నిష్కల – 6

– శాంతి ప్రబోధ

కరణ్ ఇంట్లో ఉన్నంత సేపు కరుణకి ఊపిరి ఆడినట్లు ఉండదు.   అతని మొహం చూడటం ఇష్టం ఉండటం లేదు

మేడిపండు లో కులకులలాడే పురుగులు కనిపిస్తాయి ముఖంలో

అతను ఎప్పుడు బయటికి వెళతాడా అని ఎదురు చూస్తున్నదిమంచం మీద నుంచి లేవకుండా నిద్ర నటిస్తున్నది.  

కానీ,అతను వెళ్తున్న అలికిడి లేదు

నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కరుణకు ఆకలి బాగా వేస్తున్నది.  

ఏమీ చేసే ఓపిక లేదుశరీరం అంత పచ్చి పుండు లాగా ఉందిలేచి నుంచునే ఓపిక లేదు.  

అసలు అతను మనిషేనా అని ఒక్కోసారి సందేహం వస్తున్నది

మొగుడు అంటే భార్యను ప్రేమగా, అపురూపంగా చూసుకుంటాడని అనుకుందిఅందులో అంతస్తులు మరచి కోరి చేసుకున్న పెళ్ళాన్ని అందలం ఎక్కిస్తాడని మిత్రురాళ్లు తనని చూసి, తన భర్త హోదా ఐశ్వర్యం చూసి అన్నప్పుడు హృదయంలో సంతోషంగా ఉవ్వెత్తున ఎగిసిన అలలు.. 

ఊహలకి వాస్తవానికి నింగికీ నేలకు ఉన్నంత దూరం ఉంటుందని పెళ్లయిన తర్వాత కానీ ఆమెకు అర్థం కాలేదు

అసలు పెళ్లంటే ఏంటి

మూడు ముళ్లు , ఏడడుగులు అంతేనా ..?

మనసులు కలవాల్సిన పని లేదా ..? 

శరీరాలు కలిస్తే సరిపోతుందా

పెళ్లప్పుడు చిలకాగోరింకల్లా ఉన్నారు. పాలు నీళ్లలా కలిసి పోవాలి అని పెద్దలు అనడం వినిందిఅది నిజంగా జరుగుతుందా ..? అనేకానేక ప్రశ్నలు , సందేహాలు ఆమెలో

ఏమో .. అందరి విషయంలో ఎలా ఉంటుందో తెలియదు. కానీ తన విషయంలో మాత్రం అది సాధ్యం కాదని స్పష్టం అయిపోయింది.   

అతనికి మనసు లేదేమో. శరీరం మాత్రమే కనిపిస్తుందేమో.    

మనసు శరీరం సహకరించని స్థితిలో ఆమె. మాసిన వెలుతురులో అతని చేతిలో నలిగి పోయింది.  

అతని చేష్టలు భరించే శక్తి కరుణ శరీరానికి, మనసుకి లేదుఅలాగని ఎదురు తిరిగే ఓపిక కూడా లేదుకోరికతో అనడం కంటే కామంతో రగిలిపోయే అతన్ని కాదంటే అతనిలో పాము బుసలు కొడుతుంది. కొండచిలువలా చుట్టేస్తుంది

వచ్చిన మరుసటి రోజు నుండి అతని నగ్న స్వరూపం వెల్లడవుతూనే ఉన్నది. క్షణాల్లో మారిపోయే అతని మూడ్, ఉరుములేని పిడుగుల్లా ..  పెద్ద పెద్దగా అరుస్తూ ఇంట్లో నానా బీభత్సం సృష్టిస్తాడునన్ను భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాడు.  

