస్తాయి.. నాకెంత […]

Continue Reading
Posted On :

రామచంద్రోపాఖ్యానము (కథ)

రామచంద్రోపాఖ్యానం -దామరాజు విశాలాక్షి “మాఘమాసం మధ్యాహ్నం ఎండ ముంగిళ్ళలో పడి ముచ్చట గొలుపుతోంది. ఆ రోజు సివిల్ ఇంజనీర్, రియలెస్టేట్ లో మంచి పేరు పొందిన , కాంట్రాక్టర్ రామచంద్ర గృహప్రవేశం. ఆ గృహప్రవేశానికి ఎందరెందరో పెద్దలు వచ్చారు. ఊరంతా కార్లతో  నిండి పోయింది . వస్తున్న వారి వేషభాషలు , వారి నగ నట్రా చూసి విస్తు పోతున్నారు ఆ ఊరి జనాలు .. రామచంద్ర వస్తున్న వారికి  ఘన స్వాగతం పల్కుతూ  ఏర్పాట్లు చేసాడు .. […]

Continue Reading

విరిసిన సింధూరం (కథ)

విరిసిన సింధూరం -కాయల నాగేంద్ర ప్రకృతి ప్రశాంతంగా పవ్వళించింది. ఆకాశం పసిపాప హృదయంలా స్వచ్చంగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. చంద్రుడు చల్లని వెన్నెలని జల్లుగా భూమి పైకి కురిపిస్తున్నాడు. అప్పుడప్పుడూ గాలి తెరలు తెరలుగా చల్లగా తాకుతోంది. ఆకాశంలో మేఘాలు దూది పింజల్లా వాయు వేగానికి పరుగులు పెడుతున్నాయి. చక్కని పరిసరాలు, ఆనందకరమైన ప్రకృతి ఆకాశంలో మబ్బులతో దోబూచు లాడుతోంది జాబిల్లి. డాబా మీద కూర్చుని ఆకాశంలోని తారల్ని లెక్కబెడుతూ ఆలోచిస్తున్నాడు విశ్వ. ఇంటి పనులు ముగించుకొని […]

Continue Reading
Posted On :

మరియొకపరి (కవిత)

మరియొకపరి -దాసరాజు రామారావు గుప్పెడు మట్టి పరిమళాన్ని, ముక్కు పుటాల్లో నింపుకొని, కాక్ పిట్ బాహుబలి రెక్కల్లో ఒదిగి కూర్చున్న. బతుకు సంచిలో కొన్ని తప్పని సరి ప్రయాణాలకు జాగా వుంచుకో వల్సిందే. కొలతలు వేసి, లెక్కలు గీసి ప్రేమల్ని కొనసాగిస్తామా? కాదు గద! పరాయి రుచుల మర్యాదల్లో తడిసిన్నో, ఆ పిల్ల ఆగని ఏడుపుల్లో తడిసిన్నో, అందరు చుట్టువున్నా , ఒంటరి మూగగా, మాగన్నుగా. ఆత్మలు తలుపులు తెరచుకొన్నయి. ఆలింగనాలు ఆనంద భాష్పాలైనయి. నాలుగేళ్ళ చిన్నది “ […]

Continue Reading

విల్లక్షణుడు (కవిత)

విల్లక్షణుడు -ఎరుకలపూడి గోపీనాథ రావు పోగు బడుతున్న చీకటి పొరలను ఓర్పుగా ఒలుచుకుంటూ దారిలో దేదీప్యమానంగా ఊరేగుతున్న దేవునికి ఆత్మ నమస్కారాలనర్పిస్తూ అతడు పయనిస్తున్నాడు! పొగలూ, సెగలూ తాకే తావుల్లో మంటలుంటాయనీ నడక తడబడే బాటల్లో ఎత్తు పల్లాలుంటాయనీ ఎదుటి వారి కంఠ స్వరాలలోని వైవిధ్యాలూ స్పర్శలలోని వ్యత్యాసాలూ వారి ఆంతర్యాన్ని వ్యక్తీకరిస్తాయనీ బాల్యంలోనే బ్రతుకు నేర్పిన అనుభవాలను మననం చేసుకుంటూ అతడు ప్రయాణిస్తున్నాడు! ఉన్న మనో నేత్రాలతోనే తాను చర్మ చక్షు ధారులకన్నా ఉన్నంతంగా జీవిస్తున్నందుకు […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-3 డిపెండెంటు అమెరికా

