“న్యాయం కావాలి” రచయిత్రి శ్రీమతి డి.కామేశ్వరి గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత

డి.కామేశ్వరి సుప్రసిద్ధ కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసారు. “కొత్తమలుపు” నవల “న్యాయం కావాలి” సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.

కామేశ్వరిగారు 1935, ఆగష్టు 22వ తేదీన కాకినాడలో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించారు. 1952లో శ్రీ డి.వి.నరసింహంతో పెళ్ళి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించారు. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

1962లో ఆంధ్రపత్రికలో ‘వనితలు వస్త్రాలు’ అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించారు. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు – ఆకాకరకాయలు అనే కథ వీరు వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి నవల. వీరి కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళభాషలలో అనువాదం చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులు వచ్చాయి.

నవలలు:

కొత్తనీరు
కొత్తమలుపు
కోరికలే గుర్రాలైతే
ఎండమావులు
మనసున మనసై
జీవితం చేజారనీయకు
కార్యేషు మంత్రీ
అరుణ

కథాసంపుటాలు:

వానచినుకులు
కాదేదీ కథ కనర్హం
డి కామేశ్వరి కథలు
కాలాన్ని వెనక్కు తిప్పకు
మధుపం
అతకని బతుకులు
ఇది జీవితం
కన్నీటికి విలువెంత
చీకటి తొలగిన రాత్రి
తల్లిమనసు
నయనతార

ట్రావెలాగ్:
నా విదేశీయాత్రానుభవాలు

పురస్కారాలు:
గృహలక్ష్మి స్వర్ణకంకణము -1971
మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు -1991
మాదిరెడ్డి సులోచన అభినందన అవార్ఢు – 1994
తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు – 1990, 1994, 1999
నంది పురస్కారం – టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత – 2009
ఉత్తమ సినీ కథారచయిత్రిగా న్యాయం కావాలి సినిమాకు సితార, ఆంధ్రభూమి, వంశీ-బర్కిలీ, సినీహెరాల్డ్, కళాసాగర్ సంస్థల నుండి 5 అవార్డులు -1981
ఎండమావులు నవలకు గోపీచంద్ అవార్డు – 2006
సుశీలా నారాయణరెడ్డి అవార్డు – 1998

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.