ఆలోచనాత్మక కథలల్లిన గొప్పరచయిత కారా మాస్టారు!

-కొండపల్లి నీహారిణి

తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియకు పెద్దపీట వేసి, గొప్ప కథలను రచించిన కాళీపట్నం రామారావు గారు 2021 – జూన్ – 4 తేదీన కన్నుమూశారు. వారికి అక్షరాంజలి ప్రకటిస్తున్నాను.

జీవితంలో సమస్యలను, సమస్యలకు కారణాలను తెలియజేసేదే మంచి కథఅన్నారు కారా.

ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఎట్లా మాస్టారో, సాహితీవేత్తలకు ముఖ్యంగా కథా రచయితలకు కారా మాస్టారుగా అట్లే ప్రసిద్ధి.

తొలికథప్లాటుసారమో‘ – చిత్రగుప్త కార్డు కథలు శీర్షికతో 1943లో ప్రచురితమైన కథ.

అదే దశలోపెంపకపు మమకారం‘, ‘అశిక్షఅవిద్యకథలు కుటుంబ సంబంధాల నేపథ్యంలో రాసారు. కాని తర్వాత దాదాపు ఒక దశాబ్దం మౌనంగానే ఉన్నా, సామాజికాంశాలపైన, మధ్యతరగతి నుంచి, పీడించే పై తరగతికి, పీడితులైన కింది తరగతికి మధ్య 1955 ప్రాంతం నుండి కారా గారి దృష్టికోణంలో మార్పు వచ్చింది.

దశలోనే యజ్ఞం, తీర్పు, జీవధార, చావు, కుట్ర, హింస, ఆర్తి వంటి కథలను రాస్తారు.

మొత్తం 60 కథలు వారివి అయితే,

1972-92 మధ్యకాలంలో రచనలు చేయలేదు గాని, 92లోసంకల్పంకథ రాసారు.

రచయితలకు ఒక ప్రాథమిక, ప్రాపంచిక దృక్పథం ఉండాలనే కారా గారు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారితో స్నేహం కలిగి ఉండేవారు.

కొడవటిగంటి కుటుంబరావు రచనలు ఆకట్టుకుంటాయని ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు రోజుల్లో . కొకు, రావి, రారా, కారా, చేరా వంటి రెండక్షరాలు కోట్ల మెదళ్ళను కదిలించాయన్నది సత్యం. ఇజాలకూ, కులాలకూ ప్రాధాన్యం ఇవ్వని గొప్ప రచయితలు వీరంతా.

దోపిడివర్గాలు పెట్రేగి పోయేందుకు రాజ్య వ్యవస్థ ఎట్లా, ఎంతగా తోడ్పడుతుందో, నయవంచనతో ప్రజాశక్తులను ఎట్లా నిర్వీర్యం చేస్తాయో కారా గారియజ్ఞంకథ చూపిస్తుంది. కథపై ఆనాడు ఎంతో చర్చ జరిగింది. బహుశ ఇంత చర్చ మరే ఇతర కథలపైనా జరగలేదేమో!

యువదీపావళి ప్రత్యేక సంచికలో వచ్చింది యజ్ఞం కథ.

తెలుగు కథలన్నీ సేకరించి కథానిలయంలో భద్రపరిచిన తెలుగు కథా మేరు శిఖరం కారా గారు. వీరియజ్ఞంకథ ఒక గొప్ప సంచలనం. అది సినిమాగానూ తీసారు. ఒరవడిలో ఎందరో కథారచన చేసారు. కారా గారు ఎందరికో మార్గదర్శకులు.

మూడేళ్ళ కిందట పుట్టి మూడు నెల్లుగా ముడివడి, మూడు రోజుల్నించి నలుగుతున్న తగవు. ఆవేళ యిటో అటో తేలిపోతుంది. భానం వూరి గాలిలో అలా అలా తేలుతోంది.”

మద్రాస్ నుండి కలకత్తాకువిశాఖపట్నం మీదుగా విజయనగరం కేంద్రంగా పోయే గ్రాండ్ ట్రంక్ రోడ్డు నుండి ఆరుమైళ్ళు కుడిగా సముద్రానికి ఐదు మైళ్ళకూ ఉందా గ్రామం.

ఊరి పరిసరాలన్నీ వర్ణిస్తారు. సుందరపాలెంపచ్చగా బతికే సనాధలా కనిపిస్తుంది. పంచాయితీ అంటే ఏంటో కూడా చెప్తూనే అప్పట్రాయుణ్ణి గురించే చెప్తారు. పంచాయితీలో హరిజన మెంబర్.

ఒక మాజీ షావుకారికి రెండువేలు (2 వేలు) బాకీపడి వడ్డీతో సహా 2500 అవుతుంది. గోపన్నకు చితికిపోయిన పెద్దమనిషి.

ఈనాటికి పేదతనం వాళ్ళను రచ్చకెక్కించింది.” ఇది అభిప్రాయం అక్కడ. ప్రెసిడెంట్ శ్రీరాములు నాయుడు టైమివ్వాలంటారు. గడువు దాటిపోతుంది. లక్షుంనాయుడుధర్మరాజు, అజాతశత్రువు సూర్యంగారూ వచ్చాడని ఊరంతా తెలిసి ఎన్నడు రానంతమంది వచ్చారు.

మహేశం, పాపయ్యలు ఊరూరా అన్ని కులాలవారు రావాల్సిందే పంచాయితీ సభ ప్రారంభమవుతుంది. ఇటువంటి లడాయిల్లో దేనికి ప్రాధాన్యతనివ్వాలో చెప్పాలి అంటూ నాయుడు మొదలుపెడ్తాడు.

ఆంధ్రభూమిలో నిర్వహించి మేటి కథకులను తయారు చేశారు కారా గారు.

మొదట్లో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాల కథలు రాసినా తర్వాత కథారచనకు ప్రయోజనమనేది ఉండాలని సమాజాన్ని అధ్యయనం చేస్తూ చేస్తూయజ్ఞంవంటి కథను రాసారు. సునిశితమైన పరిశీలనా శక్తి ఉన్నది కాబట్టే గొప్ప కథలు రాసారు. ప్రాపంచిక దృక్పథం అనేది ఉన్నది కాబట్టే, చావు, ఆర్తి, నోరూకు, భయం, జీవధార, హింస, శాంతి, వీరుడుమహావీరుడు, కుట్ర వంటి కథలు రాసారు.

