ఒబ్బిడి

-వసంతలక్ష్మి అయ్యగారి

.. ఏమిటక్కా విశేషాలు ?

ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ 

 కట్టేసినట్టుంటోంది నాకైతే.

అయినా మీ గేటెడ్ కమ్యూనిటీ పని బాగుందిలేవే. ముక్కులకి రామ్ రాజ్తొడుగులేసుకుని యే కామన్ అడ్డాకో పోయి హాయిగా రకరకాలగాసిప్పులు కానిచ్చివస్తారు.

నేనూ వున్నాను .. అయితే నట్టిల్లు … లేకపోతే నెట్టిల్లు .

కొత్త వంటకాలేం చూశావేంటి?

చూడడానికేం … వందలే. చేయడమే మరీ దిగిపోయింది వంటపని.

అదేమలాగ?

ఏంచెప్మంటావ్.. అప్పుడే నాలుగు నెలలుగా యీయనేదో కీటో డైటనిమొదలెట్టారు . ఆయన కూరలు వేరు, సరుకులు వేరు, వంటవేరు .. పల్లీనూనె నువ్వులనూనె పనికిరావట… అయితే ఆవునెయ్యి లేదావర్జినుకొబ్బరినూనె..! ఒకప్పుడు పప్పులో చెంచాడు నెయ్యి వేసినాచెయ్యడ్డుపెట్టిన మనిషి యిపుడు కప్పులతో నేయి పోసి వంటలు. కాకుండా అవేంటో పనీర్ ముక్కలు… సోయా చంకులూనూ! ఈ జిడ్డుకాదుగానీ కిచెను రచ్చరచ్చ! తుడవలేక కడగలేక చస్తున్నాననుకో.

పోనీలెద్దూ పని నీకు తగ్గినందుకు సంతోషించూ..యిల్లంతాఘుమఘుమలకి ఆనందించు.అయినా మీవాడూ…పిల్లా వర్క్ ఫ్రమ్హోమే కదా.. తింటారుగా.

ఏంతినడం… వాడు నెలరోజులుగా యింటర్మిటెంటు ట. వాళ్లనాన్నప్రోటీను మాత్రమే తింటే వీడు కేవలం లోకార్బ్  డైట్ట.ద్విభుక్తమనుకుందూ . పగలు పదికి నానాజాతి సమతులాహారంపండూ కాయ పట్టేసి పన్నెండు గంటలపాటు  ఉపోషమనమాట. ఏదోకీన్వా మీద పడ్డాడు.

మావాడూ చేశాడులే యివన్నీ. . అమెరికాలో నూ యూత్ కిదో వెర్రిట. యేదీ స్థిరముండదు..వేలం వెర్రిలెద్దూ .

ఓహో.. విశ్వవ్యాప్తమయ్యాయా.. యీ ఆహారపుటలవాట్లూ !ఎంచక్కానాలుగురకాలూ కలుపుకుని వేళకి అన్నం తినేసే సుష్మ , ఏకంగాయీమధ్య పూర్తిగా లిక్విడ్ డయటు మీదేననుకో. తేనెచుక్కలు నిమ్మనీరు..రోజుకి పావుకిలో తేనైనా మంచిదేనన్నారట ఎవరో గురువుగార్లుయూట్యూబులో..అంతే.. నాపోరు పడలేక యాపిలుపండుకినారోటిపచ్చడి పూసుకు తింటుంది. కూరకప్పులో వేసుకుని స్నాక్ లాచెంచాతో టకటకలాడిస్తుంది . చస్తే నెయ్యి వాసనకూడా పీల్చదనుకో… ఫ్యాటు ప్యాక్ అవుతుందట యెక్కడెక్కడో ! రేపు పెళ్లైతే యెలాగో !

ఇవన్నీ యీకాలమ్ కామనేనే !మా పెద్దదైతే రెడ్ రైసనిఅమెరికాలోదొరుకుతాయిలే .. అచ్చం కుంకుమపులిమేసినట్టుంటాయి … మనబ్రౌన్ రైసు కంటే గొప్పవిట.. అవితప్పించి మరే రకం తెల్లటిబియ్యమూ వండదంటే నమ్ము.ఇంతకీ నువ్వూ …అసలు తింటున్నావాలేదా ..?

హూం..అందరిబదులూ తినేస్తున్నట్టనిపిస్తోందనుకో .లాక్ డౌననగానేబస్తా బియ్యం వేయించానా.. 5 కిలోల గోధుమపిండి తెప్పించి ఫ్రిజ్కెక్కించాను.ఆమధ్య తనకి సుగర్ పెరిగిందని కొర్రలు పదికిలోలపాకెట్తెచ్చారు . తినడం మానేశారు .ఎక్కడ పొయ్యను .. యిడ్లీ దోశ పొంగల్యేది చేసినా బియ్యానికి బదులు కొర్రలే వాడినా తరగడం లేదు..,

ఇంతకీ బావగారికి బీపీ తగ్గిందా.అత్తయ్యగారు బావుంటున్నారా … భక్తిటీవీ చూస్తున్నారా ?

బావగారు వంటల్లో ఉప్పు తగ్గించేశారనుకో . ఏంలాభం..సాయంత్రమయ్యేసరికి హల్దీరామో…ఘనశ్యామో పొట్లాలులాగించేస్తారు . అత్తయ్గారికి అన్నీ పద్ధతి ప్రకారం జరగాలిగా. అన్నిరుచులూ కావాలి.

చివరకీ నువ్వూ నేనూ యింకా యెటువంటి క్రాష్ డైట్లకిమొగ్గుచూపలేదులావుంది కదూ .

ఎందుకు లేదూ … మనది ట్రాష్ డైట్… అందరి మిగుళ్లూ మనపొట్టలోకేమరి !

బాగా చెప్పావ్ ! మనది ఒబ్బిడ్డైటు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.