అభినయ (కవిత)
-లక్ష్మీ కందిమళ్ళ
అది కాదు
ఇంకేదో
అనుకుంటూ
కంటినుంచి కన్నీటిచుక్క రాలింది.
కన్నీరు కనిపించకుండా
ముఖం పక్కకు తిప్పుకొని
తడిని తుడుచుకుంటూ
పెదవులపై,
జీవంలేని నవ్వులను మొలిపించుకుంటూ
కళ్ళల్లో
లేని ఆనందాన్ని అభినయిస్తూ.. ఆమె.
అందుకు
తడిచిన గులాబీ సాక్ష్యం!
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
చాలా బావుందండి.
థాంక్యూ
చాలా బాగుంది కవిత.అభినందనలు
థాంక్యూ వసుధగారు
చాలా బావుంది
థాంక్యూ అక్కా
చాలా బావుంది
థాంక్యూ అండీ