మాలపేటల్లోని కష్టజీవుల నికృష్టమైన వ్యథలను తెలిపే కథ ఆర్తి, చావు వంటి కథలు. మనుషుల జీవితాలలో పేదరికం ఎట్లా మార్పులు తెస్తుంది. అనుబంధాలను ఎట్లా పడగొట్టేస్తుందీ చూపారు. సొమ్ముగా రూపం చెందే శ్రమను ఈ కథల్లో చూడొచ్చు.

ఇలాంటివే బంగారి, ఎర్రెమ్మ కథలు. దారిద్ర్యం వలన కుటుంబాలలో ఘర్షణలు ఎలా జరుగుతుంటాయో చూస్తాం. అటు కన్నవాళ్ళను ఇటు ఉన్నటువంటి అత్తవాళ్ళను కలపలేక అగాథంలో స్త్రీలు ఎలా పడిపోతారో రాసారు. ఉత్తరాంధ్ర మాండలికానికి పెద్దపీట వేసిన కారా గారి కథలు అట్టడుగు వర్గాల బడుగు జీవితాల్లోని జీవద్భాషని ప్రపంచానికి తెలియజేసారు.

కథ కంచికి కాదు కథ శ్రీకాకుళానికి అనేంతగా చేసారు కారా.

పరిశోధకులకు గొప్ప సోర్స్ కథానిలయం.

తెలుగు కథకు దిశానిర్దేశంత కథానిలయం స్థాపించిన మహోన్నత ఆశయ సాధకుడు కారా మాస్టారు. అణగారిన ప్రజల, బడుగు వర్గాల పట్ల నిబద్ధతతోనూ, నిజాయితీగా రచనలు చేసిన కారా గారు నిరాడంబర జీవి

కారా గారి కథలు కొన్ని విశ్లేషించుకుందాంఅర్థం కాని మానవ గాథ 1947లో రూపవాణి దీపావళి సంచికలో వచ్చింది.

నారాయణగారి తత్వం బ్రతికినన్నాళ్ళే కాకుండా చనిపోయాక కూడా ఆశ్చర్యకరాలే అయింది. గ్రామవాసులకు అని ప్రారంభించిన కథ శీర్షికను ప్రతిబింబిస్తూనే మొదలయ్యింది. ఏమై ఉంటుంది. అర్థంకాని తత్వం అని పాఠకుడు పరుగున చదవాల్సిందే. అట్లా ఎత్తుగడ సాగిన కథ ధనవంతుడుగా పేరుమోసిన వ్యక్తి అసలు జీవితమేముండి ఉంటుంది అని!

ఎక్కడినుంచో తరలివచ్చిన నారాయణ గారి భార్య ఒంటిమీద చాలా నగలు మెరిసిపోతూ ఉండడం వల్ల ఊరివాళ్ళకు ఉత్సుకత కూడా ఎక్కువౌతుంది. కథ ఇక్కడ ఆపేసి, ఎక్కడో వ్యాపారం చేసి, సంపాదించుకొని ఇక్కడికి వచ్చాడని చెప్తూ అతని భార్య జబ్బుతో బాధపడ్తున్నా హాస్పిటల్ కు తీసుకుపోడు కాబట్టి. పిసినారి అని అభిప్రాయం అని అందరిలో ఏర్పడుతుంది. ఇద్దరు కొడుకులు. కాని వాళ్ళని హైస్కూల్ చదువుతో మాన్పించి టైపు, షార్టుహ్యాండు నేర్పించగా స్టెనోగ్రాఫర్ గా కుదిరాడు పెద్దవాడు. అన్నతోపాటే తమ్ముడు. తల్లి తండ్రీ ఇద్దరూ చనిపోయాక కొడుకులిద్దరూ బీరువా తెరచి చూస్తూ 50 రూపాయలు ఉంటాయి. కర్మకాండకు వృథా చేయకండి, వీలునామా రాసి పెట్టాను. శ్రీరాములునాయుడు దగ్గరున్నది అని చీటి పెడతాడు. ఇలా చెప్పిన కథ పాఠకులలో నారాయణ పాత్ర మీద తప్పకుండా కోపమో, జాలో కలిగి తీరుతుంది. ఇప్పుడే రచయిత అసలు ఉద్దేశం తెలియజేయాలి.

కథ నడపడంలో కారా గారు తొలిరోజుల్లోనే ఎంత గొప్ప కథాశిల్పంతో నడిపారు కదా అనిపించకపోదు ఈ కథలు చదువుతుంటే. వీలునామాతో పాటున్న ఉత్తరం చదువుతాడు పెద్దకొడుకు. అతని తండ్రి అతన్ని ఎట్లా పెంచాడో చెప్తూ… “నేను వట్టి అదృష్టహీనుణ్ణి. ఎందుచేతంటే లక్షాధికారి కడుపున పుట్టాను. కాని, జ్ఞానమున్న మనిషైతే బాధలేకపోదు‘. లక్ష రూపాయలు ఉండడంతో గర్వం కలిగి అవి చేతిన పడగానే ! సక్రమమైన మార్గాలు నేర్పించలేదు తండ్రి. తల్లిదండ్రులు పోగానే స్వేచ్ఛ వచ్చింది. భార్య రెండోకాన్పు తర్వాత జబ్బుపడి అసహ్యంగా, ముసలిదానిలా అగుపించింది. సౌందర్య తృష్ణ బీరువాలోంచి ప్రవాహాన్ని తీసింది. లక్షను గుర్రప్పందాలతో తీర్చవచ్చనుకున్నా. అన్నీ పోయాయి. అవమానంతో బ్రతకలేక ఉన్న ఇల్లు అమ్ముకొని ఊరు వచ్చేముందు గిట్టు నగలు కొని అమ్మ మెళ్ళో వేసాను. ఇద్దరమూ బాగుచేయలేని జబ్బున పడ్డాము. అందుకే అమ్మను హాస్పిటల్ లో చేర్చలేదు. చనిపోయే ముందు మా తండ్రి చేసిన పొరపాటే చేయవద్దని మీ అంతట మీరు బ్రతికేలా చేసాను. డబ్బును సత్కార్యాలకు వినియోగించండిఅని రాస్తాడు ఉత్తరంలో నారాయణ చివరికొచ్చేసరికి

ఉత్తరం పెద్ద కొడుకు తప్ప ఎవ్వరూ చదవలేదు. నారాయణ గారితత్వం గ్రామీణులకు మాత్రం నాటికీ, నేటికీ ఊహలాగే మిగిలిపోయిందిఅని ముగించారీ కథను.

