ఒక్కొక్క పువ్వేసి-1

స్మశానంలో కూడా చావని ఆంక్షలు

  –జూపాక సుభద్ర

ఈ మద్య ఒక సెలెబ్రిటీ భర్త చనిపోతే… భర్త శవయాత్రతో పాటు సాగింది నిప్పు కుండతో…. పాడెమోసింది, అంతిమ సంస్కారాలు నిర్వహించింది. దీనిమీద ఆమెను తిట్టిపోసిండ్రు హిందూకులాలు. ‘ఒక ఆడది పాడెమోయొచ్చా, శవయాత్రలో నడవొచ్చా, చితికి నిప్పు పెట్టొచ్చా’ హిందూ సనాతన విలువలు తుంగలో తొక్కిందనీ విమర్శల మీద విమర్శలు. ఆడవాల్లు అంతరిక్షంలోకి పోతున్న యీ కాలంలో యింకా యీ మగ ధిపత్యాలేంటి? మాదుక్కాలమీద యీ నియంత్రణలేంటి? ఎక్కడ ఏడ్వాలో, ఎట్లా ఏడ్వాలో, ఏ మేరకు ఏడ్వాలో మగవాళ్లు క్ష్కెత కాలమ్ ఆంక్షలు పెడ్తారనీ, మానవ సమాజంలో సగంగా వున్నాగానీ, యీ సగాలకు గౌరవ మర్యాదలు యివ్వడం లేదు ఒక మనిషిగా అని  సమూహాల మహిళలో ఆక్రోశిస్తున్నది న్యయామైనది. సామాజిక న్యాయమ్, జెండర్ న్యాయమ్.

ఎవరు యీ విలువలు తరతరాల్నించి కూర్చిందని చూస్తే… ఆదిపత్య కుల మగ సమాజమే  ఈ కౄరత్వాల్ని వారి మహిళల మీద మోపింది. భూములున్న, వనరులు చేతిలో వున్న, రాజ్యమ్ చేతిలో వున్న ఆధిపత్య కులపితృస్వామాయలే నేను చచ్చిపోతే నా చితి మీదే రాలి చావాలనీ, మల్లీ పెళ్లిచేస్కోవద్దనీ అనేక ఆంక్షలు, కట్టుబాట్లు శాసించింది. అట్లా తమ మహిళల్ని బతకనివ్వని కౄరత్వాలకు గురిచేసింది. యింటినుంచి బైటకు రావద్దు శవంయింట్లోన్నపుడే ఏడ్వాలి, శవయాత్రతలో రావొద్దు, స్మశానానికి పోగూడదు, పోతే చనిపోయిన మనిషికి ఆత్మకు సద్గతి వుండదు అనే నియంరతణలు కూడా చేసింది. ఆ విలువలే యిప్పటికి ఆధిపత్యకుల సమూహాల స్త్రీలను వెంటాడుతున్నాయి.

అన్నమయ్య కులహెచ్చు తగ్గుల మీద ’మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒక్కటే చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే’ నని బ్రాహ్మడికైనా, చండాలుడికైనా నివాసముండే భూమి ఒక్కటే… వేరు భూములు బ్రాహ్మడికి, చండాలుడికి లేనట్లే బ్రాహ్మణీలకు, చండాలీలక్కూడా భూమి ఒక్కటే… అట్లానే యీ అందరికి మరు బూమి కూడా ఒకటే కదాఔ! అట్లాంటప్పుడు చావులకు స్మశానాలకు కులం జెండర్ వివక్షలెందుకు?

అయితే జాతీయోద్యమకాలంలో జరిగిన సంస్కరణలు ప్రధానంగా సతి, పునరివవాహం, విధవ వివాహం, వంటి దురాచారాలు రూపుమాపడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిచినయి. వీటన్నింటితో పాటు విడాకుల చట్టం, ఆస్తిహక్క మొదలగు వాటితో హిందూకోడ్ బిల్లుకో రాజ్యాంగబద్దం చేయాలనుకున్న అంబేద్కర్ ని పార్లమెంట్ మలకు తరిమింది ఆదిపత్యకుల పితృస్వామ్యమే. యిదే యీ దేశాన్ని, సమాజాన్ని నడిపిస్తుంది శాసిస్తుంది తరాల్నించి.

మహిళల మీద శాసనాలు, ఆంక్షలు విదించడంలో బహుజన కుల మగస్వామ్యాలు లేవు. బహుజన కులాల్లోని మహిళలకు భర్త చనిపోతే అతనితో చనిపోవాలనే దురాచారలు లేవు. భర్త చనిపోతే మరో పెళ్లి చేసుకునే సంప్రదాయాలున్నాయి, విడాకులు తీసుకునే హక్కులున్నాయి. సమాజంలో మహిళలందరికీ సతి, వితంతు వివాహాలు లేనట్లు ప్రచారమ్ జరిగింది, యింకా అదే నిజమనే భ్రమల్ని సమాజమంతా పులమడం జరిగింది. కొద్ది మంది మహిళల లైన హిందూ సవర్ణమహిళల సతి లాంటి సమస్యల్ని దురాచారాల్ని దేశమ్ లున్న మహిళలందరిదిగా చూపించారు.

అట్లనే బహుజన కులాల్లో కుటుంబాల్లోని వాళ్లు, తెల్సినవాల్లు, వూరివాల్లు ఎవరు చనిపోయినా తలుపు తాళంవేసి శవయాత్రలో పాల్గొంటారు. స్మశానానికి పోకపోతే… తప్పుగా, కఠినులుగా చూస్తారు. స్మశానానికి బోయి చితి ఆరనించేదాక వుండివస్తారు మహిళలు.  కులాల్లో శవాన్ని పూడ్చే సంప్రదాయమెక్కువ గనక,  బొందలో మట్టేసి ఆకరి చూపు చూసుకొని వస్తారు మహిళలు. మనిషి చనిపోతే… ఆఖరి చూపుగా పోయి చూసిరావడము ఒక మానవీయ విలువ.  విలువల్ని ఆదిపత్య కుల పితృస్వామ్యాలు మహిళలకు లేకుండా చేసిన దుర్మార్గాలే మహిళలిన స్మశానానికి రానివ్వకపోవడమ్. సతిపేరుతో చావడానికైతే పోవచ్చుగానీ ఆఖరి చూపుగా స్మశానానికి మనుషుల శవాల్ని చూడడానికి పోనివ్వని పితృస్వామ్య శాసనాలు బద్దలు కొట్టాల్సిందే. కాకి చచ్చిపోతే… ఆడమగ కాకులు అన్నీ, గుంపుయినట్లు, బహుజనకులాల్లో కూడా మనిషి చచ్చిపోతే… ఆడమగ తేడా లేకుండా అందరు గుంపయితరు పీనుగెంట శవయాత్రలో నడిచి చూసొస్తరు, ఏడిసొస్తరు. పోవద్దు అనే కట్టడులు లేవు అంటే యింకా యీ కులాల్లో మానవీయాలు బతికే వున్న ఆదర్శాల్ని ఆధిపత్యము పితృస్వామ్యాలు తీసుకోవాల్సిన అవసరముంది.  ఆదిపత్యకుల పితృస్వామ్యాలతో ప్రభావితమైన బహుజన కులాల మగస్వామ్యం అంతిమ సంస్కారాల్లో నిప్పుబట్టే, నిప్పుబెట్టే హకుకను తమ మహిళలలకు లేకుండాచేసినా… చాలా చోట్ల దిక్కరణ జరుగుతునే వుండడాన్ని స్వాగతించాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.