సంక్షోభంలో సవాళ్ళు-డిజిటల్ యుగంలో అడుగులు

-సాయి వెంకట రాజు.బి

కన్నీళ్ళు పెట్టిన కళ్ళే తప్పా, కాంతులు సూన్యం అయిన బతుకులు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళా సంక్షోభం తప్ప, సంక్షేమం సరైన రీతిలో లేదు అని అన్నదే వాస్తవం.కరోనావైరస్ మహమ్మారి ప్రారంభం నాటినుంచి ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే. ఏడాది గడిచినప్పటికీ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడటం లేదు. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం 2020-21 దేశ జీడీపీపై తీవ్రంగా ప‌డింది. 2021 ఆర్థిక సంవ‌త్స‌రంలో దేశ జీడీపీ ఏకంగా 7.3 శాతం ప‌త‌న‌మైంది. ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రన జ‌న‌వ‌రి-మార్చి (నాలుగో త్రైమాసం)లో ఆర్థిక కార్య‌క‌లాపాలు కొంతమేర గాడిన‌ప‌డ‌టంతో జీడీపీ 1.3 శాతం పెరిగింద‌ని కేంద్ర గ‌ణాంక‌ కార్యాలయం (ఎన్ఎస్ఓ) వెల్లడించింది. నాలుగు దశాబ్దాల చరిత్రలో ఇదే కనిష్టం కావడం గమనార్హం. కాగా గతేడాది దేశ జీడీపీ 4.2 శాతానికే పరిమితమైంది.

ప్రపంచ ఆర్థిక పునరుజ్జీవంలో భారతదేశానికి ‘పరిమిత పాత్ర’ పోషించే అవకాశం ఈ కరోనా సంక్షోభం కల్పించిందని భారత పరిశీలకులు భావిస్తున్నారు. మరి ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్.. స్వయంగా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో తన సామర్థ్యానికి మించి ప్రభావం చూపగలదా?

కుదేలైన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవాలంటే మూడు ముఖ్యమైన విధానాలు:

ఒకటి – “దేశ ప్రజల జీవనోపాధికి రక్షణ కల్పించి, ప్రత్యక్ష నగదు సహాయం ద్వారా వారి కొనుగోలు శక్తిని మెరుగుపరచాలి”.

రెండు – వ్యాపారాలకు తగినంత మూలధనం అందుబాటులో ఉండేలా “ప్రభుత్వ పరపతి హామీ పథకాలను” రూపొందించాలి.

మూడు- “సంస్థాగత స్వయంప్రతిపత్తిని” కల్పించడం ద్వారా ఆర్థిక రంగాన్ని మెరుగుపరచాలి.

కరోన సంక్షోభం తో పాటు నూతన మార్గాలకు తెర దించింది అనే చెప్పాలి. ముఖ్యంగా డిజిటల్ యుగం వైపు కొత్త ఒరవడి సృష్టిచింది. సవాళ్లే సమాధానాలను తెచ్చిపెట్టాయి. సంక్షోభంలో సాంకేతిక మార్పులకు లోబడి డిజిటల్ చెల్లింపులు,ఉద్యోగాలు, విద్య, వైద్య అన్ని రంగాలు డిజిటల్ విధానాలకు కొత్త తలుపులు తెరిచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెను మార్పులకు నాంది పలికింది మన భారత్.

భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా లాక్ డౌన్‌లో ఉన్నప్పటికీ దేశంలోనే అది పెద్ద గ్రూప్ రిలియన్స్‌లోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. జియో మొబైల్ నెట్ వర్క్‌లో ఏకంగా రూ.87వేల కోట్ల రూపాయల వాటను విదేశీ సంస్థలు కొనుగోలు చేశాయి.ఈ పెట్టుబడుల ద్వారా రెండు విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి విదేశీ మదుపరులు భారత్‌ను తమ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన స్థానంగా చూస్తున్నారు. అలాగే కరోనావైరస్ తర్వాత డిజిటల్ ప్లాట్ ఫాం, సాంకేతికత రెండూ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తాయని వారు బలంగా నమ్ముతున్నారు.

మహమ్మారి తర్వాత ప్రపంచం డిజిటల్ వైపు మొగ్గు చూపేలా ఈ డేటా చూపిస్తుందని ఇండీడ్ ఇండియా పేర్కొంది.. టెక్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాల్లో పెరుగుదల.. మహమ్మారి ముందు, తర్వాత.. రెండు కాలాల్లో స్థిరంగా ఉందని చెప్పారు. షాపింగ్, రిమోట్ వర్కింగ్, లెర్నింగ్ అవసరాలను తీర్చడానికి సాంకేతిక పరిష్కారాలపై నిరంతరం ఆధారపడటం అనేది పరిశ్రమలు, నగరాల్లో టెక్ డెవలపర్ల ప్రాముఖ్యతను విస్తరించిందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆన్ లైన్ లో వ్యాపారాలు పెంచడం, పర్యావరణ వ్యవస్థలో వినియోగదారులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇతర సంస్థలను అనుసంధించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేయడం వైపు దృష్టి కేంద్రీకరించడం టెక్ జాబ్ అవసరాలు సూచిస్తుంది.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.