ప్రమద

అమండా గోర్‌మన్

సి.వి.సురేష్ 

1998 లో  లాస్ ఏంజెల్స్ లో జన్మించింది.  ఆమె తల్లి జాన్ విక్స్. 6th గ్రేడ్  ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు. సింగల్ మదర్. అమండ గోర్మన్ మరియు గబ్రియలి ఇద్దరూ కవల పిల్లలు. టెలివిజన్ సౌకర్యం కూడా తక్కువగా ఉన్న ప్రాంతం, వాతావరణం లో పెరిగింది.  తన యవ్వన దశను Weird child  గా పెరిగానని అనుకుంటుంది. తన తల్లి ప్రోత్సాహం తో చదవడం, రాయడం పైన బాగా దృష్టి పెట్టింది. చాల సెన్సిటివ్,  శబ్దాలు వినడం అంటే ఆమెకు ఒక ఫోబియా.  చిన్న తనం లో మాట్లాడలేని లోపం ఉండేది.  అప్పుడు స్పీచ్ థెరపీ తీసుకుంది. అదే తన శక్తి అని 2018 లో హార్వార్డ్ పత్రిక కు ఇచిన ఇంటర్వ్యూ లో చెప్పింది.    అర్మాండ్ కూడా ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా చేరింది.  మికేన్ ఫ్యామిలీ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ను సంపాయించింది. హార్వార్డ్ కళాశాల లో sociology చదివింది.  
 
అణిచివేత, స్త్రీ వాదం వంటి అంశాలపై ఆమె ఆక్టివ్ గా ఉంటూ వచ్చింది. తనకున్న ఆ శబ్ద వినికిడి లోపం తనను బాగా ఎక్స్ప్రెస్ చేసే శక్తి ని కలుగ చేసిందని ధైర్యంగా చెపుతుంటుంది. ఈ పోయెమ్ ను జనవరి 2021 లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్  ప్రమాణస్వీకారోత్సవంలో ఆమె చదివాక ఆమె రాసిన సాహిత్యం, సంకలనాలు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా అమ్ముడు పోయాయి.  అటువంటి అద్భుతమైన అమందా గోర్మన్ రాసి చదివిన ఆ కవిత ను  ఇవాళ నెచ్చెలి ‘ప్రమద’  శీర్షిక కు అంద చేస్తున్నాము.
 
 
THE HILL WE CLIMB  ||మనమధిరోహించిన పర్వతం ||
 
ఇన్నాళ్ళూ …
 
మనలో మనమే అనుకొంటూ
 
ఎదురు చూసిన రోజొకటి  మనముందు నిలిచినప్పుడు… 
 
ఇంతవరకూ మనం మోసిన కష్టాన్నీ..
ఆదీ అంతం లేని చీకటిలో..వెలుగునూ
 
మనమెక్కడని చూడాలి?
 
ఖచ్చితంగ… మనమో సముద్రాన్ని దాట గలగాలి.  
 
ఇప్పుడిప్పుడే
 
ఓ మృగాన్ని చీల్చి చెండాడే ధైర్యాన్ని చేసాము
 
మిన్నకుండి పోవడమెప్పుడూ…
శాంతిగా భ్రమించ రాదనీ తెలుసు కున్నాము
 
అంతే కాదు ,
 
న్యాయ నిబంధనల్ని …అందులోని భావాల్నీ కనుక్కొన్నాము.
 
అదెప్పుడూ,  కరిగే మంచు కాదని తెలిసింది.
 
రేపటి ఉదయం మనదేనని తెలుసుకొనేలోగా,
 
ఆ ఉదయాన్ని ఏదోఒకలాగ స్వంతం చేసుకొన్నాము.
 
విచ్ఛిన్నమవ్వని ఈ దేశ ఉనికిలో మనముంటూ ..
 
అందుకు సాక్షీభూతమయ్యాము
 
కానీ, అప్పుడే అది పరిపూర్ణం కాదు. 
 
ఈ దేశకాలమానాలకు  వారసులుగా –
 
బానిసల  కంటే ఇంకా కిందకు జారి, ఒక తల్లి పెంపకంలో పెరిగిన
 
బక్కపలచటి నల్ల పిల్ల
 
ఈ దేశ అధ్యక్షురాలినవ్వాలన్న కలగనగలిగింది.
 
అది కూడా,  
 
కేవలం తనను తాను తెలుసుకోవడానికే.
 
