చుక్చుక్ రైలువచ్చింది
-వసంతలక్ష్మి అయ్యగారి
నిజమే ..సరదాగా గతాన్ని కథలుగా,కబుర్లుగాచెప్పుకోవడంలో ఆనందంలేకపోలేదు.అందుకే..కొత్తసమాచారానికై తహతహలాడేమిత్రులున్నారనితెలియగానే..నడుంబిగించాను.
1998 లో ననుకుంట..తొలిసారికంప్యూటరైజ్డ్..రైల్వే సమాచారం రికార్డుచేయడంజరిగింది..సోమాజీగూడాలోనిఓస్టూడియోలో.తరువాతిరోజుల్లో యీ IVR ప్రక్రియ ప్రతి సంస్థవారు అవలంబించారు.
టెలిఫోనులోఅవతలివైపు ఓరిసెప్షనిస్టుచేసేపనిమాదిరిగావుంటుందనుకోండియివతల ఫోనుచేసి వినేవారికి.వారుచెప్పినట్టునంబర్లు నొక్కుతే..సరిపడే సమాధానాలు మనకివినిపిస్తాయనమాట..దీనినే యింటరాక్టీవ్వాయిస్ రెస్పాన్స్..పద్ధతి అంటారు.మరమనిషిమనతో మాట్లాడినట్టే.నిజానికి అవతలివైపుమనిషంటూ లేకుండా ..మనమీరోజు సెల్ఫోన్సర్వీసు ప్రొవైడర్లతో యిలాంటి రీతిలోనేమనబిల్లు,కంప్లైంటు,ప్లాను మార్పువగైరాలన్నీజరుపుకుంటున్నాం.అయితే యిదెలా?
రైల్వే స్టేషనులో గతంలో కాంట్రాక్టుఉద్యోగులు,షిఫ్టులలో ఓచిన్ని గదిలోమైకుముందుకూర్చుని..బండిఆగమనిగమసందేశాలు,విలంబనసూచనలురాత్రా,పగలా అన్నతేడా లేకుండావారికున్నఆదేశాలమేరకు..చేతికిచ్చినసమాచారాన్ని ఓbang వేసి చదివేవారట.
మరిIVR వచ్చాకా కంప్యూటరే..ముందుగారికార్డుచేసిన వేవ్ ఫైల్ నుఫీడూ,లోడూ చేసి ప్లేచేస్తే..సమయానుకూలంగా సమాచారంమోగిస్తుంది స్పీకర్లలో ప్రయాణీకులకు.
రికార్డింగులో నాకు ఓకట్ట పేపర్లిచ్చేవారు.మైకుపొజిషన్ సెట్ చేసుకున్నాకా..విషయం కాస్తవంటపట్టించుకుని..చదువుతూపోయేదాన్ని.తెలుగు,యింగ్లీషు కాకహిందీలోనూ చదివిన సందర్భాలనేకం.ముందుతెలుగు చేసేదాన్నిఅలసిసొలసేదాకా!
మామూలు డాక్యుమెంటరీలలాగ కాకుండాముందు స్టాండర్డు ప్రకటనలుకొన్ని..ఆపైఒకటినుండి యాభైతొమ్మిది నంబర్లు..విడిగా“ఒంటిగంట..వంద,నూరు,వెయ్యి…గంటలు,గంటల,నిముషములు,సెకెన్లు…కొద్దిసేపట్లో…పగలు,మధ్యాహ్నం,సాయంత్రం,
రాత్రి..“లాంటి పదాలు..
అలాగే….“నుండి“,“వరకు“,“కొరకు“,“లో.“..“యందు..“లాంటి విభక్తిప్రత్యయాలు విడిగా టేక్చేసేదాన్ని.ప్రతిమాటకు వారు కట్ చేసుకునేవీలు కల్పిస్తూ pause యివ్వాలి..పరుగులుపనికిరావస్సలు!
ఆపైన..దేశంలో సికింద్రాబాద్ ను టచ్అయ్యేఅన్ని రైళ్లపేర్లు…[జంక్షన్ కనుక] ఒకటొకటీవైనంగా చదవాలి.మరికొన్నిఅనువైన,అవసరమైన పదాలను నేను బాగాసూచించేదాన్ని….అన్నీ రికార్డుచేసేసేవారు.
వీటి అతుకుల పని..సౌండ్యింజనీరు,ప్రొడ్యూసర్ కమ్ agent
లదే..అది మనం నిష్క్రమించాకే జరిగేది.
కొత్తరైళ్లచేరిక జరిగినా…మార్పులేవివచ్చినా…నాకుపిలుపూ వచ్చేది!
సమయం చాలాపట్టేది..తొలిరోజులప్రయోగాలుకనుక.యిపుడుయీరంగంలోవచ్చిన స్పీడు ఎవ్వరూఊహించనిది..అందుకోలేనిది.
రైలుస్టేషన్ లో వారుచేసే సాఫ్ట్ వేర్ యిన్స్టలేషన్గురించి నాకుతెలియదు.
కానీ..updating dynamics అంటూ మనకి కేబుల్టీవీ లో అపుడపుడుమాటలు,వీడియో..ముక్కలుగాబ్రేక్అయినచందానుంటాయా ప్రకటనలు.
ప్రకటన!(టింగ్టింగటిటింగ్..)
సమయం…రాత్రి పదిగంటల….యిరవైనిముషాల….పదమూడు సెకెన్లు.
హైదరాబాదు…నుండి…విజయవాడ…మీదుగా…విశాఖపట్టణం
చేరుకోవలసిన ..విశాఖా …express….
నంబరు..అయిదు..సున్నా..
నాలుగు..తొమ్మిది..తొమ్మిదీ..