అంతలోనే ప్రేమిస్తున్నానంటాడు. మరుక్షణంలోనే ఆవేశంతో, ఆగ్రహంతో ఊగిపోతాడుఏం చేస్తాడో అతనికి తెలుస్తుందో లేదో .. అతనో మానసిక రోగి

మాట అంటే ఇంకేమన్నా ఉందా .. పీకనులిమేసినా ఆశ్చర్యం లేదు అనుకున్నదామె

అలా కాకుండా ప్రేమతో చుట్టుకుంటే పరవశించిపోయేది. అల్లుకుపోయేదిప్రేమగా మసలుకుంటే తాను మరింత ప్రేమ పంచేదిఅతని ప్రేమకి, వయసుకి, అనుభవానికి , పెద్దరికానికి దాసోహం అయ్యేది

అతనేంటో అర్ధమయిపోయిందిమరో దారి లేక మౌనంగా ఒళ్ళు అప్పగించిందితన ఇష్టం వచ్చినంత సేపు ఆడుకుని వదిలేశాడు

అతను అన్నట్లు తను ఎండు కట్టెపుల్లలాగా  ఉందా ఆలోచన చేసింది.  

మనసు , శరీరం ఆనందంతో పెనవేసుకున్నప్పుడే కదా దాంపత్యానికి అర్థం

స్పందన లేని శరీరం, మనసు అలాగే ఉంటుందని అతనికి ఎప్పటికైనా  తెలిసుస్తుందా..?  మనుషుల్ని వస్తువులాగా వాడుకునే వాళ్ళకి తనతో వచ్చిన ఆడదాని మనసు ఏమి తెలుస్తుంది

అతనితో ఉన్న పరిచయం, అనుబంధం పాతవై అతని ప్రవర్తనతో వచ్చిన విసుగు కాదుపలుచబడిన బంధం కాదు.  

ఆత్మగౌరవం లేని బంధం నచ్చకపోయినా కన్నీటిని దాచుకుంటూ ఎన్నాళ్ళు బ్రతకగలదు. తన జీవితాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు సబబు.. తనను తాను ప్రశ్నించుకుంది కరుణ.  

అతను మగాడు. తాళి కట్టిన మొగుడు. అతనికి ఆమె  శరీరాన్ని ఎలాగైనా వాడుకునే అర్హత ఉందని భావించే అహంభావి. శరీరాల కలయిక తప్ప మనసుల కలయిక గురించి అర్థం చేసుకోలేని మూర్ఖుడు. ఇంతకన్నా భిన్నంగా ఎలా ఆలోచిస్తాడు

తన తల్లిని తండ్రి కొట్టినప్పుడు నేను నా భార్యను కొడితే తప్పేంటి అనుకునే అతని సంస్కారం ఎల్లలు దాటి విశాల విశ్వం లోకి ప్రయాణించినా మాత్రం మారలేదు.

బోలెడన్ని నగలు చేయించాను. పట్టు చీరలు కొన్నానుఅమెరికా తీసుకొచ్చాను. ఒక ఆడదానికి ఇంతకంటే ఏం కావాలి అనే అతనికి ఆడదాని మనసు ఎలా తెలుస్తుంది

అల్లుడుగారు చాలా మంచివారు. నిన్ను మహారాణిలాగా చూసుకుంటారని అమ్మ మురిసిపోయిందిఆయన నా కోసం కొన్న, నగలు బట్టలు చూసి. కలలరాజ్యంలో తన బతుకు ఊహించుకునిపెళ్ళికి వచ్చిన వాళ్లందరిదీ అటూ ఇటుగా అదే అభిప్రాయం

తప్పు తన ఆలోచనలో ఉందో లేక వారి ఆలోచనలో ఉందో తెలియదు. అతనందిస్తున్నాననుకునే భోగభాగ్యాలు నాకు అవసరం లేదు

మనసు పంచుకునే మనిషి కావాలి. నా సంతోషాన్ని, ఆనందాన్ని, అనుభూతులను పంచుకునే తోడు కావాలిఅతనిచ్చిన వస్తువులతో పంచుకోలేనుగా మూగగా అనుకుంది ఆమె

 రూమ్ లోకి వచ్చి వెళ్తున్న అడుగుల చప్పుడు వెనకే ఛీఛీ .. ఎప్పుడు చూసినా  రోగిష్టి దానిలా మంచం మీద పడి ఉంటుంది. చక్కగా తయారై మొగుడికి కమ్మగా ఒండి పెడదామని లేదు. ఛీఛీ .. గట్టిగా గొణుగుతూ వెళ్ళాడు అతను.