యవ్వనంలో అనుభవించిన భార్య సంతానం కన్న తర్వాత అందం తగ్గితే పురుషుడైన భర్త కొత్త అందాల్ని వెతుక్కోవటం చేత రోగగ్రస్తుడయ్యాడు. స్వార్జితం కాని విత్తం మనిషి పాలిట మహాభయంకరమైనది. అనే అంశాలు కథకు ఆయువుపట్టు. తాము పెరిగిన వాతావరణంలోని విషయాన్నే కథగా చెప్పినా అందులోని ఒక గొప్ప సందేశాన్నిచ్చారు కారా గారు.

సాహిత్యంలో సుఖం కనిపించాలి అనేవారికి కాళీపట్నం రామారావు గారి కథలు నచ్చవు.

తీవ్రమైన అశాంతిని కలిగించి నిద్రకు దూరం చేసే కథలు కారావి.

మనం జనంలో ఒకరిగా ఎలా సర్దుకుపోతూ బతుకుతున్నామో చెప్తాయి కథలు ఇక నిబ్బరంగా ఉండలేం.

కథల్లో దూకుడు ఉండదు. అంతా నిదానమే! కథ నిశ్చలంగా ఉంటుంది. పాఠకుడు అలజడి పడతాడు.

వాస్తవికంగా చిత్రిస్తారు పాత్రల్ని. కాబట్టి అవి సజీవ పాత్రల్లా ఉంటాయి. చుట్టూ సమాజం నుంచి వచ్చినవే!

ఆదివారం కథ 1968-జూన్-7 నాడు ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికలో వచ్చింది.

మొదటి ఆదివారం పనిలోకి రాకపోతే – ‘రాతిరి రెండో ఆట సినిమా కెళ్ళేను. ఉదయం తెలివి రాలేదు, మధ్యాహ్నం నిద్దరొచ్చిందిఅంటుంది పనిమనిషి. రెండో ఆదివారంఒంట్లో బాగా లేదంది‘. మూడో ఆదివారం అడిగితే ఆదివారాలు రానంది. “అదేంటి! లోకంలో ఎక్కడాలేని ఆచారం నువ్వు మొదలుబెట్టావ్అని సూరమ్మ అంటే అంకాలు.

మీ మొగాళ్ళు సంకటాలు లేకుండానే శలవు పెట్టి జీతాలు తీసుకోవడం లేదా? ” కాఫీ హోటళ్ళు, కొట్లూ కట్టెయ్యాలని గవర్నమెంటు రూలు పాస్టేసిందిపనోళ్ళకు ఒక రోజు శలవుండాలనే కదా?” అంటూ బారెడు చదివింది అంటారు రచయిత.

పనిమనిషి మానడంతో ఇంట్లో ఆడవాళ్ళు చర్చ చేసుకుంటారు. కథనంతా ఇంటి పెద్దకోడలు చెబుతున్నట్టుగా రాసేరు! ఎంత గమ్మత్తుగా ఉన్నదో! కథంతా ఆదివారాన్ని బేస్ చేసుకొని నడిపారు గాని అంతర్లీనంగా ప్రవహించిందంతా కలిమి లేమి మధ్య. కథకురాలి పాత్రతోకోడలుతో పనిమనిషిని పిలిచి రమ్మందామా వద్దా అన్న చర్చ వచ్చినప్పుడునేను మా అత్తగారి పార్లమెంట్ హౌస్లో ఆధారపడతగ్గ కంకర సభ్యురాలినిఅంచేత. నిర్ణయానికి వచ్చేముందు పరిష్కారాలను అడుగుతుంటారుఅని చెప్పించడం చదువుకున్న ఇళ్లల్లో భాష, విషయ ప్రస్తావనలు ఎట్లా తెలుస్తాయో సూచిస్తారు. ‘పార్లమెంట్అనగలిగేది ఇంతో అంతో చదువుకున్నవాళ్ళే కాబట్టి!

గతిలేక కాళ్ళు పట్టుకున్నామనుకుంటుందిఅని ఆడబిడ్డ అనగానేవశం తప్పినప్పుడు వసుదేవునంతటివాడే గాడిదకాళ్ళు పట్టుకున్నారటఅంటుంది. ఇంట్లో నలుగురం ఆడవాళ్ళం ఉన్నాం మనమే తలా పని చేసుకుందామని ఆ అమ్మాయి అనగానే వచ్చిన చర్చ కూడా చాలా సహజంగా మన ఇళ్ళలో జరిగినట్టే ఉంటుంది.

తనకు ఎంగిలెత్తడమంటే అసహ్యమనీ, చేతులు అరిగేలా ఊడ్చాలాఅని చిన్న కూతురు. “దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇరవై అయిదేళ్ళయిందన్నమాటే గాని, చిన్న సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. పైదేశాల్లో మిషన్లుంటాయి అనగానే తల్లి ఊరకొక మరో నిజాన్ని తెలుస్తుంది. “అక్కడ మగాళ్ళు కూడా ఆడవాళ్ళతో సమంగా వంటింటి చక్కబాట్లు చేస్తుంటారట. వెళ్ళి మీ అన్నయ్యకో, నాన్న గారికో కూడా మెడకీ, నడ్డికీ గుడ్డలేవో కట్టించి తీసుకురా . (ఏప్రిన్ కట్టుకుంటారు గదా దాన్ని ఇలా అన్నారు). అప్పుడు నువ్వనట్టు నలుగురు నాలుగు పనులు చక్కగా చేసుకోవచ్చుఅంటుంది. ఇది ఇప్పటికీ మన కళ్ళముందు కనిపించే సత్యం, దృశ్యం. చర్చల్లో ఇంటి కోడులుగా ఆమె తన అనుభవాల్ని, పరిస్థితుల్ని చెప్పుకుంటూనాకు ఒళ్ళు దాచుకోవడం ఏనాడూ అలవాటు లేదు కాని మా అత్తగారు నేనొక్కదాన్ని పనంతా చేసుకురావడాన్ని ఒప్పదు. “ఆడదాని యీసులేని చోట మగాడికుంటుంది. పెళ్ళాం మీద ప్రేమ ఒలకబోసే వారికంటే లేనట్టు కనిపించే వారి వల్లే కుటుంబాలు చీలుతాయి.” అనేది ఆవిడ సిద్ధాంతం అంటుంది. ఈ కథలో కథ చెప్పే పెద్ద కోడలు పేరు ఎక్కడా రాదు. సరే! ఎలాగో ఓలాగ పనిమనిషిని పోనివ్వకు అని ఆమె అనడంతో ఈ కథానాయకురాలు పనిమనిషి ఆంకాలుతో మాట్లాడుతుంది. సంభాషణ చూడాలిఅద్భుతం !

