ప్రమద

పద్మా సచ్ దేవ్ 

-సి.వి. సురేష్

(ఇటీవల మరణించిన ప్రసిద్ధ డోగ్రీ కవయిత్రి పద్మా సచ్ దేవ్ మృతికి నివాళిగా ఈ నెల ప్రమదలో వారి గురించిన వివరాలు, వారి కవితకు అనువాదాన్ని అందజేస్తున్నాం-)  

2021  ఒక పీడ కల.  ఎందరో మహామహుల్ని కోల్పోయాము.  అలాంటి వారిలో  పద్మా సచ్ దేవ్ ఒకరు. ఈ నెల నాలుగో తేదీ ఆమె శివైక్యం చెందారు.  పద్మా సచ్ దేవ్ ప్రసిద్ధ డోగ్రీ కవయిత్రి,  నవలా రచయిత్రి.  డోగ్రీ భాష లో అద్భుతమైన కవిత్వాన్ని అందించిన ఆధునిక మహిళా రచయిత్రి పద్మా సచ్ దేవ్. డోగ్రీ భాష లోనే కాకుండా, హిందీ లో కూడా ఆమె తన కవితల్ని రాసారు. జమ్మూ లో పుమండాల్ అనే ప్రాంతం లో 1940 లో జన్మించారు.  ఈమె తండ్రి జయదేవ్  సంస్కృత పండితుడు. 1947 లో భారతదేశం విడిపోతున్న సంద్భరం లో ఆయన  చంపబడ్డాడు. పద్మా సచ్ దేవ్ తొలుత వేద్పాల్ దీప్  అనే కవిని పెళ్ళాడి, ఆ తర్వాత సురిందర్ సింగ్ అనే ఒక సింగర్ ను వివాహ మాడారు.  మీటా సచ్ దేవ్ వారి కుమార్తె. 

ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ గా పని చేస్తున్న సమయంలో పద్మా సచ్ దేవ్ రాసిన ‘మేరీ కవిత మేరే గీత్’ అనే anthology కి కెనడా సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.  పద్మా గారి కవితలు చదివాక, నా కలాన్ని విసిరేయాలని అనిపించింది, ఆమె రాసింది నిజమైన పోయెట్రీ అని రమదాన్ సింగ్ దినకర్ అనే ప్రముఖ కవి అన్నాడు. ఆమె సినిమా పాటలు కూడా రాసారు. ప్రేమ పర్బాట్ , ఆంకి దేఖి, సాహస్ అనే సినిమాలకు పాటలు రాసారు. 

ఈమెకు దిను భాయ్ పంత్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, కృతితవ సమగ్ర సమ్మాన్, సరస్వతి సమ్మాన్,  2001 లో పద్మశ్రీ అవార్డు , కబీర్ సమ్మాన్ అవార్డులు  కూడా వరించాయి.  అంతేగాక, soviet land nehru award, హిందీ అకాడమీ పురస్కార్, ఉత్తర ప్రదేశ్ హిందీ అకాడమీ పురస్కార్, రాజ రామ్మోహన్ రాయ్ పురస్కార్, జాషువా పోయెట్రీ అవార్డు, దీనితో పాటు, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వపు రోబ్ ఆఫ్ హానర్ కూడా లభించింది. 

కాలేజీలో చదివే రోజుల్లోనే డోగ్రీ భాష లో కవిత్వం రాసారు.  తన తండ్రి బాటలో, సంస్కృత శ్లోకాలు చదవడం , హిందీ కవితలు చదవడం చేసేవారు.  తన మొదటి కవితను విశేష జన సందోహం మధ్య , ముఖ్య మంత్రి సమక్షం లో చదివారు.  మరుసటి రోజు ఆ కవిత ఉర్దూ పత్రిక లో ప్రచురించారు. వేద్ పాల్ దీప్ అనే ప్రముఖ కవి  ఎడిట్ చేసి వేసారు.  ఆమె తన కంటే 12 సంవత్సరాలు సీనియర్ అయిన  వేద్ పాల్ దీప్ తో ప్రేమ లో పడింది. తన 16 సంవత్సరం లోనే, ఇంట్లో వాళ్ళు వద్దు అంటున్నా వేద్ ని వివాహం చేసుకున్నారు. 

పద్మా  14 సంవత్సరాల వయస్సులో రాసిన “రాజ డియాన్ మండియాన్” అనే కవితకు అద్భుతమైన అభివ్యక్తి తో రాసిన గొప్ప కవిత గా గుర్తింపు వచ్చింది.  ఒక వృద్ధురాలిని సింబాలిక్ గా తీసుకొని, అణిచి వేత కు గురి అవుతున్న పేదల గురించి రాసిన ఆ కవిత, ఆ తర్వాత ప్రతి anthology లో చోటు చేసుకుంది. 

సుదీర్ఘ వ్యాధి నుండి బయట పడి, జమ్మూ కు వచ్చి రేడియో లో స్టాఫ్ గా పని చేస్తున్న సమయంలో  భర్త నుంచి విడిపోయారు.  సాంప్రదాయ జమ్మూ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి  ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్ కు లెటర్ రాయడంతో ఆమె ఆ ఉద్యోగాన్ని కోల్పోయారు.  తర్వాత ఆమె ఢిల్లీలో  డోగ్రీ భాష లో రీడర్ గా చేరారు. అక్కడే ఆమె సురిందర్ సింగ్ ను వివాహ మాడారు.  ఆ తర్వాత అనేక కవితలు  రాసి, సాహితీ చరిత్ర లో తన స్థానాన్ని నిలుపుకున్నారు. 