ఫోన్ చేసిన అతని తల్లి తో మాట్లాడడం విన్న తర్వాత తల్లి అంటే కూడా ఏమాత్రం గౌరవం లేదని, ఇంట్లో తల్లికి ఎటువంటి విలువ లేదని స్పష్టమైంది కరుణకి

ఇంతటి సంస్కార హీనుడిని, శాడిస్టుని జీవితాంతం ఎట్లా భరించాలి. ఒళ్ళు జలదరించింది

కదిలినప్పుడల్లా ఒళ్ళంతా పుండు పడ్డట్టు నొప్పివిరిసీ విరియని పువ్వులాంటి తనను వికృతంగా నలిపేసి ఉదయాన్నే వికసించిన పుష్పంలా ఉండాలని కోరుకుంటే ఎలా సాధ్యమవుతుంది

ఆడవాళ్లంటే ఇసుమంత గౌరవం లేని అతను బయటకు వెళ్లినప్పుడు మహిళల ముందు మంచి ముసుగు వేసుకుని తిరుగుతాడు. ఎంత బాగా నటిస్తాడు అని ఆశ్చర్యం ఆమెలో.  

నిష్కల వస్తే ఆమె సహాయం తీసుకుని చెరనుండి బయటపడాలి. ఇక్కడ ఉండను గాక ఉండనుఇతన్ని భరించే సహనం, ఓపిక నాకు లేవు. తీవ్ర భావోద్వేగాలకి లోనవుతూ అనుకుందామె

ఇంటికి దూరంగా  పెరిగిన కరుణ పెళ్లయిన జంటల్ని దగ్గరగా చూసింది తక్కువచూసిందల్లా ఆమె అక్క బావలనే.  

వాళ్ళు చాలా స్నేహంగా ఉంటారు. బావ చేసేది చిన్న ఉద్యోగమే కావచ్చు. కానీ అక్క చాలా ఆనందంగా ఉంది. బావ చాలా మంచివాడు . అక్కని ఇబ్బంది పెట్టడం చూడలేదుఅక్క నోట వినలేదు

కానీ ఇతనేంటి ఇలా .. ? కళ్ళు మూసుకుని పరిపరివిధాలా ఆలోచిస్తున్న ఆమె ముక్కుపుటాలను కమ్మటి వాసన తాకింది

రోజూ పాలలో సీరియల్స్సాండ్ విచ్ తో కడుపు నింపుకునే అతను కళనున్నాడో ఉప్మా చేశాడు.  కమ్మటి జీడిపప్పు ఉప్మా వాసనలకు ఆమె ఆకలి మరింత పెరిగింది.  

ఉదయం కరణ్ ఆఫీస్ కి వెళ్ళ లేదు. ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటున్నాడు.  

అతను ఎప్పుడు వెళతాడా అని ఎదురు చూస్తున్నది ఆమె

నిష్కల వస్తానన్నది.   నిన్న నిష్కల వెళ్లినప్పటి నుంచి ఆమె రాక కోసం ఎదురుచూపులు, నరకం నుండి బయటపడేసే ఆశాకిరణం లా ఉంది నిష్కలరేపు వస్తానని ఆమె ఇచ్చిన భరోసా కరుణలో కొండంత బలాన్ని నింపింది.   

దైన్యం స్థానంలో ధైర్యం ఊపిరి పోసుకుంటున్నదిఆమె వస్తే తన సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందనే చిరు ఆశ మారాకులు వేస్తున్నది.  

ఇప్పుడెలా అతను ఇంట్లో ఉంటే .. దిగులు మొదలైంది ఆమెలో

ఒకవేళ నిన్న ఆమె వచ్చి వెళ్లడం అతను చూశాడాఅందుకే కాపలా వేశాడా ఆమెలో సందేహం మొదలైంది

లేకపోతే ఇరుగుపొరుగు ఎవరైనా ఏమైనా చెప్పారా .. ఎన్నెన్నో ప్రశ్నలు ఆమెలో.. 

నరకంలో నుంచి బయటపడే మార్గం మూసుకు పోతుందా .. ఆందోళన మొదలైంది ఆమెలో  .. 

