చేబదుళ్ళు..

-వసంతలక్ష్మి అయ్యగారి

మీలోఎంతమందికి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీరిచ్చిన ”చేబ దు ళ్ళ”

సంగతులు గుర్తొస్తాయి..ఇచ్చికాల్చుకోని చేతులుండవనే నమ్మకం…!!అసలంటూ ..ఇచ్చేబుద్ధి,కాస్త ంత మొహమాటం మీకున్నాయో….మీరుఔటే..దొరికిపోయారే..పైగా వయసు ముదురుతుంటే..ఈ గుణం కూడాపరిఢవిల్లుతందే తప్ప తోకముడవదు..తగ్గిచావదూ..!

అందరికొంపలలోనూ అనాదిగా అయ్యల అపాత్రదానాలూ…అమ్మలుఅశక్తితో అరచిఅలసిపోవడాలు..దీన్ని ఆసరాగా అలుసుగా చేసేసుకునిఆహా మేమే కదా పేద్దదానకర్ణులదాదీలమన్నట్టూ,బలిగారిబాబులమన్నట్టూ..మాచేతికికఎముకలేదనుకుంటూ..

 ఫీలవడమేకాక ఎముకలేని నాలుకను తెగ ఆడిస్తూ..ఆడవారినిఅదేపనిగా   ఈసడిస్తూ..పీనాసి తనంతో పాటూ…మహానసశ్రీలని,మాయదారి గొణుగుడుబతుకులనీ దెప్పిపొడుస్తూ మగవారంతాఏకమైపోతారు..పనికిమాలిన సంతపనులు చేసేసి…మనపైచిందులుతొక్కి చెడుగుడాడేసుకోడం మనందరి ఇళ్ళల్లో ఆనవాయితీగామారింది.ఐతే..ఇదంతా 

ఓ ము ప్ఫై నలభై ఏళ్ళక్రితంమాట!

ఆతరువాతేమైందబ్బా అని గింజుకుందామీ మనసు..ఏముంది ..స్త్రీసాధికారత అంటూ చంకలో పెద్దపరుసులుచ్చుకుని రోడ్డెక్కిమరీ కష్టాలుకొని తెచ్చుకుని

సుఖాన్నున్న ప్రాణాలని  దుఃఖసాగరంవైపుకి ఈడ్చుకునెళ్ళాం.ఏంఉద్ధరిస్తున్నామోతెలియదు కానీ ఇంటికీకాక..వంటికీకాక రెంటికీచెడ్డరేవళ్ళలా 

పెరుగావళ్ళౌవుతామన్నది కాదనలేని నిజం.పోనీ అక్కడేఆగుతామా..ఊహూ…

తగుదుమమ్మా అనిమగపనులకు సైతం నడుంబిగించడం..కాస్త ఆర్థికస్వాతంత్ర్యం సొంతమయ్యి,నలుగురితో పరిచయాలైపెరిగేసరికి…ఈఅబలలంతా సవ్యసాచిసిస్టర్లమంటూ విశ్వరూప ప్రదర్శనలూ….

సందట్లోసడేమియా అంటూ మన మియాలు తోకముడిచి,చడీచప్పుడులేకుండా జారుకోడాలుమామూలైంది…

దొరికిందే ఛాన్సు అని…ప్చ్!స్వయంకృతాపరాధాలు..అందుకే..అంతంతమంది పిల్లల్నేసుకునీకూడా   అమ్మలు పొందిన ఆనందాల్లో అంశకూడా మనకి అందకఅలమటిస్తున్నాం..

సంపాదించి సాధించేందటయ్యా అంటే..మనపిల్లసంతలకి అనవసరపుహోదా,

సౌఖ్యం,బడాయి..బలుపు..! నీకోసం నేనంత చేశా ..ఇంతచేశా….మెడమెలికలుతిరిగిందీ…వెన్ను వంకర్లు పోయిందీ..అంటూ పిల్లలముందు లెక్చర్ దంచితే వారికెందుకు పడుతుందండీ..పాపం! ఆ పాపంపూర్తిగా మనదేముమ్మాటికీ..!

కాకపోతే సొంత సంపాదనతో కసితీరా చీరలు,నగల ముచ్చటతీర్చుకుంటాం..నలుగురి తో నాలుగు మెతుకులు కతుకుతూలోకజ్ఞానం,తదితరవిషయాలు అవసరానికి మించి అందరికంటేముందుతెలుసుకుని చాటింపుకీముందుంటాం..!!!డబులింకం కనుక మరికాస్తపెద్దకారు,మరోఇల్లు అమరుతాయి…వాటిని అద్దెలకిచ్చి పూర్వజన్మబాకీలూ అవీ తీర్చుకుని..మనోవేదనకి..మంది దిష్టికి స్వయంగా స్వాగతంపలుకుతాం..

