జ్ఞాపకాల సందడి-18

-డి.కామేశ్వరి 

ఈ రోజు కట్టుపొంగల్  నైవేద్యం  అమ్మవారికి. పాపం ఆతల్లికూడా   మూడురోజులుగా  రకరకాల నయివేద్యాలు ఆరగించి  కాస్తభారంగావుండి  ఒకటి రెండురోజులు  తేలికగావుండేవి  పడితేబాగుండుననుకుంటిందిగదా .ఆవిడ సంగతి ఏమో నాకు  తేలిగ్గా. తినాలనిపించి ఈజీగా  అయిపోయే  కట్టుపొంగల్చేశా,  అందరికి తెలిసిన వంటే,తెలియనివారికి … అరగ్లాసు బియ్యం ,అరగ్లాసు పెసరపప్పు ,కడిగి  అరగంట నానాక నీరు వార్చి పెట్టుకోండి .చిన్నకుక్కరులో  రెన్డుచెంచాలా నెయ్యివేసి   అరచెంచా జీలకర్ర ,,అరచెంచా కచ్చాపచ్చాగా చితకొట్టిన  మిరియాలు ,ఇంగువ. కరివేపాకు ,కావలసినవారు  కాసిని జీడిపప్పుముక్కలు వేసివేగాక  వాడ్చినబియ్యం వేసి నిమిషం వేయించి  గ్లాసుకి మూడుగ్లాసుల  నీళ్ళుపోసి ,తగినంత  ఉప్పువేసి  మూడు విజిల్స్  రాగానే ఆపండి . నేతి,మిరియం  వాసనతో ఘుమఘుమలాడే  పొంగల్ తయారు. పొయ్యిమీదనించి డైరెక్ట్  ప్లేట్లోవేసుకు  వేడిగా తింటే  కమ్మగా ఎంతో రుచి. నాకు హెవీగా అనిపించినపుడు  లైటుగా ఇది చేసుకుని ,సగం చారుతో,సగం పెరుగు తో తినేస్తే కడుపు  హాయిగా అనిపిస్తుంది . అంతేకాదు  బ్యాచ్లర్  అమ్మాయిలు,అబ్బాయిలు   ఆకుక్కర్లోనే సన్నగాతరిగిన  కేరట్ ,బీన్స్ అలులాటి కురాలుకూడావేసుకునిచేసుకుంటే  పెరుగుతో తినేస్తే fullmeal  అయిపోతుంది .  ఉద్యోగాలుచేసేఅడవారు హడావిడిలో వున్నప్పుడు  గబా గబ రాగానే చేసుకుంటే  బయట  కరిపోయింట్స్ తిండికంటే  ఎంతోమేలు  .పప్పు ,కూరలు ,నెయ్యి  పెరుగు అన్నీవున్న  మీల్ ఇది.సరేనా …….. నిన్న  ప్రసాదం  గురించి  చిన్నకథ  చెపుతా అన్నానుగదా . …. ఒక గురువుదగ్గర  విద్య  నేర్చుకునే  శిష్యుడికి  ఓ సందేహం వచ్చి అడిగాడట .  గురువుగారు  రోజు మీరు  ఇంతసేపు పూజచేసి  రోజు దేముడికి  పళ్ళుఫలాలు ,పాలు,మహానైవేద్యం  అన్నీపెడతారు . అదేముడు  ఒక్కరోజైనా  తినడం నేనుచూడలేదు ,అన్ని అలాగే ఉంటాయి  ఆఖరికి  అన్ని మనమే తింటున్నాం ,మరి ఎందుకు పెడుతున్నారు అని అడిగాడట . గురువుగారు  మంచిప్రశ్నయే , సరే నేను పూజ చేసుకువచ్చి  జవాబు చెపుతా ఈ లోపల  నీవు పుస్తకంలో వున్నా  ఈ శ్లోకంచదివి కంఠతా  పట్టి నాకువప్పచెప్పాలి ,ఒక్కఅక్షరంకూడా  వదల కుండా  చెప్పాలి అని లోపలి వెళ్లి పూజాదికాలు  పూర్తిచేసి  వచ్చేసరికి  శిష్యుడు ఆరాటంగా శ్లోకంవచ్చేసింది  చెప్పనా అనడిగితే  సరే చెప్పు అనగానే  గబగబా  చెప్పేసాడుడు , బాగుంది  అంతా నేర్చేసుకుంటే  మరి అదేమిటి ఆపుస్తకంలో  శ్లోకం అలాగే,అక్కడేవుంది ,అంతా నీతలలోకి  వెళ్లిపోవాలికదా  అన్నారుగరువుగారు శిష్యుడు అర్ధంకాక తెల్లపోతుచూశాడుట ,  నాయనా నీవుపుస్తకంలోని చదివి సారాన్ని,విషయాన్నీ  నీలో నిషిప్తపరుచుకున్నవు తప్పఆశ్లోకంనీలో దాచుకోలేవుకదా .అలాగే దేముడు మనం భక్తితో  పెట్టేప్రసాదంలో ,మన శ్రేధ,భక్తి ,నమ్మకం అనేవి గ్రహించి తీసుకుంటాడు  తప్ప ప్రసాదమంతా తినేసి  మాయమయిపోదు .అని వివరించాడు . ఎంతోగొప్ప  విశ్లేషణ  అనిపించి  మీకు తెలిసిందే అయితే ,తెలియని పిల్లలకి చెప్పండి . ఏ పనిచేసిన స్రేద్ధ ,భక్తి ముఖ్యం అన్న పాఠం ఈ కధ చెపుతుంది,.