అవును,
 
మేము మా సహజ స్థితి లో  ఉండటానికీ,
 
మమ్మల్ని మేము మెరుగు పరచుకోవదానికీ..
 
చాల దూరంగా ఉంటూవచ్చాము.
 
అలా అని,  
 
నిర్దిష్టంగా సంఘటితమవ్వడానికి
 
బాగా శ్రమ పడినామన్నట్లు కాదు.
 
ఇలా సంఘటిత శక్తిగా మారాడనికి ..
 
మేము ప్రయత్నించడం వెనక ఓ కారణముంది
 
ఈ దేశ సంప్రదాయాల్నీ, రంగుల్నీ,
 
ఇక్కడి వ్యక్తిత్వాలనీ, మనిషి స్థితిగతులపై
 
కట్టుబడి ఉన్న ఈ దేశాన్ని క్రమబద్ధీకరించడం కోసమే!  
 
అందుకే, మా మధ్య ఉన్న అంతరాల కంటే,
 
మా ఎదుట నిలిచిన అడ్డంకులపైనే ఎక్కువగా  దృష్టి సారించాము.
 
మాలోనే మేము విభజింపబడటాన్ని అడ్డుకట్ట వేశాము.
 
ఎందుకంటే, మాకు తెలుసు,
 
సమున్నత భవిష్యత్తు కోసం
 
మొట్ట మొదటగా, మా మధ్య విభేదాలకు స్వస్తి పలకాలని.
 
మనమొకరికొకరం  కలిసి కట్టుగా
 
ఉండేందుకు , మన బాహువుల్ని కిందికి దించేద్దాం
 
మా తపన, అందరి సామరస్యం కోసమే తప్ప,
 
ఎవరికి కీడు చేయడం కోసం కాదు.
 
ఇంకోటేదీ లేకపోతే,
 
ఇదే ఇదే నిజమని, ఈ భూగోళం మొత్తం చెప్పనివ్వాలి.
 
మనం దుఃఖ పడినప్పటికీ, ఎదిగాము.
 
మనం గాయపడినప్పటికీ దృఢవిశ్వాసం తో వుండినాము
 
అలసినప్పటికీ, ప్రయత్నాన్ని ఆపలేదు
 
శాశ్వత బందీలమైనప్పటికీ, విజేతలుగా నిలిచాము.
 
ఓటమినెప్పుడూ చూడమని చెప్పడం కాదు కానీ,
 
ఇక ఎప్పుడూ విబేధాలు తలెత్త కూడదనే మా తపన.   
 
***
 
మనల్ని ..
 
ఏ శక్తీ భయపెట్టే స్థితి లో ఉండకూడదని,
 
మనమెప్పుడూ స్వయం నిర్మితమై ఉండాలని
 
మన పురా గ్రంథాలు  స్పష్టంగా చెపుతాయి.
 
మనం నిర్దేశించుకొన్న కాలం లో మనం జీవిస్తే,
 
విజయమెప్పుడూ  కష్టాల వెనుక దాగిఉండదు.
 
మనం నిర్మించిన అన్ని వారధులూ
 
ఈ సంక్లిష్ట అడవుల్ని ధాటి పచ్చిక బయళ్ళు చేరవేసేవే..
 
మనమదిరోహించిన  పర్వతం
 
మనం సాహసించినప్పుడే సాధ్యపడింది.  
 
మనం వారసత్వంగా సంక్రమింప చేసుకున్న
 
ఆ కీర్తి కన్నా…..మనం అమెరికన్లు గా మనగలగడమే గొప్పది   
 
***
 
మనమెలా అడుగులు  వేసామో..
 
మనమెలా చక్కదిద్ధామో అన్నది గతం.
 
సమైక్యమవ్వడం లో ,
 
మన జాతిని…భాగస్వాములను చేయకుండా..
 
చెల్లాచెదురు చేసిన  ఒక శక్తిని చూసాము. 
 
ప్రజాస్వామ్యాన్ని సాధించడం కాస్త ఆలస్యమైనా.
 
అది ఎప్పటికీ  శాశ్వతంగా ఓడింపబడదు!
 
***
 
ఈ నిజం లో …. మనం నమ్మే ఆ నమ్మకంలో
 
మనమెప్పుడైతే మన దృష్టి భవిష్యత్తు పై ఉంచుతామో,
 
చరిత్ర మన పైన దృష్టి పెడుతుంది.
 
ఇది కేవలం ఒక విముక్తి అయ్యే యుగమే.
 