ఇంతవరకూ బానే ఉంటుంది,ఎప్పుడైతే స్వయంప్రతిపత్తిఅన్నామో..అపుడే బయట ఉద్యోగాలు వెలగపెట్టే చోట సీను సితారవాయిస్తుంది..ముందుగా ప్రతివారూ..క్షేమసమాచారంతో మొదలుపెట్టికుటుంబ సభ్యుల సెన్సస్ 

సేకరించగానే…డవిలాగులు డోసు పెంచుతూ పోతారు.

సింగు   ..డింగు అంటూ,.అర్థమవలేదుకదూ..

సింగ్..అనగా  సింగిల్ ఇన్కమ్ గ్రూపట..

డింగు…డబులింకమ్ గ్రూపు,,కొన్నేళ్ళకే అది మరో స్టెప్పు ముందుకు జరిగి

సింగిలింకం..డబుల్ చైల్డ్..ఐతే సానుభూతిని కురిపించి…డబులింకంసింగిల్ చైల్డ్ ఐతే…రిటైరయ్యేదాకా,,విసుగూవిరామంలేకుండా..“మీకేంటమ్మా ..నీకేంటమ్మా” అంటూ నిష్టూరాలను మూటకడుతుందిమన సహోద్యోగ బృందం…

చిన్న సమస్యలనుకున్నారా..మాఆడాళ్ళ అవస్థలు..కొనితెచ్చుకున్నాంకనుక మూసుకోకతప్పదు..

అంతెందుకండీ,,,ఇన్కమ్ టాక్సులో వర్కింగు వనితలకిచ్చేరాయితీపిసరుకి

ఎసరుపెట్టేయాలనుకునే పేద్దమనసున్న మగవారి దెప్పిపొడుపులుఏమని గుప్పించి,ఎన్నని రాయమంటారూ..!

ఆ సెటైర్లిస్టు లో మళ్ళీ ముందుండేది ఎవరో తెలుసా..నేను చెప్పబోయే చేబదులు రాయుళ్ళే !!!…..పైకోమాట..పక్కకోమాట..చిన్నాలేదూ..పెద్దాలేదు..వెటకారానికి!లోకం తీరు…ఏం చెయ్యలేం…!!

ఇక ఆఫీసులోకి వచ్చేయండి.. చేబదలర్స్ ని పరిచయంచేస్తా…రండీ…!

వారూ వీరూ చేబదుళ్ళకని సెలక్ట్ చేసుకునేదీ ముందుగా ఆడఉద్యోగులనే..మళ్ళీ మీకేంటిమేడమ్,,సింగూడింగూ ..సాంగుమొదలూ…

మొట్ట మొదటిసారిగా మొదటి జీతం కూడా అందకుండానే   నాకుటెండరువేశాడు ,,యాదగిరి అనీ ఒక ప్యూను..తలచుకుంటే నవ్వురాకమరేంటీ..

BHEL కేంపస్ లోని బ్యాంకు బ్రాంచిలో ఉద్యోగం..జీతం ,,కటింగులుపోనూ ఆరు వందలు..దానికే..అబ్బో bank job ,,,great..,థళథళలాడేతెల్లని white కాలరంటూ ..కలర్సూ.. !ఒక ప్రత్యేక బస్సు సదుపాయంఉండేది.దానిఛార్జీ నెలకు యాభై…మనీ కలెక్షన్ డ్యూటీవేయించుకునిమరీ ..స్టాఫ్ అందరి వద్దా తలో యాభై వసూలుకై  ప్రతినెలా..లిస్టుచ్చుకు చక్కా తిరిగేవాడు మా యాదన్న..నేను కొత్తకదా..నా దగ్గరకలెక్షను కొచ్చి..“మేడమ్,,జర నా పైషలుగూడరాషేషెయ్..యేషేషెయ్”అనివంకర్లు తిరిగాడు,ఇప్పుడంటే..ఇంతధైర్యంగాఇన్ని వాగుతున్నా..అమ్మో.అప్పట్లో బంగారుతల్లిని కదూ…కుక్కిన పేనులాపరుసులోంచి వంద తీసి వేశా..మా నానగారిచ్చిన పాకెట్ మనీ అది.

మరుసటి నెలమళ్ళీ మనవాడు అటాకు చేసేముందు..కిందటినెలనేనివ్వడం దగ్గరనుండీ గమనించిన  నా సీనియర్ ఒకరు ..