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 3. డిపెండెంటు అమెరికా అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత సాయంత్రం ఏటవాలు కిరణాలతో దేదీప్యమానంగా మెరుస్తూంది. ఇంట్లో అద్దాలలోంచి చూస్తే బయట వెచ్చగా ఉన్నట్లు అనిపిస్తూంది. కానీ విసురు గాలి వీస్తూ అతి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి నాగతరి మీదకు ఎక్కిన తరువాత వ్రజేశ్వర్ రంగరాజుని అడిగాడు “నన్నెంత దూరం తీసుకువెళ్తారు? మీ రాణి ఎక్కడ వుంటుంది?” “అదిగో, ఆ కనపడుతున్నదే నావ, అదే మా రాణీవాసం.” “అబ్బో, అంత పెద్ద నావా? ఎవరో ఇంగ్లీషువాడు రంగాపురాన్ని లూటీ చెయ్యటా నికి అంత పెద్ద నావతో వచ్చారనుకున్నాను. సర్లే, ఇంత పెద్ద నావలో ఉంటుందేమిటి మీ రాణి!?” […]

Continue Reading
Posted On :

అనుసృజన – మొగవాళ్ళ వాస్తు శాస్త్రం

అనుసృజన మొగవాళ్ళ వాస్తు శాస్త్రం మూలం: రంజనా జాయస్వాల్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక ఇల్లు దానికి కిటికీలు మాత్రమే ఉండాలి ఒక్క తలుపు కూడా ఉండకూడదు ఎంత విచిత్రం అలాంటి ఇంటి గురించి ఊహించడం! ఎవరు ఆలోచించగలరు – అలాoటి వంకర టింకర ఊహలు ఎవరికుంటాయి? మొగవాళ్ళ ఊహల్లోకి రాగలదా ఎప్పుడైనా ఇలాంటి ఇల్లు? మొగవాళ్ళు తలుపుల శిల్పులు వాళ్ళ వాస్తు శాస్త్రంలో కిటికీలు ఉండటం అశుభం! గాలులు బైటినుంచి లోపలకి రావడం అశుభం గాలులూ, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-56)

నడక దారిలో-56 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 56

నా జీవన యానంలో- రెండవభాగం- 56 -కె.వరలక్ష్మి 2013 జనవరి 20న మా గీత మూడవ కవితా సంపుటి శతాబ్ది వెన్నెల సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఎన్. గోపి, శివారెడ్డి, కొండేపూడి నిర్మల, శిఖామణి గీత పొయెట్రీ గురించి చాలా బాగా మాట్లాడేరు. చివర్లో గీత ప్రతిస్పందన అందర్నీ ఇంప్రెస్ చేసింది. గీత వాళ్లూ 31న తిరిగి వెళ్లేరు. బయలుదేరే ముందు గీతకు వీడ్కోలు చెప్తూ హగ్ చేసుకుంటే ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. మనుషులకివన్నీ ఉత్త ఎమోషన్సే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 33