అది ఎలా మొదలవుతుందోనన్న భయమే ఇప్పటికీ!
 
భయానకమైన గతానికి
 
వారసులుగా ఉండేందుకు మేము సిద్ధంగా లేము.
 
కానీ, ధృఢమైన నమ్మకం తో పాటు సంతోషాన్ని
 
మనకు మనమే అందించుకోనేందుకు, ఆ దారుణ గతం నుండే
 
ఒక నూతన అధ్యాయాన్ని రచించే శక్తి ని కనుగొన్నాము.
 
***
 
ఆ మహా విపత్తుపై ,
 
మేమెలా విజయాన్ని సాధించగలిగామని అడిగినట్లయితే
 
ఆ మహా విపత్తు మాపై విజయాన్నెలా సాధించిందో…..
 
ఇప్పుడిప్పుడే అంచనా వేయగలుగుతున్నాము
 
భవిష్యత్తు లో మేమెలా ముందుకు నడవాలో
 
అన్న ఆలోచన తప్ప .. గతం పై వెనక్కు చూసే ప్రసక్తే లేదు.
 
ఈ దేశం మొత్తం గాయమైనప్పటికీ
 
అది సాహసోపేతంగా , కరుణగా, భీకరంగా,  స్వేచ్ఛగా ఉంటూనే వచ్చింది. 
 
***
 
బెదిరింపులవల్ల కలిగే అవాంతరాలతో…
 
మేమెక్కడా వెనుతిరగము
 
ఎందుకంటే, మా యొక్క నిష్క్రియాత్మకత మరియు  జడత్వం
 
మా రాబోయే తరాలకు అది వారసత్వమని మాకు తెలుసు.
 
మా తప్పులు భవిష్యత్తరాలకు భారమవుతాయనీ  తెలుసు.
 
కానీ, ఒకటి మాత్రం నిశ్చయం …..
 
మా బలాన్ని , దయార్ద హృదయంతో కలిపి
 
సరైన దిశగా కదిలితే
 
ప్రేమ మా వారసత్వమవుతుంది.
 
అప్పుడు మా పిల్లల జన్మ హక్కు మార్చబడుతుంది. 
 
***
 
కాబట్టి,
 
ఇప్పుడు మనకు విడిచి వెళ్ళిన దేశం లాంటిది కాకుండా,
 
మనమొక మంచి  దేశాన్ని మన రాబోయే తరాలకందివ్వాలి.
 
ఉక్కు నిర్మితమైన నా  ఛాతీ నుండి
 
విడుదలయ్యే ప్రతి శ్వాస
 
ఈ గాయపడిన ప్రపంచాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతుంది.
 
ఈ దేశపు ..
 
స్వర్ణ భరిత దక్షిణ పర్వతాల నుండీ…
 
నైరుతి సుడిగాలుల నుండి ఉదయిస్తాం
 
అక్కడే మన పూర్వీకులు
 
మొదటగా విప్లవ చైతన్యవంతులయ్యారు.
 
సరస్సులతో నిర్మితమైన
 
మధ్య -పశ్చిమ రాష్ట్రాల నుండి మేము ఉద్భవిస్తాం
 
మండే సూర్యుడితో ప్రజ్వరిల్లే ఆ దక్షిణాన్నుండి ఉదయిస్తాం.  
 
***
 
మేమీ దేశాన్ని
 
పునర్నిర్మిస్తాం, పునరుద్ధరిస్తాం, పునరుజ్జీవింప చేస్తాం.
 
ఈ దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ,
 
మనదేశమని పిలవబడే ప్రతి  మూలనున్న ప్రజలు,
 
భిన్నంగాఉన్నా, దెబ్బతిన్నా  అందంగా ఉద్భవిస్తారు.
 
ప్రతి ఉదయాన్నే, నీడల నుండీ,
 
జ్వలిస్తూ, నిర్భీతి తో అడుగు బయట పెడతాం
 
స్వేఛ్చ చేరే కొద్దీ  సరికొత్త సూర్యోదయం వికసిస్తుంది.
 
మేము ధైర్యంగా చూడగలిగినప్పుడూ…
 
అంతే ధైర్యంగా అందులో ఉన్నప్పుడు మాత్రమే
 
అక్కడంతా కాంతి విస్తరించే ఉంటుంది.
 