“మేడమ్..ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్ ఇన్ దిస్ ఆఫీస్..వాటెవర్ గివెన్   నెవర్ కమ్స్ బ్యాక్”

 ఆమంత్రాన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ  కూడా అడపాతడపారంగురంగుల పూలు బానే పెట్టించుకున్నాను..కాకపోతే రానురానుకాలీఫ్లవర్లే..మరోరకం పూలేంటో తెలుసా?గ్యారంటీసంతకాలు..పోయిందేమీ లేకపోయినా పనికిమాలిన టెన్షన్ కదండీ!గమ్మత్తేంటంటే..ఈ అప్పులు ,చేబదుళ్ళూ,హ్యాండులోనులు తీసుకునేవారంతా అల్లే కట్టుకథలు అందరినీ ఆకట్టేసుకుంటాయి.అదేంచిత్రమో..bankనౌకరీ లైనందుకు మన అకౌంటులో వేసినవీ తీసినవీడినామినేషన్లతోపాటూముందు సబ్స్టాఫ్ కి తెలిసాకే మనపాస్ బుక్ లోbalance అప్డేటౌతుంది.గమ్మత్తేంటంటే..

మనదగ్గర పుచ్చుకున్న మరునాటినుండే  ఏచిన్ని పనికి కేకేసినా,మనవైపు టర్నింగిచ్చుకోవడం బంద్!

దాంతో చేతికింద సాయం మఠాష్..ముఖ్యంగా డెయిలీ వేజెస్ కుర్రాళ్ళంతాఇదేబాపతు.. 

ఆ  “వా డుగారు”…ఆకస్మికంగా జంపిచ్చి చెక్కేశాక ..లేదా పీకేయబడ్డాకా.।।నలుగురు నోళ్ళలోంచి NPA….అనగా నిరర్ధక ఆస్తుల వివరాలునింపాదిగా బయటకు రానారంభిస్తాయి.

ఆనోటా యీనోటా బకాయిల లిస్టు బాకా ఊదిమరీ చెప్పుకోబడతాయి !

“bad debts written off “

 జాబితాకి చేరిపోతాయన్నమాట..బేంకింగ్ మాటల్లో చెప్పాలంటే…!!వివరాలు వెలువడి….బయటకొచ్చి ..ఏడవలేక నవ్వు పుట్టిస్తాయి..నీకెంతనామంచ  పెట్టాడంటే..నీకెంత అని..కొన్నాళ్ళపాటునవ్వుల్ పువ్వుల్..!

ఉద్యోగంమానేశాక..ఈ ఒక్కగొడవతప్పిందిరా..అనుకుంటుంటే..తిరిగేకాలూ ..వాగేనోరూ లాగే…..కాల్చుకునేచేతులకు బ్రేకూ  పడదన్నట్టు..నేను ఓ టీవి లో మిమిక్రీ షో కిగెస్టు గా వెళ్ళే కారు డ్రైవర్లతో మళ్ళా ఈ మొహమాటంమాత్రం తప్పలేదువంద..రెండొందలబదుళ్ళుపక్కనపెడితే..మొన్ననెల్లాళ్ళక్రితం..ఓdriver,,,చాలా కబుర్లలో పడేసి దీనగాథలు విని పిస్తూనే “పాత సెల్ఫోనుంటే యివ్వండమ్మా,,మీరంతాస్మార్టులకి మారారుకనక..”అని అన్నాడో లేదో….ఒక్కరోజైనాఆగకుండా..లెవెల్కి ఏమాత్రం లోటురాకుండా ఇంట్లోకివచ్చి రెండుపాతఫోన్లు ముందు పెట్టాను,,,పెద్దగా డబ్బుకీ ఆశపడీకాదూ….ఏదో..మాఅబ్బాయి వదిలేసిన ఎన్నో పీసుల్లోంచి రెండుపోతేనేంలే..అనీ.!!సరే…బంగారంలాంటి పెద్ద ఫోనే ఎంచాడు డ్రైవరు మురళి!..ఇదేపేరునవారి బిజినెస్ నంబర్లు ఒకటికూడాకాదు ..రెండు నా సెల్లుకెక్కించి మరీఅన్నాడుకదా..మేడమ్..ఇవాళ ఇర్వైకదా..వచ్చేనెల అయిదుకి జీతంరాగానే వెయ్యి స్తా..తీస్కపోనామేడమ్..బేట్రీ గిట్లఏపిచ్చుకోవాలెగదా…అన్నాడు..

సరిగ్గా యిదండీ  ఎగవేతదారుడి ప్రథమలక్షణం..మీరైనా జాగ్రత్త పడాలనీనా తపన!!అర్థంచేసుకోరూ…..!!