రెండు నెలల్లో తన జీవితంలో ఎంత మార్పు. కొద్దిగా పక్కకు ఒత్తిగిలి ఆలోచిస్తున్న దామె

హాయిగా ఉద్యోగం చేసుకుంటూ, భవిష్యత్ గురించి కలలు కంటూ ఉన్నది. అప్పటికే కాలేజీలో ఉన్నప్పుడు, ఉద్యోగంలో చేరిన తర్వాత కొందరు ప్రొపోజ్ చేశారు. అందరికీ ఒకటే సమాధానంనేనిప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లో లేనని సున్నితంగా తిరస్కరించింది

అలాంటిది  సంబంధం రాగానే ఎట్లా మెత్తబడింది. ఎందుకు మెత్తబడింది?  అతని అందం చూసా, అతని మాటకారి తనం చూసా ..  ఉద్యోగం చూసా .. అతనున్న అమెరికా చూశా .. లేకపోతే మీనాక్షమ్మను చూసా లేకపోతే తను కన్న కలలు నిజం చేసుకునే అవకాశం వచ్చిందనా  లేక తన అందంపై ఉన్న నమ్మకంతోనా ?! బహుశా అన్నీ కారణమేమో…   

హాయిగా వెన్నెలలో విహరించే తను ఒకే ఒక్క నిర్ణయంతో అమావాస్య చీకట్లో కూరుకుపోయిందిజీవితం తలకిందులై పోయిందిసమయం మించిపోలేదు. సరిదిద్దుకోవాలిలేకపోతే ఊబి నుంచి లేవడం మరింత జటిలం అవుతుంది

రేపనేది తనకు ఉంటుందా.. వెలుతురు ప్రసరిస్తుందా..?  ఆశనిరాశల్లో కొట్టుమిట్టాడుతూ కరుణ

దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిందిచదువు చెప్పించలేని తల్లిదండ్రుల పేదరికం. చదువు అంటే పిచ్చి కరుణకి. అది ఊరి ప్రైమరీ స్కూల్ టీచర్ గమనించి సాంఘిక సంక్షేమ హాస్టల్ లో చేర్చమని సలహా ఇచ్చిందిఅలా ఎప్పుడూ చదువులో ఫస్ట్ ఉండేది. ఇంటర్ వరకు హాస్టళ్లలో ఉండి చదివింది.  హైదరాబాద్ లో బి టెక్ లో చేరిందితన ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడనంత వరకు వారు తన చదువుకు అడ్డు చెప్పరని ఆమెకు తెలుసుఅందుకే కాలేజీకి అప్లై చేసినప్పటి నుంచి ఉద్యోగ అన్వేషణ కూడా మొదలు పెట్టింది

క్రమంలో పెద్దింటి లో ఉండే ఒంటరి మహిళ మీనాక్షమ్మకు హెల్పర్ గా చేరిందిఅమ్మమ్మా అని నోరారా ప్రేమగా పిలిచే కరుణ అంటే మీనాక్షమ్మకి అభిమానంఆవిడ కూడా సొంత మనవరాలిని చూసినట్లుగా ఆప్యాయంగా చూసుకునేదిక్రమంగా వారి మధ్య అనుబంధం పెరిగిపోతున్నదిఒకరికొకరు ఆలంబన అయ్యారు

బంధువర్గంలో ఇంజనీరింగ్ చదివిన మొదటి అమ్మాయి. చుట్టూ ఉన్న ప్రపంచంలో అమెరికా లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం గురించి అందరూ కలలు కన్నట్టే తను కూడా కన్నది

ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్లాలనుకున్నదిఒకసారి అక్కడికి చేరగలిగితే చాలు తన చదువుకు , తన ఖర్చులకోసం ఉద్యోగం చేసి సంపాదించుకోగలదు అని ధీమాతో ఉండేది తర్వాత అమ్మానాన్నలను కూడా బాగా చూసుకోవాలి అని ఆలోచించేది.  