మరికొద్ది…నిముషాలలో …ఫ్లాట్ఫా్మ్…నంబరు…మూడు...పై…
విచ్చేయనుంది.
(tingtintiting)
ఇలా వినిపించగానే..ముందు విన్నవారు ఏవిటాతెలుగు..ఆభాషనిఖూనీచేస్తూ..ఆవిరుపులేంటీ..యింతకంటేబాగాచదివేవాళ్లేలేరా..చిచీ..అంటూ నాలాగేప్రవర చదువుతారేమో కదా!
కానీ..యీప్రకటనలన్నీ అతుకులబొంతలనిగ్రహించాలి.నిజానికి నేను..విభక్తిప్రత్యయాలను..[అంటే..నుండి..గూర్చి,గురించి,కొరకు,కై..]సందర్భంతెలుసుకునిమరీ..వీలైనంతదగ్గరగా అతికేలా శృతిచేసుకునిచదివేదాన్ని.రెండేళ్లతరువాత కొత్తఅతుకులకుస్టూడియోకి వెళ్లినా..మేడమ్ మీశృతి ఏమాత్రంమారలేదండీ...కరెక్ట్ గా అందుకుంటారుఎన్నేళ్లతరువాతైనా…భలే!అనేవారు!
ఇపుడు అసలు కథ…నేను ఊహ తెలిసిఊరుకదిలి రైలు ఎక్కినది గట్టిగాఅయిదారుసార్లు.మావారు తరచు వారిఆఫీసుపనులమీద సిబ్బందితోకలిసి రైళ్లలో తెగతిరిగేవారు.ఆయనకిఏనాడూ నాగురించి ప్రత్యక్షంగాపొగడటంకాదుసరికదా…యిదివిన్ననానో..అదిచూశాననో..చెప్పేఅలవాటులేదు…అన్నీ పరోక్షంగానే.
ఓసారి వారి బాస్ ఒకరు మాయింటికిభోజనానికొచ్చి..మాటలసందర్భంలో..“వసంతా..u r so lucky,..ur husband praises u a lot..about ur cooking…..infact …the other day he stopped all of us at secbad Railway station n told us to listen to ur voice……such a lovely concern…n bla bla bla.”
[హాఁగుండెజారి గల్లంతే!]
మరోసారి..మావారి కొలీగ్…మాపక్క సందే..రోజూదర్శనాలుచేసుకునేంత క్లోజ్వారిద్దరూ.నన్నుయింటిపట్టునచూస్తూనేవుండేవారు…నా బేంకుజాబూతెలుసు.రికార్డింగుల కెడతానని…లైవుకాదనీ..బాగా తెలుసు..అయినా ఓరోజు..ఆయనమావారితో యిలాఅన్నారట.“మీ ఆవిడకిఅంతస్పాండిలైటిస్ పెట్టుకుని ఎంత ఓపికరాబాబూ..తెల్లవారు నాలుగింటికి సికింద్రాబాద్స్టేషనుకి పోయికూర్చోని…సెకెండ్లతోసహా.రైలువచ్చేదీపోయేదీ చదువుతోందీ..యివేళ నేనుఢిల్లీనుండి వస్తూవిన్నా“అనీ!
అవన్నీ రికార్డెడ్రాబాబూ…అనిఎంతమొత్తుకన్నా..నమ్మేవాడుకాదుసదరుదోస్తు…సెకెండ్లతో
సహా ఠంచనుగా అనౌన్సు చేస్తున్నానన్నది వారివాదన!!
ఓటైములో ముమ్మరంగా నేను చేసిన CMR shopping mall,RSBrothers,కళానికేతన్..వంటియాడ్స్ టీవీలో అన్నిచానెల్స్ లోవిరగమోగేవి..వీరు రిమోట్తిప్పుతుండగా..ఓచానెల్ లోవిన్నయాడ్సన్నీ..మరోచానెల్లో నిముషంతేడాలోవచ్చేవి.అపుడీయనేవారూ..“మావాడన్నమాటనిజం..నిముషం కుదురులేకుండాటీవీనైనూ,మా,జీ..అంటూ మీఆవిడ ఎలావెడుతుందిరా..అన్నిచానెళ్లకీ..అని!
ఇలాంటి అనుమానాలు మీకూ ఉన్నాయా?
కొసమెరుపేంటంటే…APFDCవారి సినిమాకుముందువచ్చే వార్తాతరంగిణి కి నేను వాయిస్యిచ్చి ఏనాడూ సినిమాహాలులో వినడానికిఎలాగైతే నోచుకోలేదో…అలాగే, నాగొంతులోవచ్చిన రైలు ప్రకటనలు వినకుండానేఏళ్లుగడిచిపోయాయి.
*****
అయ్యగారి వసంతలక్ష్మి
24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను.
హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను.
పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ స్వచ్ఛందంగా 2010 లో గావించాకా పలు టీవీ చానెళ్లలో రాజకీయాలపై ప్రసారమైన కామెడీ కార్టూన్లలో పలువురు మహిళా నాయకుల .. మరెందరో యితరకార్టూన్ క్యారెక్టర్లకు గళపోషణ గావించి తెలుగురాష్ట్రాల్లో ఏకైక మహిళా మిమిక్రీ కళాకారిణి గా పేరు తెచ్చుకున్నాను.
సంగీతమంటే ప్రాణం. వంటిల్లు వదలడం అంటే బాధ!లలితమైనా శాస్త్రీయమైనా ..పాట విని నేర్చుకుని పాడగలిగే ప్రతిభ వుంది. ప్రస్తుతం యేడాదిగా వసంతవల్లరి పేరున యూట్యూబ్ చానెలు పెట్టి పలువురు ప్రముఖుల కథలను నా గళంలో అందిస్తున్నాను.