“నెచ్చెలి”మాట 

స్త్రీ శక్తి 

-డా|| కె.గీత 

స్త్రీ శక్తి అంటే-

ఆదిశక్తి, పరాశక్తి అంటూ దండకంలో భాగం కాదండోయ్-

స్త్రీలలో సహజంగా ఉండే 

ఓపిక 

సహనం

పట్టుదల 

సామర్థ్యం 

ధైర్యం 

శ్రామికత 

మనో బలం 

ఇలా ఎన్నో…. పాజిటివ్ లక్షణాలు అన్నమాట!

స్త్రీ శక్తికి అడ్డంకులూ ఎక్కువే-

అయినదానికీ కానిదానికీ

స్త్రీ అని గుర్తుచేసేవి

అబల అని ముద్రవేసేవీ

ఇంటా బయటా

మోయలేనన్ని బాధ్యతలు

లెక్కలేనన్ని సమస్యలు

పైకి చెప్పలేని మనోవ్యథలు 

అడుగడుగునా ఎదురుదెబ్బలు 

అయినా-

ఓడిపోకుండా 

వెనకడుగు వెయ్యకుండా

ధైర్యాన్ని సమగట్టుకుంటూ

తనతోబాటూ

చుట్టూ ఉన్నవారిని కూడా 

ముందుకు తీసుకెళ్తూ  

ఉండడమూ 

స్త్రీ శక్తే –

మరి ఇంత శక్తి రావాలంటే ఎలా?

రోజూ గ్లాసు నిండా బూస్టు తాగితేనో 

రోజల్లా అలిసిపోకుండా విటమిన్ టాబ్లెట్లు వేసుకుంటేనో వస్తుందా? 

అన్ని అవసరం లేదుగానీ 

రోదించినా రానివాటికోసం బాధ పడకుండా ఉండడం 

కలత చెందినా గెలవని ఓటమికి  కన్నీరు పెట్టకుండా ఉండడం 

ఏది బలమో

ఏది ముఖ్యమో 

గుర్తించడమూ 

వంటివి కనీసం కొన్ని పాటించొచ్చు-

పాజిటివిటీని పెంచుకుంటూ  

నెగిటివిటీని తగ్గించుకుంటూ  

శక్తిని గుర్తిస్తూ 

ముందడుగు వేసే 

స్త్రీలు 

పది చేతుల్తో పది పనులు అవలీలగా చెయ్యగలుగుతారు 

ఒకేసారి పది బాధ్యతల్ని పదిలంగా మొయ్యగలుగుతారు 

ఆదిశక్తులూ, పరాశక్తులూ కాగలుగుతారు 

 

*****

Please follow and like us:

One thought on “సంపాదకీయం-మార్చి, 2021”

  1. మహిళాదినోత్సవాలు అని ఒక రోజు ఎందుకు అని ప్రశ్న అడిగితే పుట్టినరోజు జరుపుకుంటాము కదా అలాగే అని సమాధానం వచ్చింది.ఈ లాజిక్కుల సంగతి పక్కన పెడితే..ప్రతి ఆడపిల్ల రెండు పదులు దాటి మహిళ గా రూపాంతరం చెందెలోపు..తప్పనిసరిగా సాధించవలసింది ఈ మూడు
    1. తన కాళ్ళ పై తాను నిలబడేందుకు ఆర్ధిక స్వతంత్రాన్ని ఇవ్వగలిగే చదువు
    2.జీవితంలో ఏదైనా అనుకోని అపశృతి పలికినప్పుడు తన పిల్లల్ని తానే పోషించుకోడానికి మనోధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని అందచేసే వృత్తి విద్యలు నేర్చుకుని ఉండటం
    3. ఆడపిల్లకు స్వేచ్ఛ కావాలి అంటే అర్థం…విచ్చలవిడి తనం, ఫాషనబుల్ దుస్తులు కాదు..
    తాను వేసే ప్రతి అడుగు తన అడుగై ఉండటం

    అష్టావధానం చేస్తూ కుటుంబ బాధ్యత, ఉద్యోగ బాధ్యత నెరవేరుస్తున్న ప్రతి మహిళకి…ఎన్ని యుగాలైనా…మేటి మహిళ అంటే మన మాతృమూర్తి అని గర్వంగా చెప్పుకోగల మహిళాలోకానికి..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

Leave a Reply

Your email address will not be published.