క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఒక మల్టీ నేషనల్ కంపెనీ మంచి ఆఫర్ ఇచ్చింది

వచ్చిన మంచి ఉద్యోగాన్ని వదులుకుని అప్పులు చేసి చదువుకోవలసిన అవసరం లేదని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పెళ్లి చేస్తే తమ బాధ్యత అయిపోతుంది అన్నారుపెళ్ళికి ఖర్చు చేసే సొమ్ము నాకిస్తే నేను చదువుకుంటానని చాలా బతిమాలిందిఅక్క బావ తో సహా ఎవరూ కరుణకు అండగా నిలబడలేదు

రెండేళ్లు ఉద్యోగం చేసి కొంత సొమ్ము కూడ పెట్టుకుని అప్పుడు తన కోరిక నెరవేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కరుణ ఉద్యోగంలో చేరిపోయింది.

కానీ మీనాక్షమ్మని వదలలేదుమీనాక్షమ్మ కి కూడా కరుణని వదలాలని లేదునీ పెళ్లి అయ్యేవరకు నా దగ్గరే ఉండాలి. నీ పెళ్లి నేనే చేసి పంపిస్తాను అని నవ్వేది ఆవిడనా మనవరాలిని చూసుకుంటున్నాను నీలో అనేది

సరిగ్గా అదే సమయంలో కొన్ని సంబంధాలు ఉన్నాయని అమ్మాయిల్ని చూడ్డానికి హైదరాబాద్ వచ్చాడు కరణ్.  

మీనాక్షమ్మ కూతురు అతనితో విటమిన్ టాబ్లెట్స్, క్రీములు వంటివేవో ఇచ్చిపంపిందిఅవి ఇవ్వడానికి  మీనాక్షమ్మ దగ్గరకి వచ్చాడు కరణ్మీనాక్షమ్మకు దూరపు బంధువు కావడంతో ఆమె కోరిక మీద రోజు ఆవిడతో ఉన్నాడు

అప్పుడే మీనాక్షమ్మ దగ్గర ఉన్న కరుణ ని చూసాడు.   

పొందికైన శరీరాకృతితో, వినయంగా విధేయంగా ఉన్న కరుణ అతనికి చాలా నచ్చింది.  

ఇండియా వచ్చే ముందే ఆన్లైన్ లో ఎంపిక చేసుకున్న వాళ్ళు ఎవరూ కరుణను చూసిన అతని కంటికి నచ్చలేదు

మీనాక్షి అమ్మ దగ్గర కరుణ గురించి కదిపాడుఆమె మొదట మీ ఇద్దరికీ కుదరదని స్పష్టం చేసింది. ఇద్దరికి వయసులో ఉన్న వ్యత్యాసం, ఆర్థిక వ్యత్యాసం, కుల వ్యత్యాసం కుదరవన్నది

ఆమె కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ కరుణను పెళ్లి చేసుకోవడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని కరుణని పెళ్ళికి ఒప్పించాల్సిందిగా కోరాడు

కరుణ కలలు , జీవితంలో పైకి ఎదగాలన్న కోరిక తెలిసిన మీనాక్షమ్మకి కరణ్ ప్రపోసల్ ని ఆలోచించేలా చేసింది.  

మీనాక్షమ్మ బంధువుగా మాత్రమే కరణ్ తో కరుణ పరిచయంఅంతకు మించి మరో ఆలోచన చేయలేదు

రోజు పడుకునే ముందు నెమ్మదిగా ప్రస్తావించింది మీనాక్షమ్మఆమె ప్రతిపాదన విని మొదట నివ్వెరపోయింది తర్వాత ఆనందపడింది. మనసు ఉద్వేగంతో గంతులు వేసింది కరుణకు

నాలుగు రోజుల్లోనే హడావిడిగా ఎంగేజ్ మెంట్ చేసుకుని అమెరికా వెళ్ళిపోయాడు కరణ్. మరో నెలన్నర రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు

కరణ్ తిరిగి వెళ్లినప్పటి  నుండి రోజు సాయంత్రం అయ్యిందంటే టంచనుగా ఫోన్ వచ్చేది . అంటే అతను లేవగానే ఫోన్ చేసేవాడు.  