ఆమె జీతం 8 రూపాయలు. కానీ ఈమె 10 రూపాయల కొత్తనోటు ఇస్తుంది. అంకాలుకు. ఆంకాలు ఒప్పుకోదునాకు వద్దు మీ రెండు రూపాయలెక్కువ అంటుంది. పాత పనిమనిషి లెక్క లెక్క లెక్క చెప్పి పరవాలేదు ఉంచేసుకోమని అంటే కూడా అస్సలు వద్దంటుంది వెళ్ళిపోతూ మీరు చిల్లర ఉన్నప్పుడే ఇయ్యండమ్మా అని!

అప్పుడు పెద్దావిడ అత్తగారు బయటికి వచ్చి, ఆమెతో చాలా మాటలు మాట్లాడుతుంది. దేనికీ ఆంకాలు పెదవి విప్పదు. ఆదివారం నాడు సెలవు మాత్రం కావాలంటుంది. దానికి పెద్దావిడపది రూపాయలు తీసుకో, వారానికి ఒక రోజు సెలవు తీసుకో కాని ఆదివారం నాడు మానవద్దు. ఎందుకంటే మా ఇంటికి ఆదివారాలు చుట్టాలు, పక్కాలు వచ్చి పోతుంటారు. ఆనాడు నేను అంట్లు తోముతూ కూర్చుంటే నగుబాటుగా ఉంటుంది, నా పరువు నిలబెట్టుఅంటుంది.

సూడమ్మా యీ యమ్మమాటలు! దాసీముండన్నేనట, యీయమ్మ పరువు నిలబెట్టాలటఅని ఇక్కడ రచయిత ఇచ్చిన ముక్తాయింపు ఎంత గొప్పగా ఉన్నదో పరువేపాటిదో చూడనట్టు. అందుకే రెండు రూపాయలు ఎక్కువ ఇస్తామన్నది అన్నటుడ్లన్నది ధోరణి. ఆమె ఒప్పుకున్నట్టే వెళ్ళిపోగానే, అత్తగారు ఇంట్లోకి వస్తూదొంగ భడవ! దాని నైజబుద్ధి ఎలా బైట పెట్టుకున్నదో చూసేవా? నిన్నపుట్టేనా? ఇవేళ పుట్టేనా? నా కన్ను కప్పడానికి యింట్లోనూ లేని ఆదివారం శలవు మా ఇంట్లోయే దానికెందుకు కావలసి వచ్చిందో తెలుసా? వేళ ఆదివారం గురించి దెబ్బలాడేమని! అదేమిటో చూద్దామనే నేనూ ఆదివారం మీద అంత పట్టు పట్టేనుఅంటుంది. ఇలా కథ చాలా హాస్యస్ఫోరకంగానూ, ఆలోచనాత్మకంగానూ ఉంటుంది.

ఆర్తి కథ – 1969 ఆంధ్రజ్యోతిలో వచ్చింది.

ధనుర్మాసం, ఉదయం వేళ, మర్నాడే భోగి, నాలుగైదు పెద్దిళ్ళు తప్పితే వూర్లో సున్నాలక్కూడా కరువైనట్టుంది. వూరికీ, మాలపేటకీ మధ్య పచ్చని వ్యవసాయాలుండేవి. యేడు ఎండిపోయిన గుమ్మడి పాదొక్కడి కనబడుతోందిఅని ప్రారంభిస్తారీ కథను. పైడయ్య, ఎర్రెమ్మ, బంగారమ్మ, నారాయుడు వంటి పాత్రలుంటాయి. పెళ్ళైన జంట విడిపోయేలా ఉన్నట్టున్న సన్నివేశంతో కథలోకి వెళ్తాం. బంగారమ్మ అల్లుడి దగ్గరికొచ్చి బ్రతిమిలాడి బంగారమ్మఎల్లెలు! పత్తిత్త! శాపానాలెట్టాచ్చేవు! శాపనాలు! నీ శాపనాలకీ, నా శాపనాలకీ పట్టే వుంటే, యీ బూమ్మజ్జనం ఎప్పుడో బుగ్గయిపోదురు!” అంటుంది . ఎర్రెమ్మ గోలకు బంగారమ్మసూన్నారాయణమూర్తి సాచ్చిగానువు పురుగులుగారిపోతావుఅని తిట్టిన తిట్లకే శక్తి ఉంటుందా? ఇక అప్పుడు కథలోకి వెళ్తాము. చాలా సాధారణమైన, చెప్పాలంటే చదువు సంధ్యలు లేని పేద కుటుంబాల్లోనూ పెళ్ళిళ్ళయ్యాక, వియ్యం అందుకున్నాక ఎక్కడలేని అహంభావాన్ని బింకాన్నీ ఎట్లా ప్రదర్శిస్తారో ఈ కథలో చెప్తారు రచయిత.

భాష, సాంఘిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులు కథల్లో అన్ని స్పష్టంగా వస్తాయి. పూర్వపు గంజాం జిల్లా తెలుగు ప్రాంతం. అందుకే తెలుగు, ఒరియా కలగాపులగపుగా ఉంటాయి ఆచారాలు. వాళ్ళ పెళ్ళిళ్ళూ రివాజులు రాస్తూ ఒక సందర్భంలో తన కోడలు తన ఇష్టం అన్న బంగారి మాటలకు – “నా కూతుర్ని దీని కొడుకుతో మనవాడడానికంపినానా దీనింటి శాకిరికిచ్చినానా?” అని ఎదురడుగుతుంది ఎర్రెమ్మ. “చుట్టూ మహాసంద్రంలో ఉన్న నిశ్శబ్దంలో వూపిరాడుతున్నట్టు లేదుఅని వర్ణిస్తారు ఒక యువతి అప్పుడే పైటలేసిన యువతి ఫీలింగ్స్ ను రాస్తారు. సన్నెమ్మా, నీలి, అంకి, దాలిగోడనీలిమొగుడు, నీలిపైడయ్య పేరును గట్టిగా పిలుస్తుంది. ఊళ్ళోకి విబడుతుందా ఇలా చాలా చాలా సహజసిద్ధంగా పాత్రలుపాత్రలు పాత్రలుగా మన ముందు నిలుస్తాయి. జీవితం గురించి కదా కారా గారి కథలు. బ్రతుకు అంటేనే మనుషులు. నిత్య జీవితంలోని జీవన విధానాన్ని కథగా రాస్తారు. చాలా నేర్పు ఉండాలి ఇలాంటి కథలు రాయాలంటే!

