గజల్

-జ్యోతిర్మయి మళ్ళ

నేను కాదు నిను తలచీ తుళ్ళినదీ నా మనసు
మేను కాదు నిను వెతికీ వెళ్ళినదీ నా మనసు

చంద్రుడేమొ అలుక బూనె రాత్రి కూడ బరువాయే
తనువు కాదు గుబులురేగీ ఒరిగినదీ నా మనసు

కనులేమో నిదురతోడు లేదంటూ ఆరోపణ
రెప్ప కాదు మూతపడక నిలిచినదీ నా మనసు

సింగారము హద్దుమీరె సొగసుకూడ తోడాయే
సిగ్గు కాదు నునుబుగ్గల విరిసినదీ నా మనసు

చుక్కలలో చంద్రుడివీ సాటిలేని ఒక్కడివీ
కల్ల కాదు ఈ నిజమును నమ్మినదీ నా మనసు

*****

Leave a Reply

Your email address will not be published.