ఇవాళ  అమ్మవారికి ‘సుండల్ (అంటే ఏమి కొత్తప్రసాదం కాదు ) అచ్చతెలుగులో  సెనగపప్పు కొబ్బరికూర.తమిళ్లో సుండల్ .దేముడు గుళ్ళలో ప్రసాదంగా ఇస్తారు .బలే కమ్మగాఉంటుంది . మంచి పోషక  ఆహారం .ఊరికే కటోరిలో వేసుకు తినేయచ్చు .మా చిన్నప్పుడు కూరలు దొరకని ఎండాకాలంలో రాత్రిపూట  ఈ సెనగపప్పుకూర ,పాఠోళీ,పెసరట్లకురా లాటివి చేసేవారు ,ఆరోజుల్లు మూడుపూటలా అన్నలేగదా .వేడన్నంలో నెయ్యివేసికుని వేడికూర ,పాఠోళీ లాటివాటికి  వంకాయ పులుసు పచ్చడి  కాంబినేషన్ తో లాగించేవారం పిల్లలం.ఉల్లిపాయపులుసు కూడా .మధ్యాన్నం వంటలు మడివంటలు ,ఉల్లిపాయతో చేసేవి రాత్రికే . ఏదోమొదలెట్టి ఎటోవెళ్లిపోయా .ఇంతకీ చెప్పదేమిటంటే   ఈపదిరోజులు  టిఫిన్లకి  వెతుక్కోకుండా  చక్కగా  ఈ నైవేద్యాలు అమ్మవారికి ఒకాస్త పెట్టి మిగతాది  మనం లాగించవచ్చు .పులిహోర, చక్రపొంగలి ,పొంగల్ ,గారెలు,పరమాన్నం స్వీటా,హాటా అనిచూడకుండా ,తినేస్తే ఆ టైం సేవ్ అవుతే  లలితాసహస్రనామాలు అష్టోత్రాలు చదువుకుంటే పుణ్యం పురుషార్థం  కలిసివస్తుందిగదా. ఈ సుండల్ తరుచూచేసి అందరు తినండి ,రాత్రి సెనగపప్పు నానేసి,పొద్దుటే  కుక్కర్లో పప్పువేసిమునిగేంతవరకు నీళ్లు పోసి ఉప్పేసి ఉడికించి ,వార్చి ,మూకుట్లో కాస్త నెయ్యివేసి ,మినపప్పు,జీలకర్ర కొద్దిగావాలు ఇంగువ ,పచ్చిమిర్చి,కరివేపాకు  పోపువేసి  వార్చిపెట్టిన పాపువేసి  రెండుమూడు నిముషాలు మగ్గాక ,కోరిపొడి జల్లి రెండునిమిషాలు ఉంచి  కొత్తిమీర చల్లి వేడిగా ఆరగించండి .టేబిల్ మీద  పెడితే ఇటొచ్చి ఆటొచ్చి చిన్నాపెద్దా ఎగరగొడతారు ,కమ్మగా వుంది పిల్లలు ఇష్టంగాతింటారు .ఆడవాళ్లు టైం లేక టిఫిన్  తినకుండ ఆఫీసులకి పరిగెత్తేవాళ్లు  ఓ రెండుచెంచాలు తిని  ఓ అరటిపండు  తిని సీసాలో కాస్త మజ్జిగ పట్టుకెళ్లి బస్సులోనైనా  తాగి ఆరోగ్యం కాపాడుకోండి ,ఇల్లాలి ఆరోగ్యమే  ఇంటికి భాగ్యం (చాకిరికి). అంటే ఆ ప్రసాదం లాగించి  (అమ్మవారేంతిందోపాపం ) ఇది రాస్తున్న . ఈ  ప్రసాదలగురించి మంచి గొప్ప  జ్ఞానం కలిగించే కదా గుర్తొచ్చింది .  చాలామంది వినేవుంటారు ,కనీసం పిల్లలకి చెప్పండి . అది రేపు .ఇంక టైపు చేసే ఓపిక అయిపొయింది .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.