భారత దేశ సాహితీ చరిత్ర లో పద్మా సచ్ దేవ్ చిరస్మరణీయురాలు. 

పద్మా సచ్ దేవ్ రాసిన Evening of london కు నా అనుసృజన ఇక్కడ ఇస్తున్నాను. 

 

లండన్ నగరపు సాయింత్రం 

అనుసృజన : సి.వి. సురేష్

“ఇది లండన్ నగరాన ఒక  సాయింత్రం. ఇది అలాంటిలాంటి  సాయంత్రం కాదు.  అది కేవలం ఆకాశంలో మెరిసే  నక్షత్రం కాదు! ఆ  సంధ్య వేళ ఈ నగరం లో  ఏ ఒక్కడూ లక్ష్యం లేకుండా రోడ్లపై తిరగాడడు.

ఆ సాయింత్రం  ఈ నగరానికి చేరుకొనే ముందు, అది శుభ్రంగా తల స్నానం చేసి, జుట్టును అందంగా తిప్పుకొని చేరుతుంది. తన ముంగురులనుండి జారిన నీటి చుక్కలు  ముత్యాలుగా మారి నల్లటి ఆ ఆకాశంలో పొదగబడేందుకేనేమో? ఇది  ఎలాంటి అద్భుత సాయంత్రం?

చీకటి, వెలుగుతో సమాగమించే ఆ లండన్ నగర  సాయంత్రం – ఏ ఒక్కరి వేదనా సాయింత్రం కాదు.  ఆ సాయింత్రం  ఏ ఆత్మకూడా పొడవాటి  వాంఛలతో కదిలినట్లనిపించదు. 

నిజానికి, ఆ సాయింత్రం అక్కడ చంద్రుడు ఉన్నాడు. కానీ,  ఆ చంద్రుడి లో, ముడతలు పడి, వణుకుతున్న చేతులతో ఆ ముసలి అవ్వ, ఆ వడికే చక్రం పై దారాన్ని పట్టుకోలేక పోతున్నట్లు ఉంది. 

ఆ చంద్రుడి చుట్టూ విరజిమ్మే కిరణాల పరిధి తగ్గుతోంది.  ఆ కిరణాలు  చిన్నగా అవుతున్నాయి.  రోజులు గడిచే కొద్దీ లండన్ సాయంత్రాన సమావేశమయ్యే సమయం  మానవజాతికి వింతగా అనిపిస్తోంది..

ఆ సాయంత్రం అలా నగరంపైకి వచ్చినప్పుడు, నదులు ప్రవహించడం ఆగి పోయి వెళ్లి పోతాయి, ఎందుకంటే, ఆ సాయంత్రపు అడుగుల శబ్దం వినడానికి.

ఆ సాయింత్రాన్ని నిజంగా చంద్రుడు చూసి ఉంటే, అసలు ఆకాశం పైకి వచ్చేవాడే కాదు.

ఆ స్వర్ణ వర్ణ సాయింత్రం,  పొడవాటి  చెట్ల వెనుక దాగి ఉండటంతో,  దాని ముఖారవిందం గడ్డకట్టింది. ఆ సూర్యుడి ఎరుపుతనాన్ని తాగి ఆ సాయింత్రపు మొఖం ఎర్రగా మారింది. 

కానీ చీకటి చెట్లతో కప్పబడిన కారణంగా,  ఆ సాయింత్రపు అందమైన ముఖం ఎవరికీ కనిపించదు”

original poem  :

Evening of london 

-Padma Sachdev 

What sort of an evening is this!  An Evening of London! Not a star on the sky! Not an aimless wandered on the road.

Doesn’t evening before coming here, wash her head and wring her hair. Don’t drops thus released turn into pearls to stud to the sky? What sort of an evening is this?

Evening of London. Was none of the melancholy of evening? No souls seems to be stirred with longing. At the time of the union of darkness with light.

The moon is there indeed. But the shriveled, trembling hands of the old woman, cannot hold the thread on the spinning wheel.

The circle of rays around it is shrinking, growing smaller. As the days pass the meeting time of London evening is becoming a stranger to humanity.

When the evening comes, rivers stop flowing and get lost. To hear the sound of evening’s footsteps.

If the moon had seen the evening it wouldn’t have risen.

But the golden face of the evening, hidden behind long tresses, had hardened. Had become redder. After drinking the redness of the sun.

But this beautiful face covered by the dark trees is not visible to anyone.

*****

 

Please follow and like us:

5 thoughts on “ప్రమద -పద్మా సచ్ దేవ్”

  1. పద్మసచ్ దేవ్ గురించిన పరిచయం చాలా బావుంది. ఇంగ్లీషులో ఉన్న మాటలకి చక్కటి తెలుగుపదాలు ఉపయోగించి చాలా బాగా రాశారు. అభినందనలు మీకు.

    1. ధన్యవాదాలు నాగలక్ష్మి గారు మీ ఆత్మీయ స్పందనకు

  2. కవయిత్రి గురించి చక్కని పరిచయం. మీ అనువాదం బాగుంది.
    లండన్ లో వేసవికాలం సాయంత్రం గుర్తుకు వచ్చింది. సాయంత్రం అయినట్టే తెలియదు‌.

    1. ధన్యవాదాలు సునీత గారు మీ ఆత్మీయ స్పందనకు

Leave a Reply

Your email address will not be published.