వ్యాధితో పోరాటం-33 –కనకదుర్గ ఆ రోజు నేను పడిన బాధ ఇంతా అంతా కాదు. ఇంకా ఎన్నిరోజులు నేను ఈ ఆసుపత్రులల్లో పడి వుండాలి? అసలు నేనింక ఇంటికి వెళ్తానా? పిల్లలతో మనసారా సమయం గడుపుతానా? అసలు ఈ జబ్బు తగ్గుతుందా? నేను బ్రతుకుతానా? నేను లేకపోతే ఇద్దరు పిల్లలతో శ్రీనివాస్ ఎలా వుంటాడు? అసలు ఎందుకిలా అయి పోయింది నా బ్రతుకు? ఈ జబ్బు నాకెందుకు వచ్చింది? నాకేమన్నా అయితే అమ్మా, నాన్న ఎలా తట్టుకుంటారు? […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 32 (యదార్థ గాథ)

జీవితం అంచున -32 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి సభ జరిగిన వారం రోజులకనుకుంటా తెలియని నంబరు నుండి ఒక కాల్ వచ్చింది. ఆ నంబరు నుండి మూడు రోజుల క్రితం కూడా ఒక మిస్డ్ కాల్ వుండటం గమనించాను. ఎవరైవుంటారాని ఆలోచిస్తూ రెండోరింగ్కే ఎత్తాను. నేను‘హలో’అన్నా అవతలి నుండి జవాబు లేదు. రెండోసారి‘హలో’అన్నాను. “హలోఅండి, నాపే రు రామం. మీ పుస్తకావిష్కరణకివచ్చి, పుస్తకం తీసుకున్నాను. చాలాహృద్యంగా, ఆర్ద్రంగా మీ మనవరాలిపై ప్రేమను […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-29

నా అంతరంగ తరంగాలు-29 -మన్నెం శారద శ్రీరామ పట్టాభిషేకం పిదప ఆంజనేయస్వామి అయోధ్యని వీడి వెళుతున్న తరుణం అది! సీతమ్మని వెదకడం మొదలు, రాములవారికి ఆఁ వార్త అందించి రావణ సంహారం వరకు శ్రీరామ చంద్రులవారిని ఆంటిపెట్టుకుని వుండడమే కాక స్వామి వారి పట్టాభిషేకం కనులరా వీక్షించి తరించారు ఆంజనేయ స్వామి! ఇక తాను కిష్కంద కు బయలు దేరే తరుణమాసన్నమయ్యింది అక్కడ తనకు ఎన్నో బాధ్యతలు! స్వయానా సుగ్రీవులవారికి అమాత్యులాయే! తన స్వామిని వీడి వెళ్లడమంటే […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -1 (శాన్ ఫ్రాన్సిస్కో)

నా కళ్ళతో అమెరికా -1 శాన్ ఫ్రాన్సిస్కో డా||కె.గీత మాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. […]

Continue Reading
Posted On :

కథావాహిని-26 ఉణుదుర్తి సుధాకర్ గారి “ఒక వీడ్కోలు సాయంత్రం” కథ

కథావాహిని-26 ఒక వీడ్కోలు సాయంత్రం రచన : ఉణుదుర్తి సుధాకర్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]

Continue Reading

వినిపించేకథలు-50 – కళ్యాణ శారద గారి కథ “తోడునీడలు”

వినిపించేకథలు-50 తోడునీడలు రచన : కళ్యాణ శారద గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]

Continue Reading
K.Geeta

గీతామాధవీయం-47 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-47 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-47) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) జులై 02, 2022 టాక్ షో-47 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-47 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

ఫెధర్ డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్

ఫెధర్ డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్ -డా.కందేపి రాణి ప్రసాద్ ఆస్ట్రేలియా ఖండం మొత్తం ఒక దేశంగా పరిగణిoపబడుతున్నది. గతవారం ఆస్ట్రేలియా దేశాన్ని చూడటానికి వెళ్ళాం. మాకు కేవలం నాలుగైదు రోజులే ఉండటం వల్ల సిడ్నీ నగరం మాత్రమే చూడాలని అనుకున్నాం. ఆస్ట్రేలియా ఖండం చుట్టూతా నీళ్ళతో ఆవరింపబడి ఉండటం వల్ల ఈ దేశం మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్నది. ఇక్కడ ఉండే జంతు, వృక్ష జాతులు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కేవలం ఈ ఖండంలో […]