ముందునుయ్యి, వెనుక గొయ్యనా పని ముందెర్జెగొయ్యా, యనక్కెల్లే నుయ్యా లాగుంది.” అంటూ ఆ ప్రాంత యాస స్పష్టంగా రాస్తారు రచయిత. “గొప్పవాళ్ళలో గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళూ, అతి గొప్పవాళ్ళూ అన్నట్టే పేదవాళ్ళలో కడు పేదలూ, నిరుపేదలూ ఉంటారు. అందులో ఎర్రెమ్మ కడుపేదది.” తేడాను బాగా చెప్తారు కారా గారు.

రచయిత తనంత తానుగా చెప్పేప్పుడు సాంఘిక జీవన స్థితిగతులు చెప్తారు. “ఎంగిలాకుల కోసం వీధికుక్కలు ఎందుకు చస్తాయో విస్తళ్ళలో భోజనం చేసిన వారికి అర్థం కాకపోవచ్చు. ఏడాదిపాటు పేగులు మాడితే యెవరికైన అందులో నీతి కనబడుతుంది. పైడయ్య పట్నంలో కలాపీ పనికిపోతాడు. మార్కెట్ యార్డ్ లో బస్తాలు మోసేపనిఅని రాస్తారు. “సిరిగల పండుగ, చీకటి రాత్రి వస్తుందంటారు పెద్దలు. ఇది సిరిలేని పండగకాబట్టే వెన్నెలరాత్రి తగలడిందటవంటి మాటలు కథకు సాంస్కృతిక నేపథ్యాన్ని సామాజిక పరిస్థితులను జోడింపచేస్తారు. జంటైనా విడిపోయేది ఇతర కుటుంబసభ్యుల వల్లనే అనేది చూపారు. కథలో భాష భావాన్ని ప్రోది చేస్తుంది.

కారా మాస్టారు తెలుగు కథకు ఒక పర్యాయపదంగా పెద్దలందరిచేత కొనియాడబడ్డారు. సరళమైన భాషలో కారాగారి కథలన్నీ సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. అధ్యయన శీలతతో ప్రజా సమూహాల సత్ సంబంధాలతో ఉండేవారు కాబట్టి వీరి కథలో సహజత్వం ఉట్టిపడుంది. అధ్యయనం నుండి అనుభవం వస్తుంది. మన చుట్టూ ఉండే సామాన్యుల జీవితాలను వీరు కథల్లో పాత్రలుగా చూపించారు. ప్రజల కష్టాలు, వారి సంఘర్షణలు ఎక్కువగా కనిపిస్తాయి. 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ద్వారా వచ్చిన ధనాన్ని కథానిలయంగా తీర్చిదిద్దారు. 1993 ఫిబ్రవరి 22 శ్రీకాకుళంలో స్థాపించారు. మధ్యతరగతి జీవితాలలోని ఒడిదుడుకులను కథావస్తువుగా మలిచిన తీరు ప్రశంసనీయం. ఉత్తరాంధ్ర మాండలికం, అక్కడి సంస్కృతిని ప్రతిబింబించిన కథలు చాలా రాసారు. పూలదండలో దారం కారా గారి కథల్లో మార్క్సిజం ఉంటుంది.

అశిక్ష అవిద్య కథ

1955లో భారతి పత్రికలో ప్రచురితమైన కథ ఎగువ తరగతి మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలోని జీవిత సందర్భం. శ్రీరామారావుది పెద్ద కుటుంబం. అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటారు. లెక్చరర్ గా చేస్తుంటాడు. తమ్మునికి పల్లెటూరి సంబంధం కట్నకానుకలతో కుదుర్చుకుంటారు, లాంఛనాలు అన్నీ మాట్లాడుకుంటారు. తమ్ముడు బి.. తప్పినా, వీరికి భూవసతి, పైకమూ ఉంటాయి. కాబట్టి పెళ్ళికి అడ్డూ లేదు. ఆర్భాటంగా పెళ్ళి జరుగుతూ ఉంటుంది. భోజన బాజనాదులు గొప్పగా జరుగుతాయి. రామారావు భార్యశ్రీదేవి తమ్మునికీ అన్నకూ అనేక విషయాల్లో తేడా ఉంటుంది. శ్రీదేవి నగపోయిందని పెళ్ళిలో గుంభనంగా ఉన్నా, ఆడపడుచు విశాలాక్షి పైన అనుమానం పెంచుకుంటుంది. కారణం ఆమె ఆస్తిపరురాలే ఒకప్పుడు కాని భర్త తాగుడు, జూదం వంటి వ్యసనాల వల్ల ఆస్తి పోతుంది. ఇదీ శ్రీదేవి అనుమానానికి కారణం. పెళ్ళికి విశాలాక్షి భర్త రాకపోవడం రాత్రివేళ పెరట్లో తచ్చాడటం వంటివన్నీ అనుమానాన్ని పెంచాయి.

శ్రీదేవి జీవితం పాడయ్యిందనే అక్కసుతో మనసును శరీరాన్ని పాడు చేసుకుంటున్న లక్షణాలు ఆమెలో లీలగా కనిపిస్తున్నది. తన పెళ్ళయిన ఆరు ఏళ్ళయినా భర్తతో తప్ప ఎవ్వరితోనూ సన్నిహిత బంధువుగా చేసుకోలేక పోయింది. ఈ పల్లెటూరి వారికి సరిపడని దాననుకుంటుంది.

అది చిలికి చిలికి గాలివాన అయి విశాలాక్షి మరణానికి కారణమవుతుంది. తర్వాత శ్రీరామారావు తల ఎత్తుకోలేకపోయాడు. “లోకం వాళ్ళ దోషాలన్నింటినీ ద్విగుణీకరించి, త్రిగుణీకరించి మళ్ళా మళ్ళా చెప్పుకున్నదిఅంటారు కారా గారు!

మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలే ఎక్కువ తారసపడుతుంటాయి అని చూపారీ కథలో!

ఎవరికీ చెప్పొద్దని పెళ్ళి ఇంట్లో రభస చెయ్యొద్దని చెప్పిన భర్త మాటను పెడచెవిన బెట్టి శ్రీదేవి పోయిన తన నగ కోసం ఆలోచిస్తుందే తప్ప, ఆమె ఆడపడుచు మీద అనుమానం వచ్చినా ఆమె పరువుపోతే తన పరువు కూడా పోతుంది అని వివేచన లేకుండా పెళ్ళింట్లోనే గొడవ చేయడం ఆర్థిక సంబంధాలే ముఖ్యమైనవని తెలియజేస్తుంది. ఇందులో స్త్రీలలో అంతర్లీనంగా ఉండే ద్వేషం (శ్రీదేవి), అసూయ, పెత్తనం చేసే స్వభావం (తల్లి) వంటివి చెప్తూనే, భర్త వల్ల కలిగే బాధలు (విశాలాక్షి) వంటి పాత్రలతో చూపించారు

అత్యంత అల్పమైన విషయాలకు అనల్పమైన ప్రాధాన్యతను ఇచ్చే మానవ నైజాన్ని బయట పెట్టారీ కథ ద్వారా. తల్లి తన వయసురీత్యానైనా కోడలికి నచ్చచెప్పకపోవడమే కాక ఆమె తన బిడ్డ మీద అపవాదు మోపిందన్న కోపంతో కొట్టడం శ్రీదేవి అనుమానానికి అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. కథ మొదలు పెట్టామంటే పూర్తయ్యేదాక ఆపనీయని కథా కథనశైలి కారా గారి రచనాశైలి. కథ గానీ, పాత్రలు గాని మనం ఎక్కడో చూసామో అనిపించేలా ఉంటాయి.

అదృశ్యము

ఇరవై మూడేళ్ళ ఆరోగ్యవంతుడైన యువకుడు, నవమన్మధుడు కాక పోయినా చాలామందికి తీసిపోడు. ఇంటర్ పాస్ చేశాడు. గవర్నమెంటు ఆఫీసులో యాభై రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాడు. కుర్రవాడు మంచివాడే అని చెప్పుకుంటారు.

సంబంధం అన్ని విధాలా అందరికీ నచ్చింది. అటువంటి సంబంధాన్ని పెళ్ళికూతురు తోసి పారేస్తోంది.

 పెళ్లి కూతురు పేరు లలిత. పదిహేనవ యేడు నడుస్తోంది. రూపసేకాని రూపమే వర్త్ గా తీసుకుంటే బాబూరావుని తృణీకరించగలిగే అంత రూపసి కాదు. చదువు పల్లెటూరిలో అయిదవ తరగతి మాత్రమే చదువుకుంది.

అయినా యేమి చూసుకునో పెళ్లికూతురు యీ సంబంధాన్ని త్రోసి పారేస్తోంది. యెందరు యెన్ని విధాలు చెప్పినా, ‘పోనీ కారణం చెప్పుఅన్నా లలిత మాటాడదు.

ఆమె కారణాన్ని వెల్లడించక పోవడం వల్ల మూర్ఖురాలు అనిపించుకుంది. అంటూ ప్రారంభమైన కథ సగటు జీవుల ఆలోచనలను ప్రస్ఫుటిస్తుంది. ఆడపిల్లలూ ఆలోచనత్మాక నిర్ణయాలు ఆనాడే తీసుకునేవారు అనేది తెల్పుతుంది.

లలిత పెద్ద బావగారికి విశాఖపట్నం ట్రాన్సుఫరు అయిన దగ్గర నుంచీ ప్రయాణమవుతుండెను. యింకేవూరూ చూచి యెరుగని లలితకువిన్న దానిని పట్టి విశాఖపట్నం యందు చాలా గొప్ప అభిప్రాయం వుండెను. రోజులు కులాసాగా గడుస్తాయని నమ్మకం.

అక్క లలితను తనతో విశాఖపట్నం తీసుకవచ్చింది.

తీరా వచ్చాక లలితకు అక్కడ జీవితం దుర్భరంగా తోచింది. పెరుగుకు బదులు మజ్జిగ కలిపిన నీళ్ళూ, ఆవు నేతికి బదులు ఆముదం వాసన వేసే నేయి, వుప్పుడు బియ్యం, మందు కలిపిన కొళాయి నీళ్ళూ రుచి చూడవలసి వచ్చేసరికి లలిత కళ్ళు తెరిచింది. ముఖ్యంగా పొద్దు గడవడం ఒకటి లలితకు బ్రహ్మాండంగా వుంది. వచ్చిన మర్నాడు విశాఖపట్నం చూపించమని బావను అడిగింది. బావ కొంతసేపు వేళాకోళం ఆడి చూడ్డానికి ఏమీ లేదని చెప్పాడు. పోనీ బజారు చూపించమంది. పట్టుకెళ్ళాడు. రెండు లారీలూ, ఒక మిలటరీ వాడూ లలితను ఢీకొన్నంత పని అయేసరికి లలిత చీత్కారం చేసింది. మర్నాడు బీచ్ కి తీసుకెళ్ళమంది. “శీతాకాలం బీచేమిటి, ఎవరైనా నవ్వుతారు. అదిగాక కూర్చోడానికైనా స్థలం లేదు. సముద్రం రోడ్డును సగం కోసి పారేసిందిఅన్నాడు. “అక్కడ కూర్చోవద్దు, ఒక్కసారి చూసి వచ్చేద్దాంపద అంది. వెళ్లారు. బావ ఏమీ అబద్ధం ఆడలేదనుకుంది లలిత. చలిగాలి అక్కడ వుందనిచ్చింది. కాదు. యింటికి వచ్చేశారు. అంతలో విశాఖపట్నంలో లలితకు చూడవలసినవి అయిపోయాయి. యింక యింట్లో తోచక బయటపడేసిన చేపలా కొట్టు కోవడం ఆరంభించింది. యిల్లు పెద్దదే. యింట్లో వీళ్ళదికాక యింకా నాలుగు కుటుంబాలున్నాయ్. కాని లలిత యీడు ఆడపిల్లలు ఒకరూ లేరు. పదేళ్ళకు పైన ముప్పైకి లోపు వయసు వాళ్ళు అక్క తప్పిస్తే అనూరాధ యింకొక్కర్తి వుంది. అనూరాధకు పాతిక సంవత్సరాలు పైబడ్డాయి. చాలా వుత్సాహంగా వుంటుంది. లలితతో సమంగా నవ్వి ఆడగలదు.

