అష్టభుజి

-సుభాషిణి ప్రత్తిపాటి

చించేసింది
నా రాతల్ని కాదు..
వేవేల నా భావాల్ని…
ఎన్నో అంటని రెప్పల కాగడాలతో..నన్ను,నేను
రగిలించుకుని…
నిలుపుకున్న అస్తిత్వపు జాడల్ని!!
వేకువకి మొలిచేవైతే…
నా చేతులు తెగిపడేవే…
ఇరు సంధ్యల మధ్య కడుపు నింపే…
వంటలకవి అవసరం కనుక
పాపం మిగిలాయవి…నాతో!!
కాగితపు గీతలకు గిరి గీయగలవు కానీ…
మరిగే మది తలపులనెలా….
ఆపగలవు???
ఎగిరే ఊహాల రెక్కలనెలా
కట్టగలవు??
అరచేతితో..అర్కుని ఆపగలవా…???
జ్వలించే కవనోదయానికై
ఏదో ఓ ఉదయం
నేను అష్టభుజిగా..
అవతరిస్తాను.
అక్షర సేవకై 
సరికొత్త అవతారిక
వ్రాసుకుంటా నా నవ జీవితానికి!!

*****

Please follow and like us:

One thought on “అష్టభుజి (కవిత)”

Leave a Reply

Your email address will not be published.