దానిదేముందిలే..నువ్వెక్కడపోతావ్..వెయ్యెక్కడపోతుంది ..

అంటూ డబ్బా  గిబ్బా  వెతికి షాపువాడికన్నా ప్రొఫెషనల్ గా ప్యాకు చేసియిచ్చేయగా,సెల్లు యిల్లు దాటింది….!

కట్చేస్తే,,

అయిదులేదు..పదిలేదు..ఇరవైయోతారీఖులేదు..రోజుకో డ్రైవరుమూలానా..సెల్లట్టికెళ్లిన డ్రైవరు ఆచూకీ తెలియడంలేదు.

ఒకరోజు మరో వాగుడికాయ వాహన చోదకుడిని అడిగేశా..।।సదరుమురళిగారి ఫోను స్విచాఫ్ వస్తూండడంతో !

శంక బలపడి..

మురళి మానేసి ఇర్వై దినాలైందని…జీతంతీసుకుని జంపనీ చల్లగాశలవిచ్చాడు..ఫీలింగులన్నీపాతవే..కాకపోతే జోకల్లా..నేనిలాఅడిగిన మరుసటి క్షణమే..ఈకబుర్లపోగు డ్రైవరు కమలాకరుడు..తనకుమగబిడ్డపుట్టాడంటూ పండగజేస్తున్నా..ఒక్క వెయ్యి అడుజస్టుచేషెయ్యమన్నాడు..తను ముర్లీలెక్క కాదనిస్వయంగాధ్రువీకరించుకున్నాడుకూడా..!

ఇచ్చుండనని తెలిసేవుంటుంది యీపాటికిమీకు..!

మరో రోజు ట్రాన్సుపోర్టు సిబ్బంది అనగా … నాకు కారు రోజూ పంపేడిపార్టుమెంటు నుండి ఒకరు నాతోపాటు కారులో రావడంజరిగింది..ఊసుపోక మురళిమాటడిగా..ముందుజరిగినకథచెప్పి..సింపతీ మాంగర్ లాగ..!

అపుడు ఆయనన్న మాటేమిటో తెలుసా…

వాడు ఖతర్నాకండీ..అసామాన్యుడు..వాడిని డ్రైవింగు టెస్టుకిపిలిచిఇంటర్వ్యూ చేసి సెలెక్టు చేసిన వెంటనే మమ్మల్నేఓవందిమ్మన్నాడు,మేమంతా నవ్వి..అలాంటి అడ్వాన్సులు,అప్పులుఇవ్వరమ్మా ..ఐనా ఏంటంతఅవసరం..అనడిగారట..

“ ఏంలేద్సార్,,జాబొచ్చ్ందికదా..యింటికి చికను కొండబోదామనీ” అన్నాట్ట,,

నవ్వుకోడం వారి వంతైయుంటుంది కానీ…ఖాతా క్లోజింగ్ నాపనైంది.

అందుకే మావారంటారూ…”మా ఆఫీసులో ఎవడిలావంద..రెండొందలూ,,అప్పు..అని అడిగినా..అయిదు వందలనోటిచ్చేసి..”ప్లీజునా దగ్గరకి మళ్ళీ..అప్పు అంటూ రావద్దూ…”అని.దీనివల్ల నీకు   పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ..అని నాకు హితోపదేశంకూడానూ..

నాకు తెలిసి ఆయన వద్ద ఇలా అడపా తడపాతడిపించుకున్న..ముగ్గురు ఏకంగా వారి వ్యసనాలపుణ్యమాఅనిమరణాల లిస్టుకి కూడా ఎక్కేశారు..పాపం!!

ఇదిలా ఉంటే..నిన్న కాక మొన్నముద్దుచేసి,చేబదుళ్ళిచ్చి,నెత్తికెక్కించుకున్న మా పనమ్మాయి..డుమ్మాలుపెంచితేనూ…ఏంటిసంగీతా…

మరీ టూమచ్గా మానుతున్నావూ ..యీమధ్య.

నేను నిన్ను..ఎంత   బాగా   చూసుకుంటానసలూ…అన్నానోలేదో…ఆఅమ్మాయందికదా..

చూడమ్మా..నువు బాగా చూస్తున్నావనే కొంచెం దూరమైనా నీ యిల్లుయిడిసిపెట్త లేను….అంటూ చెంప మీద ఛెళ్ళుమనిపించినట్టుకొరడాఝుళిపించి

నా ప్రవర కు ఆస్కారమివ్వకుండా చక్కాపోయింది..వీరినేమనాలో…??!!?!

బాగున్నాయి కదండీ..చే  బ  దు  ళ్ళు!!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.