వయసులో పెద్దదయి కూడా కులాసాగా చిన్నపిల్లలా పేలుతూ వుంటే లలితకు ఆశ్చర్యమయింది. “ఈవిడ యెవరే?” అంది అక్కతో, అక్క చెప్పిన జవాబు విని నిచ్చరపోయింది లలిత. అనూరాధ బి.. చదివిందట. కొన్ని వందల రైల్వే సారస్వత గ్రంథాలు చదివిన లలితకు బి.. అంటే సుమారు అయిన అభిప్రాయమే వుంది. “బి..నా!” అంటూ యించుమించులో నిశ్చేష్ట అయింది. తేరుకొన్నాక వందన్నర ప్రశ్నలు వేసింది. అక్క చాలావాటికి సమాధానాలు తెలియవంది.

బి.. చదివిన ఆడది తమ పొరుగింటి వాటాలో వుండటం. తక్కిన ఆడవాళ్ళలాగే యింట్లో పనులు చేయటం, వంట వండటం, గదులు పూడ్చటం, అవసరమైనపుడు అంట్లు కూడా తోమటం!, భర్తను గౌరవించడం, అభిమానించటం!!!

యీ కథంతా లలిత పాలిట యెంత ఆశ్చర్యజనకంగా వున్నా ప్రత్యక్షాన్ని నమ్మక విధిలేక నమ్మింది. వాళ్ళ అక్క అనూరాధకూ తనకు పరిచయం చేసింది. పరిచయం మూడు రోజుల్లో ఏకవచన ప్రయోగానికి తావు కలిగించగలంత స్నేహమయి పోయింది. లలితకు అనూరాధ యందు చాలా గొప్ప అభిప్రాయం యేర్పడింది.

సహజంగా ఇటువంటి స్నేహమెంతో కాలం సాగదు. కొంతమంది చిన్న విషయానికైనా చప్పున కరిగిపోతారుకరిగి పక్కనున్న వారితో అతుక్కుపోతారు. మళ్ళా చప్పున కరిగే స్వభాగం వల్లే యే మాత్రం కాస్త కాస్త హీట్ తగిలినా మళ్ళా కలియరానట్టుగా విడిపోతారు. వీరి స్నేహం కూడా యీ విధంగానే పరిణమించింది. అంటూ ఇందుకు గల కారణానికి కథలో చక్కగా ఇమిడ్చారు.

ఇది 50 దశకంలోని సాంఘిక పరిస్థితులను అద్దం పట్టే కథ. కథా నాయకురాలు లలిత. ఆమెకు పెళ్ళి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంటివాళ్ళకు బాగా నచ్చిన సంబంధం లలితకు నచ్చదు. అందరికీ ఆశ్చర్యం ఎందుకు వద్దన్నదని. అయిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నా వ్యక్తుల్ని అంచనా వేసే శక్తి బాగా ఉన్న పడుచు. అందుకే ఇంటర్ పాసై, గవర్నమెంట్ ఆఫీస్ లో 50 రూపాయల జీతం తెచ్చుకుంటున్న బాబూరావుని వద్దన్నది. “లలిత రూపనే కాని రూపమే వర్త్ గా తీసుకునే బాబూరావుని తృణీకరించగలిగే అంత రూపసి కాదుఅంటారు రచయిత. మరి ఎందుకు కాదన్నది? ఇక్కడే గొప్ప ట్విస్ట్ను చూస్తారు.

వైజాగ్ లో ఉన్న అక్క తనతో తీసుకెళ్ళి సంబంధం చూస్తుంది. వాళ్ళ ఎదురింటి వాటాలోని అనురాధతో పరిచయమౌతుంది. ఆమె బి.. చదివింది. అయినా ఇంట్లో పనులన్నీ చేస్తుంది. భర్తను గౌరవిస్తుంది. బి.. చదవాలంటే తండ్రి కనీసం లక్షాధికారి అయి ఉండాలనీ అలాంటి వారిని పెళ్ళాడే వాడు లండన్ రిటర్న్ డో, జమీందారో, కోటీశ్వరుడో అయి వుండాలి. అనుకున్న లలిత ఆశ్చర్య పడిపోతుంది. లవ్ మ్యారేజి యేమో అనుకుంది. కాదని తెలిసింది. ఆమెకు లలితకు వయస్సులో తేడా వున్నా ఏకవచన ప్రయోగం చేసేంత దగ్గరయ్యారు. ఇలా కథ ఇంతవరకే అయితే ఇంకేముంటుంది!

ఒకసారి అనూరాధా త్రుళ్ళిపడేటట్టు చేద్దామని మధ్యాహ్నం ఒంటిగంటకు ఆమె ఇంట్లోకెళ్తుంది. కిటికీ దగ్గర నిలుచుని ఎదురింటి అబ్బాయికి యేవేవో సంజ్ఞలు చేస్తున్నది. లలిత అనురాధను చూసి తత్తరపడింది. ఏమి చూడనట్లే ఉండి కాసేపటికి వెళ్ళిపోయింది. కాని మనసాగక మళ్ళీ వెళ్తుంది. అనురాధ చలం మ్యూజింగు చదువుతుంది లలిత ఆమెను సైగల అంతర్యం ప్రశ్నిస్తుంది. ఊరిగే సరదాగా అలా సైగలతో మాటాడుకుందామంటే లలితకి నచ్చదు

శరీరాలు దూరంగా ఉన్నంత మాత్రాన పవిత్రులవుతారా? అని నిలదీస్తుంది.

ఏం నువ్వు చేయడం లేదా మానసిక వ్యభిచారం. కథల్లో యువకుల విషయాన్నో పెళ్ళిచూపులకని వచ్చిన పెళ్ళికొడుకుల విషయంలో అది డెసిమెల్స్ తో సహా అందరూ మానసికంగా ఆయనే చరించినవారే ఉంటారని అంటుంది. అనురాధ వరస నచ్చదు లలితకు. లలితకు వద్దన్న సంబంధం ఇదే! అదే అబ్బాయి!! బాబూరావే!!!