అమెరికా రావాలంటే నీ చదువు ఎందుకు పనికి రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి . కోర్సులు చేయాలిఅది చెయ్యి ఇది చెయ్యి అంటూ .. 

కోర్సుల్లో చేరడానికి డబ్బులు లేకపోతే నేను పెడతాను అంటూ.  

కోర్సులో చేరిన తర్వాత ఏం నేర్చుకుంటున్నావ్ ..  అంటూ నేర్చుకునే దానిపై ప్రశ్నలుజవాబు చెబితే ఎవడు వాడు నీకు చెప్పింది . వాడికివ్వు నేను మాట్లాడతా అంటూ ఇన్స్ట్రక్టర్ కి క్లాసులు పీకడం .. 

ఒకరకంగా విసిగిపోయింది కరుణ

ఇప్పుడే అంత అధికారం , అజమాయిషీ చెలాయిస్తుంటే భరించేది అని లోలోనే మదనపడిందినా మంచి చెడు చూస్తున్నాడు అని సరిపెట్టుకో లేక రోజు మీనాక్షమ్మ తో చెప్పింది

ఓసి పిచ్చి పిల్ల .. దీనికి దిగులు పడుతున్నావా .. 

నీ మంచి కోసమే వాడు చెప్పిందినువ్వు అక్కడికి వెళ్ళాక ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నావుగా .. చెప్పింది విను . నేర్చుకో .. అంటూ ఆవిడ పాఠాలు

అమ్మ నాన్న సరే సరి . కూతురిని వెతుక్కుంటూ వచ్చిన అదృష్టానికి వాళ్ళకి కాలు నిలవడం లేదుకానీ కట్నం లేకుండా అన్ని విధాలా తమ కంటే ఎన్నో రెట్లు పై స్థాయిలో ఉండే అబ్బాయి అల్లుడుగా రావడం కూతురు పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నారు

ఉన్నంతలో ఘనంగా పెళ్లి జరిపించారు

మేం కట్నం అడగలేదు. కనీసం సారె అయినా ఘనంగా పంపిస్తారనుకున్నాం. మరీ ఇంత చవక బట్టలు పెట్టారని, స్వీట్లు , గిఫ్ట్ లు అన్నీ తక్కువ రకం వే పెట్టారని అతని తల్లి పెదవి విరిచినప్పుడు మీనాక్షమ్మే సర్థి చెప్పింది . పెళ్లిళ్లలో ఇటువంటివి మాములే అని

 మా స్థాయికి తగ్గట్టు లేదనిమేము తీసుకెళ్లి చేసుకునేవాళ్ళం అని చిన్నచూపు చూసే మాటలు మనసు చివుక్కు మనిపించినా అమెరికా వెళ్లే మోజులో తుడిచేసుకుంది కరుణ

కోట్ల రూపాయల కట్నంతో , అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల్ని కాదని తనని చేసుకున్నాడంటే తన అందమే కారణం. తనను  అందలం ఎక్కిస్తుంటే అందాన్ని చూసుకుని మురిసి పోయింది

మీనాక్షమ్మకి దూరపు బంధువు అని తప్ప అబ్బాయి గురించి, అతని కుటుంబం గురించి ఏమీ తెలుసుకోలేదుఅక్క పెళ్ళికి చాలా ఎంక్వయిరీ చేసారుమీనాక్షమ్మ మీద ఉన్న నమ్మకంతో అబ్బాయిని నమ్మారు

 పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజు ఫోటోలు పెట్టి రిజిస్ట్రార్ ఆఫీస్ లో పెళ్లి రిజిస్టర్ చేసుకున్నారు తరువాతి రోజు సర్టిఫికెట్ వచ్చేసింది వెంటనే కరుణ వీసాకి అప్లై చేసాడు కరణ్పెళ్ళికి ముందే డిపెండెంట్ వీసా వచ్చేసింది. ఇంటిల్లిపాది సంతోష పడిపోయారు . అప్పుడే కరుణ అమెరికా వెళ్ళి పోతున్నంత సంబరం ఇంట్లో

పెళ్లయిన వారం రోజుల్లోనే కరణ్ తో కరుణ అమెరికా ప్రయాణం

కళ్ళ నిండా నింపుకున్న కలలతో , మది నిండిన ఆశలతో కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టింది కరుణ.  