Continue Reading

యాత్రాగీతం-70 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-5

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-5 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** వీసా పాట్లు & లోకల్ టూర్లు: శాన్ఫ్రాన్సిస్కోలో  ఫ్రాన్సు వీసా ఆఫీసు చుట్టుపక్కల గడ్డకట్టే చలిలో బయటెక్కడా గడిపే […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

అడవిలో అపార్టుమెంట్లు

అడవిలో అపార్టుమెంట్లు -కందేపి రాణి ప్రసాద్ మన మహారాజు సింహం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందరిని గుహ దగ్గర నున్న మైదానం వద్దకు రమ్మన్నారు అంటూ.. కాకి అందరికీ వినబడేలా గట్టిగా అరుస్తూ చెపుతోంది. ‘‘అబ్బా ఈ కాకి ఎంత కర్ణ కఠోరంగా అరుస్తుంది” అంటూ, బోరియలో నుంచి హడావిడిగా బయటికి వచ్చిన కుందేలు తన రెండు చెవులు మూసుకుంటూ అన్నది.           ‘‘కాకితో కబురు పంపిన మేము రాకపోదుమా’’ అనే […]

Continue Reading

పౌరాణిక గాథలు -32 – ఆషాఢభూతి కథ

పౌరాణిక గాథలు -32 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆషాఢభూతి కథ సన్యాసిపుర౦ అనే పేరుగల ఊళ్ళో దేవశర్మ అనే బ్రాహ్మణడు నివసిస్తూ౦డే వాడు. అతడు పరమ లోభి. ఎవరికీ ఏమీ పెట్టేవాడు కాదు…ఎవర్నీ నమ్మేవాడు కాదు…పని చేయి౦చుకుని డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. పెళ్ళి చేసుకు౦టే ఖర్చు అవుతు౦దని అది కూడా మానేశాడు. దేవశర్మకి ఒక అలవాటు ఉ౦డేది. తన దగ్గరున్న వస్తువుల్నిడబ్బు రూప౦గా మార్చి ఆ డబ్బుని బొంతలో పెట్టి కుట్టేసేవాడు. అ బొంతని ఎవరికీ […]

Continue Reading

రాగసౌరభాలు- 17 (గౌళ రాగం)

రాగసౌరభాలు-16 (గౌళ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులకు నమస్తే. మనం ఇప్పటివరకు ఘన రాగాలలో మూడు రాగాల గురించి తెలుసుకున్నాము. అవి నాట, ఆరభి, వరాళి.  ఇంకా గౌళ, శ్రీ రాగాల గురించిన వివరాలు తెలుసుకోవాలి. అందులో భాగంగా ఈ నెల గౌళ రాగ విశేషాలతో మీ ముందుకి వచ్చాను. మరి అవేమిటో తెలుసుసుకుందామా? ఈ గౌళ రాగం తూర్పు బెంగాల్ ప్రాంతంలోని గౌళ దేశంలో ఆవిర్భవించిందని ఒక కథనం. గౌళ అంటే గోకాపరుల […]

Continue Reading

గజల్ సౌందర్యం-3

గజల్ సౌందర్య – 3 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్‌పై సూఫీయిజం ప్రభావం: పర్షియన్ మరియు ఉర్దూ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవితా రూపమైన గజల్‌పై సూఫీయిజం తీవ్ర ప్రభావాన్ని చూపిందని అంటారు చరిత్ర కారులు. అనేక గజళ్లు సూఫీ మార్మికవాదం నుండి ప్రేరణ పొంది ఆ దైవిక ప్రేమ మరియు ఆధ్యాత్మిక కోరిక యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తాయి. సూఫీ తత్వం ప్రభావం ,రూపకాలు, ప్రతీక వాదం మరియు భావోద్వేగ లోతులను గజళ్ళలో ఉపయోగించడం స్పష్టంగా కనిపిస్తుంది. సూఫీ కవుల […]

