మిస్సోరీ లో (అనువాద కవిత)

ఆంగ్ల మూలం: మాయా ఏంజిలౌ

తెలుగు అనువాదం: దాసరాజు రామారావు

నేనున్న మిస్సోరీలో

ఒక సగటు మనిషి

ఒక కఠిన మనిషి

బాధకు అర్థం తెలియని

చలన రహిత మనిషి

కడుపులో పేగుల్ని దేవేసినట్లు

హింసిస్తుంటడు

వాణ్ణి చల్లని వాడనాల్నా

పరమ కసాయి

ఆ మనిషి

 

నేనెప్పుడూ మధురమైన మనిషిని కలువలేదు

దయగల మనిషిని

నిజమైన మనిషిని

ఎవరొకరో చీకటిలో వుంటే

భరోసా మనిషి తోడుండాలనుకుంట

ఖచ్చితమైన మనిషే

ఆ మనిషి

 

జాక్సన్ , మిస్సిసిపీలో

లక్షణమైన పురుషులున్నరు

కొందరు బలమైన వాళ్లు

కొందరు నల్లవాళ్ళు

సైనిక నడక వంటి  ఔత్సాహిక పురుషులు

గోధుమవన్నె పురుషులు

ఆ పురుషులు

 

ఒబెర్లిన్, ఒహాయియో లో మంచి పురుషులున్నరు

న్యాయమైన పురుషులు

అందమైన పురుషులు

నిన్ను చేరుకొని, స్వస్థత చేకూర్చే అభిమాన పురుషులు

యోగ్యులైన పురుషులున్నరు

 

ఇప్పుడు నాకు తెలిసింది

మంచి మరియు చెడ్డ పురుషులుంటరని

కొందరు నిజమైన పురుషులు

కొందరు కర్కశ పురుషులు

ఆడవాళ్లూ, శోధన కొనసాగించండి మీ స్వంత మనిషి కోసం

ఆ ఉత్తమ మనిషి

మీ కొరకు మనిషి

 

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.