సంక్షేమ హాస్టల్ లో చదివి, ఇళ్లల్లో పని చేసుకునే నీకు ఎంత గొప్ప అవకాశం కల్పించాను చూడు అగ్రరాజ్యాన్ని. ప్రపంచమంతా కలలు కనే దేశంలో అడుగుపెట్టావ్ అన్న అతని మాటలు ఆమెలోని ఉద్వేగాన్ని చంపేసింది. ఉత్సాహం మీద భళ్ళున నీళ్లు చల్లేసింది.  

అతనితో ప్రయాణం ఆహ్లదకరంగా అనిపించలేదు. అనుక్షణం అతని ఆధిపత్యం, అహంకారం ఆమెను గుచ్చుతూనే ఉంది.  

అవుతున్న గాయాలపై ముథ వేసి కప్పెట్టి మొహంపై నవ్వు పులుముకోవడానికి ప్రయత్నం చేస్తున్నది.  

ఆమె సహజ స్వభావానికి విరుద్ధంగా మెలగడం చాలా కష్టమై పోతున్నది ఆమెకు.  

వచ్చిన మరుసటి రోజే కరణ్ ఫ్రెండ్స్ కొత్త జంటని భోజనానికి పిలిచారు.  

అక్కడ కరణ్ ప్రవర్తన ఆమె గాయాల్ని మరింత పెంచింది

కరుణ చదువు, ఆమె కుటుంబ జీవనాన్ని ఎగతాళి చేస్తూ చాలా తక్కువ చేసి మాట్లాడటం కరుణకు చాలా కోపం తెప్పించిందిబాధ పెట్టిందిఇక అక్కడ ఎవరితో కలవలేక పోయింది

అతను అన్నట్లు తాను ప్రభుత్వ హాస్టల్స్ లో ఉండే చదివింది. అది తప్పుకాదే. కష్టపడి చదివిందిఅమ్మానాన్నలకు భారం కాకుండా చదువుకుంది. అది నేరం కాదే. అతనిలాగే డొనేషన్ కట్టి చదవలేదు నిజమేఅమ్మానాన్నల కష్టం మీద ఆధారపడలేదు నిజమే. అందుకు నన్ను చిన్నచూపు చూడటం ఏంటి ? అని ఉక్రోషం వచ్చింది ఆమెకు

అంతా విన్న కరణ్ మిత్రుడు చాలా కష్టపడి పైకి వచ్చినందుకు కరుణని అభినందించాడు

తక్కువ స్థాయిలో అమ్మాయిని చేసుకున్నందుకు నన్ను అభినందించాల్సింది పోయి ఆమెను అభినందిస్తారే అని ఉడుక్కున్నాడు కరణ్

ఇంటికి వచ్చాక నీ అందం మీద వాడి కన్ను పడింది. నిన్ను తెగ వెనకేసుకొస్తున్నాడు అని కామెంట్

మనిషిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక  తికమకలో ఉంది కరుణ

రెండు రోజులు బయటినుండి తెచ్చుకున్న తిండితో సరిపోయింది. ఇక ఇంటి వంట మొదలు పెట్టమన్నాడు కరణ్

నాకు వంట చేయడం రాదు అని చెప్పినందుకు తినడం వచ్చా .. ఎగతాళి

ఏం తల్లి .. కనీసం వంట నేర్పలేదా .. అని ఆమె తల్లిని ఆడిపోసుకోవడం ఆమెను మరింత బాధించింది

నిజమే వంట చేయాల్సిన అవసరం రాలేదుఎప్పుడు, చదువు మీద ధ్యాస తప్ప వేరే ఆలోచన ఉండేది కాదుమీనాక్షమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా ఆవిడకి వంటమనిషి వచ్చి వంట చేసి పెట్టేది.   ఆవిడ వ్యక్తిగత సహాయకురాలిగా మాత్రమే కరుణ ఉండేది

పెళ్లి కుదిరాక ఉద్యోగం రిజైన్ చేస్తూ నెల ముందు నోటీసు ఇచ్చిందిఉద్యోగానికి వెళ్తూనే మిగిలిన సమయాన్ని, దృష్టిని కొత్త కోర్సులు చేయడం పైన పెట్టింది. తన ఊరికి వెళ్లలేదు. పెళ్లి కూడా హైదరాబాద్ కావడంతో  హైదరాబాద్ లోనే ఉన్నది.    