Continue Reading

కనక నారాయణీయం-71

కనక నారాయణీయం -71 –పుట్టపర్తి నాగపద్మిని           ‘దెబ్బ తగలగానే పరిగెత్తుకుని వచ్చి, వసంత టీచర్తో నోరంతా శుభ్రం చేయించి, రవికె మీద పడ్డా రక్తమూ తుడిచి, వెంటనే ఇంటికి పంపించేసినాను కూడా!! ఇంతకూ డాక్టర్ దగ్గరికి పోతున్నారా, నన్ను తీసుకుని వెళ్ళమంటారా?’           అడిగాడాయన. సమాధానం చెప్పేలోగా, వీధిలో వెళ్తున్న రిక్షా వాణ్ణి పిలిచి, నాగ చేయి పట్టుకుని పెద్ద మసీదు దగ్గరున్న ప్రభుత్వ […]

Continue Reading

బొమ్మల్కతలు-32

బొమ్మల్కతలు-32 -గిరిధర్ పొట్టేపాళెం            గీసే ప్రతి గీతలో ఇష్టం నిండితేనే, ఆ ఇష్టం జీవమై వేసే బొమ్మకి ప్రాణం పోసేది. గీత గీతలో కృషితో, పట్టుదలతో తనదైన శైలిలో పదును తేలటమే ఆర్టిస్ట్ ప్రయాణంలో వేసే ముందడుగుల్లోని ఎదుగుదలకి తార్కాణం. పొరబాట్లకీ తడబాట్లకీ ఎక్కువ ఆస్కారం ఉండే చేతి కళ డ్రాయింగ్ – చిత్ర లేఖనం. అందులో లైన్ డ్రాయింగ్ అయితే ఆ పొరబాట్లు తడబాట్లు మరింత తక్కువగా ఉండేలా […]

Continue Reading

నేను నీకు శత్రువునెట్లయిత? (ఇబ్రహీం నిర్గుణ్ కవిత్వం పై సమీక్ష)

నేను నీకు శత్రువునెట్లయిత? (ఇబ్రహీం నిర్గుణ్ కవిత్వం పై సమీక్ష) -డా. టి. హిమ బిందు అనుబంధానికి ఆప్యాయతకు అన్న మా ఇబ్రహీం అన్నగారు. హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్న మంచి టీచర్ అని వాళ్ళ స్కూల్ సహోపాధ్యాయులు చబు తుంటే చాలా సంతోషంగా గర్వంగాఅనిపించింది. Full energy తో energy అంతా ఉపయోగించి పాఠం ఘంటా పదంగా చెబుతారని తెలిసింది. అంతే energy తన కవిత్వంలో  కూడా ఉపయోగించారని కవిత్వం చదువుతుంటే అర్ధంఅయ్యింది.  ఒక్కో కవిత ఒక్కో పెను బాంబ్ విస్పోఠనాన్ని తలపించాయి. ఇప్పుడేదీ రహస్యం కాదు‘ కవితా సంపుటికి గాను విమలా శాంతి పురస్కారం మరియు ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్  […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga 30. Tempest of Time If there is any fear now, it’s not of death, but of life. People’s stupidity, cruelty, inhumanity are turning into death caverns Hunger is multiplying each minute like the cell division in the human body. Death in parturition, in addiction! Hiding the reality, […]

Continue Reading

Carnatic Compositions – The Essence and Embodiment-51

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-39 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 39 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

America Through My Eyes – Mexico Cruise – Part 6 (FINAL PART)

America Through My Eyes Mexico Cruise – Part 6 (FINAL PART) Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar We were thrilled that the “Taste of Mexico Tour” included a visit to Ensenada. Our first stop was the Civic Plaza to see statues of Mexican martyrs. By eleven o’clock, we reached the tour’s namesake […]

Continue Reading
Posted On :