
అష్టభుజి
-సుభాషిణి ప్రత్తిపాటి
చించేసిందినా రాతల్ని కాదు..వేవేల నా భావాల్ని…ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేనురగిలించుకుని…నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!వేకువకి మొలిచేవైతే…నా చేతులు తెగిపడేవే…ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…వంటలకవి అవసరం కనుకపాపం మిగిలాయవి…నాతో!!కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…మరిగే మది తలపులనెలా….ఆపగలవు???ఎగిరే ఊహాల రెక్కలనెలాకట్టగలవు??అరచేతితో..అర్కుని ఆపగలవా…???జ్వలించే కవనోదయానికైఏదో ఓ ఉదయంనేను అష్టభుజిగా..అవతరిస్తాను.అక్షర సేవకై సరికొత్త అవతారికవ్రాసుకుంటా నా నవ జీవితానికి!!
*****
Please follow and like us:

ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల. గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు.
కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు. పుస్తక పఠనం, మొక్కల పెంపకం, రచనలు చేయడం ఇష్టమైన వ్యాపకాలు.

చాలా బావుంది మేడం కవిత.శుభాకాంక్షలు