చుక్‌చుక్ రైలువచ్చింది -వసంతలక్ష్మి అయ్యగారి నిజమే ..సరదాగా గతాన్ని కథలుగా,కబుర్లుగాచెప్పుకోవడంలో ఆనందంలేకపోలేదు.అందుకే..కొత్తసమాచారానికై తహతహలాడేమిత్రులున్నారనితెలియగానే..నడుంబిగించాను. 1998 లో ననుకుంట..తొలిసారికంప్యూటరైజ్డ్..రైల్వే సమాచారం రికార్డుచేయడంజరిగింది..సోమాజీగూడాలోనిఓస్టూడియోలో.తరువాతిరోజుల్లో యీ IVR ప్రక్రియ ప్రతి సంస్థవారు అవలంబించారు. టెలిఫోనులోఅవతలివైపు ఓరిసెప్షనిస్టుచేసేపనిమాదిరిగావుంటుందనుకోండియివతల ఫోనుచేసి వినేవారికి.వారుచెప్పినట్టునంబర్లు నొక్కుతే..సరిపడే సమాధానాలు మనకివినిపిస్తాయనమాట..దీనినే యింటరాక్టీవ్వాయిస్ రెస్పాన్స్..పద్ధతి అంటారు.మరమనిషిమనతో మాట్లాడినట్టే.నిజానికి అవతలివైపుమనిషంటూ లేకుండా ..మనమీరోజు సెల్ఫోన్సర్వీసు ప్రొవైడర్లతో యిలాంటి రీతిలోనేమనబిల్లు,కంప్లైంటు,ప్లాను మార్పువగైరాలన్నీజరుపుకుంటున్నాం.అయితే యిదెలా? రైల్వే స్టేషనులో గతంలో కాంట్రాక్టుఉద్యోగులు,షిఫ్టులలో ఓచిన్ని గదిలోమైకుముందుకూర్చుని..బండిఆగమనిగమసందేశాలు,విలంబనసూచనలురాత్రా,పగలా అన్నతేడా లేకుండావారికున్నఆదేశాలమేరకు..చేతికిచ్చినసమాచారాన్ని ఓbang వేసి చదివేవారట. మరిIVR వచ్చాకా కంప్యూటరే..ముందుగారికార్డుచేసిన వేవ్ ఫైల్ నుఫీడూ,లోడూ చేసి ప్లేచేస్తే..సమయానుకూలంగా సమాచారంమోగిస్తుంది స్పీకర్లలో ప్రయాణీకులకు. రికార్డింగులో నాకు ఓకట్ట పేపర్లిచ్చేవారు.మైకుపొజిషన్ సెట్ చేసుకున్నాకా..విషయం కాస్తవంటపట్టించుకుని..చదువుతూపోయేదాన్ని.తెలుగు,యింగ్లీషు కాకహిందీలోనూ చదివిన సందర్భాలనేకం.ముందుతెలుగు చేసేదాన్నిఅలసిసొలసేదాకా! మామూలు డాక్యుమెంటరీలలాగ కాకుండాముందు స్టాండర్డు ప్రకటనలుకొన్ని..ఆపైఒకటినుండి యాభైతొమ్మిది నంబర్లు..విడిగా“ఒంటిగంట..వంద,నూరు,వెయ్యి…గంటలు,గంటల,నిముషములు,సెకెన్లు…కొద్దిసేపట్లో…పగలు,మధ్యాహ్నం,సాయంత్రం, రాత్రి..“లాంటి పదాలు.. అలాగే….“నుండి“,“వరకు“,“కొరకు“,“లో.“..“యందు..“లాంటి విభక్తిప్రత్యయాలు విడిగా టేక్చేసేదాన్ని.ప్రతిమాటకు వారు కట్ చేసుకునేవీలు కల్పిస్తూ pause యివ్వాలి..పరుగులుపనికిరావస్సలు! ఆపైన..దేశంలో సికింద్రాబాద్ ను టచ్అయ్యేఅన్ని రైళ్లపేర్లు…[జంక్షన్ కనుక] ఒకటొకటీవైనంగా చదవాలి.మరికొన్నిఅనువైన,అవసరమైన పదాలను నేను బాగాసూచించేదాన్ని….అన్నీ రికార్డుచేసేసేవారు. వీటి అతుకుల పని..సౌండ్యింజనీరు,ప్రొడ్యూసర్ కమ్ agent లదే..అది మనం నిష్క్రమించాకే జరిగేది. కొత్తరైళ్లచేరిక జరిగినా…మార్పులేవివచ్చినా…నాకుపిలుపూ వచ్చేది! సమయం చాలాపట్టేది..తొలిరోజులప్రయోగాలుకనుక.యిపుడుయీరంగంలోవచ్చిన స్పీడు ఎవ్వరూఊహించనిది..అందుకోలేనిది. రైలుస్టేషన్ లో వారుచేసే సాఫ్ట్ వేర్ యిన్స్టలేషన్గురించి నాకుతెలియదు. కానీ..updating dynamics అంటూ మనకి కేబుల్‌టీవీ లో అపుడపుడుమాటలు,వీడియో..ముక్కలుగాబ్రేక్అయినచందానుంటాయా ప్రకటనలు. ప్రకటన!(టింగ్టింగటిటింగ్..) సమయం…రాత్రి పదిగంటల….యిరవైనిముషాల….పదమూడు సెకెన్లు. హైదరాబాదు…నుండి…విజయవాడ…మీదుగా…విశాఖపట్టణం చేరుకోవలసిన ..విశాఖా …express…. నంబరు..అయిదు..సున్నా.. నాలుగు..తొమ్మిది..తొమ్మిదీ.. మరికొద్ది…నిముషాలలో …ఫ్లాట్ఫా్మ్…నంబరు…మూడు…పై… విచ్చేయనుంది. Continue Reading