****
 
When day comes we ask ourselves,
where can we find light in this never-ending shade?
The loss we carry,
a sea we must wade.
We’ve braved the belly of the beast,
We’ve learned that quiet isn’t always peace,
and the norms and notions
of what just is
isn’t always just-ice.
And yet the dawn is ours
before we knew it.
Somehow we do it.
Somehow we’ve weathered and witnessed
a nation that isn’t broken,
but simply unfinished.
We the successors of a country and a time
where a skinny Black girl
descended from slaves and raised by a single mother
can dream of becoming president
only to find herself reciting for one.
And yes we are far from polished.
Far from pristine.
But that doesn’t mean we are
striving to form a union that is perfect.
We are striving to forge a union with purpose,
to compose a country committed to all cultures, colors, characters and
conditions of man.
And so we lift our gazes not to what stands between us,
but what stands before us.
We close the divide because we know, to put our future first,
we must first put our differences aside.
We lay down our arms
so we can reach out our arms
to one another.
We seek harm to none and harmony for all.
Let the globe, if nothing else, say this is true,
that even as we grieved, we grew,
that even as we hurt, we hoped,
that even as we tired, we tried,
that we’ll forever be tied together, victorious.
Not because we will never again know defeat,
but because we will never again sow division.
Scripture tells us to envision
that everyone shall sit under their own vine and fig tree
and no one shall make them afraid.
If we’re to live up to our own time,
then victory won’t lie in the blade.
But in all the bridges we’ve made,
that is the promise to glade,
the hill we climb.
If only we dare.
It’s because being American is more than a pride we inherit,
it’s the past we step into
and how we repair it.
We’ve seen a force that would shatter our nation
rather than share it.
Would destroy our country if it meant delaying democracy.
And this effort very nearly succeeded.
But while democracy can be periodically delayed,
it can never be permanently defeated.
In this truth,
in this faith we trust.
For while we have our eyes on the future,
history has its eyes on us.
This is the era of just redemption
we feared at its inception.
We did not feel prepared to be the heirs
of such a terrifying hour
but within it we found the power
to author a new chapter.
To offer hope and laughter to ourselves.
So while once we asked,
how could we possibly prevail over catastrophe?
Now we assert,
How could catastrophe possibly prevail over us?
We will not march back to what was,
but move to what shall be.
A country that is bruised but whole,
benevolent but bold,
fierce and free.
We will not be turned around
or interrupted by intimidation,
because we know our inaction and inertia
will be the inheritance of the next generation.
Our blunders become their burdens.
But one thing is certain,
If we merge mercy with might,
and might with right,
then love becomes our legacy,
and change our children’s birthright.
So let us leave behind a country
better than the one we were left with.
Every breath from my bronze-pounded chest,
we will raise this wounded world into a wondrous one.
We will rise from the gold-limbed hills of the west.
We will rise from the windswept northeast,
where our forefathers first realized revolution.
We will rise from the lake-rimmed cities of the midwestern states.
We will rise from the sunbaked south.
We will rebuild, reconcile and recover.
And every known nook of our nation and
every corner called our country,
our people diverse and beautiful will emerge,
battered and beautiful.
When day comes we step out of the shade,
aflame and unafraid,
the new dawn blooms as we free it.
For there is always light,
if only we’re brave enough to see it.
If only we’re brave enough to be it.

*****

Please follow and like us:

4 thoughts on “ప్రమద -అమండా గోర్‌మన్”

  1. అద్భుతమైన కవిత. అత్యద్భుతమైన అనువాదం. అభినందనలు సర్.

  2. సురేష్‍, అనువాదం చాల బాగుంది. పొయెమ్‍ అప్పటి గతానికి (ట్రంప్‍ హయాంలో ముంకొచ్చిన అమెరికన్‍ జాతి చీలిక ధోరణులకు), దాని మీద… ఎన్నికల్లో… అమెరికన్‍ ప్రజల విజయానికి అద్దం పట్టింది. కొత్త అధ్యక్షుడు బైడెన్‍ ప్రధాన కర్తవ్యం జాతి పునరైక్యత అని రైట్‍ మైండెడ్‍ అమెరికన్లు అందరూ అనుకుంటున్నదే. కవిత అమెరికన్లందరి మనస్సులలోని భయాలూ ధైర్యాలకు, సందేహాలూ సంకల్పాలకు ఒక జెండా లా ఉంది. ఇంత మంచి పద్యాన్ని సమర్థంగా అనువదించి ప్రచురించడం ద్వారా భారతీయులు చేయాల్సిందేమిటో పరోక్షంగా మీరు/పత్రిక సూచించినట్లయ్యింది. అందుకు ప్రత్యేకించి, అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.