జలపాతం (పాటలు) -1

బంగరు కొండ లలిత గీతం

-సాదనాల వెంకటస్వామి నాయుడు

బంగరు కొండ నా బంగారు కొండ

అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండ
మురిపాల కుండా , తెలుసు కొని మసలుకో
నిను వీడకుండా , నిను వేడకుండా
లాలీ జో జో , లాలి జోజో
లాలీ జో జో , లాలి జోజో.     !! బంగరు !!
 
నీ చిట్టి చేతులు, నా చెక్కిలి నిమిరితే
చిన్ని చిన్ని పాదాలు నా గుండెను తాకితే
నీ చిరు నవ్వులు నా మోవిని మీటితే
నా తనువు పరవశాన ఊయలే కాదా  !! బంగరు!! 
 
 వీపు మీద నిను మోసి , గుర్రమాటాడించి
గుక్క పట్టి ఏడిస్తే గోరుముద్ద తినిపించి
చందమామ చూపించి , జోలపాట వినిపించి
అలరించే అమ్మను అలుసు చేయబోకురా
   !! బంగరు !!
చెప్పిందే చెబితే చాదస్తమనుకోకు
ఈ కంట నీరుంటే మదితనమనుకోకు
కాని కాలంలోనా కనికరమే ఉంచరా
అటుదిటు జరిగేనా ఆసరాగ నిలవరా  !! బంగరు !!
బంగరు కొండ నా బంగారు కొండ
అమ్మ మనసు తెలుసుకో అది పాలకుండ
అమ్మ మనసు చూసుకో అది పగలకుండా.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.