 అసలు వంట నేర్చుకోవాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదు. ఇప్పుడు వంట గోల ..   

మంచం మీద నుంచి నెమ్మదిగా లేవబోయిందితూలు వచ్చి పడబోయిందిఅట్లా మంచం పై అడ్డంగా ఒరిగింది

కిచెన్ లో చప్పుడు వినిపిస్తున్నదివెల్లుల్లి, ఇంగువలతో పప్పు తాలింపు వాసన ఘుమాయిస్తున్నది

అప్పటికే అతను రెండు మూడు సార్లు ఆమె గదిలోకి వచ్చి చూసి ఏదో ఒకటి విసుర్లు విసురుతూ వెళ్ళాడు.  

మళ్ళీ వచ్చాడు. ఆమె పడుకున్న భంగిమ మారిందికళ్ళు తెరిచే ఉందినెమ్మదిగా పిలిచాడు. చాలా సౌమ్యంగా పిలిచాడు.  

లేరా బంగారం, లే భోజనం చేద్దాం  అన్నాడు .  

నాకు ఆకలి లేదు నెమ్మదిగా జవాబిచ్చింది ఆమె .  

కాదు తినాల్సిందే .. రోజు సాయంత్రం మీ అక్క మాట్లాడుతుంది . అమ్మ మాట్లాడుతుందిచెప్పాడు . ఇంకా ఎదో చెప్పబోతున్నాడు

నాకు ఎవరితో మాట్లాడాలని లేదు. ఎవరితో మాట్లాడను దురుసుగా ఆమె 

నేను వంట చేశా. రా తిందాం

మాట్లాడలేదు ఆమె

ఇవాళ ఆఫీసుకు వెళ్లోద్దని అనుకున్నా .. కానీ వెళ్లాల్సిన పనిబడింది . భోజనం చేశాక వెళ్లి త్వరగా వచ్చేస్తా ..  వచ్చాక బయటికి వెళ్దాం .. అన్నాడతను

ఆమె లెగవలేదు. నిష్కల వస్తే మాట్లాడడానికి అడ్డు ఉండదని అనుకుంది. నేను తర్వాత తింటాను అని చెప్పింది

అతను తిని వెళ్ళిపోయాడు

నెమ్మదిగా లేచి నిష్కల వాళ్ళ రాకకోసం ఎదురు చూడడం మొదలు పెట్టింది కరుణ.  

మధ్యాహ్నం రెండున్నర సమయంలో కరుణకి ఇచ్చిన మాట ప్రకారం వచ్చింది నిష్కలవచ్చినప్పుడు తనతో పాటు అదే ఏరియా లో ఉండే స్నేహితురాలు సరస్వతిని కూడా వెంట తీసుకొచ్చింది.  

ప్రతిసారి తను లేకపోయినా సరస్వతి కొంత సహాయం చేయగలదని నిష్కల ఆలోచన

ఇంటి ముందు కారు కనిపించలేదుఅంటే అనుకున్నట్లుగానే కరుణ భర్త ఇంట్లో లేడు.  

ఇంకా నాలుగడుగులు వేయగానే మూసివున్న తలుపులుకిటికీ లోంచి నిష్కల కోసం ఎదురు చూస్తున్న కరుణతనకేసి వస్తున్న వాళ్ళని చూడగానే మొహం లో సన్నని వెలుగు రేఖామాత్రంగా మెరిసి మాయమైంది

ఆమె మొహం లో నిన్నటి దైన్యం లేదుతను ఇక్కడి నుండి  బయట పడగలను అని ధైర్యం కనిపిస్తున్నది.  

వచ్చేశారా .. ” అప్రయత్నంగా కరుణ నోట

* * * * *

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.