కథలో చలం మ్యూజింగ్ ప్రస్తావనా, లలిత అబ్బాయిని నిరాకరించడమూ ఏదో తెలియని సంధి కాలాన్ని ప్రత్యక్షపరిచినట్లు అనిపించకమానదు. అందుకేనేమో తనకు అదృశ్యము అని పేరు పెట్టారు.

కథలో కారా గారు మనుషుల మానసిక స్థితిని చూపుతూనే అంతర్మథనంలో పడేస్తాడు. ఇంట్లో ఎవ్వరికీ అర్థం కాదు లలిత బావ తెచ్చిన అంత మంచి సంబంధాన్ని ఎందుకు వద్దన్నదో! గుణశీలానికి ప్రాధాన్యత యిచ్చే భారతనారి లలితఅంటూ ముగింపునిస్తారు.

పవిత్రత అనేది మనస్సులకూ ఉండాలన్నది చెప్పడం కథ ఉద్దేశ్యం. వైజాగ్ ఎలా జీవితాన్ని చూపిస్తూ స్త్రీ అస్తిత్వాన్ని కథాత్మకంగా చెప్పారు.

అన్నెమ్మ నాయురాలు

అన్నమ్మ నాయురాల్ని, మొట్టమొదటి సారి. నేను బడిఈడు పిల్లవాడిగా వున్నప్పుడు చూసేను. అంటూ మొదలైన ఈ కథ బడి నుండి వస్తున్న పిల్లవాడి మనోఫలకంపై చెరగని ముద్ర ఎలా వేసిందో చెప్తుంది. “ తరువాత పాతిక ముప్పయి ఏళ్లకుగాని ఆవిడ్ని దగ్గరగా చూడ్డం పడలేదు.” క్రమంలోనే అన్నెమ్మ నాయురాలి గతం కొంత తెలిసింది. “ఆమె నలుగురు తోడికోడళ్ల మధ్య యింటి పెద్ద కోడలుట, అత్తింటి వారికన్నా పుట్టింటివారు సంపన్నులుట. పదమూడో ఏట మేనత్త ఇంట పెద్దకోడలిగా పాదం పెట్టింది. కాపురానికొచ్చిన మొదటి ఇరవై ఏళ్లూ ఏమి సుఖపడిందో సుఖపడింది. తర్వాత అత్తింటి కుటుంబంతోపాటూ ఆమె కష్టాలూ ఆరంభమయినాయి.” అంటూ ఆమె వ్యక్తిత్వంతో బాటు ఆమెకు వచ్చిన బాధలు చర్చించుకునే యువకుడు. వాళ్ళ కుటుంబంలో కలిగిన అనేక మార్పులను చెప్తూరెండూళ్ల వాళ్లు కర్రలు, కత్తులు, బరిసెలు, బల్లెలు సిద్ధం చేసుకున్నారు. అక్కడ విదేళ్ళు సాగిన మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి ఇక్కడ మారుమూల రెండూళ్ల మధ్య కొట్లాట ఐదు గంటల్లో ముగిసింది.

అన్నెమ్మనాయురాలి ఇంట్లో మగవాళ్ళంతా చనిపోయారు. ఒక్క కొడుకు మినహా. తర్వాత నడిచిన క్రిమినల్ కేసులో ఏడుగురితోపాటు అతనికి జీవితఖైదు పడింది. ఆ దొమ్మీలోఅన్నెమ్మనాయురాలు తక్కిన తోడికోడళ్ల పుట్టింటోళ్లు చాలా డబ్బు ఖర్చుచేసి తక్కువ శిక్షలతో బయటపడ్డారు. అంటూ ఆమె తనవారి కోసం నిలిచి కొట్లాడిన విధానాన్ని చెప్తూ అంత పెద్ద కుటుంబానికి జైల్లో ఉన్న కొడుకు అతని భార్య పదేళ్ల మనవడు మాత్రం అన్నెమ్మకు మిగిలారు. అవతలిపక్షం అంగబలంతోపాటు అర్థబలం కూడా నశించగా క్రమక్రమంగా వలసలు పోయారట.

అచంచలమైన ఆత్మవిశ్వాసంతో, పట్టుదలతో, కృషితో మగవాడికీ తీసిపోని కార్యదీక్షతతో, మాటనేర్చుతో, సూటి వ్యవహారంతో తను చెమటోడ్చి కోడలికి మనవడికి శ్రమపట్ల గౌరవం పెంచి చిరిగిన సంసారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా లేవనెత్తింది. అన్నమ్మనాయురాలు, వూరివారిదే గాక చుట్టుపక్కల పూళ్ల వారందరి మన్నన పొందింది. సౌశీల్యానికి అన్నెమ్మది పెట్టింది పేరని ఒక్క చూపుతో దుష్టులను దూరంగా వుంచడం, మరో చల్లని చూపుతో మంచివారిని ఆత్మీయులను చేసుకోవడం ఆమె ప్రత్యేకతలు అంటారు. తెలిసినవారు.

ఆమె ప్రతి శనివారం మావూరి జగన్నాధ స్వామి దేవాలయానికి అర్చనకు వచ్చేది. అంటూ ఎన్ని అవరోధాలు కలిగినా జీవితాన్ని సరైన పద్ధతిలో మలుచుకోవడంతో స్త్రీలు ఇళ్ళల్లో ఎంత, ఎన్ని ప్రయత్నాలు చేస్తారో కథనంలో నడిపారు.

నెహ్రూ హయాంలో గ్రామీణ జీవితంలో క్రమక్రమంగా చాల మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రదేశం ఉతర కోస్తా, ప్రాంతాల్లో కూడా మార్పులు స్పష్టం కాసాగాయి. కథ చెప్తున్న వ్యక్తి రచయితనే అని అనిపించేలా అల్లిన తీరు చదివించేదిగా ఉంటుంది. ఒక కథ రాస్తున్నాం అంటే ఆనాటి కాలాన్ని ప్రతిబింబించాలి, సమాజం ఏం కోరుకుంటున్నది, ఫలితాలు ఏవీ చెప్పాలి. కారా గారు ఇందులో దిట్ట.

జనంలోంచి అప్రసన్నపు ముఖంతో కోకచెంగు భుజాన కప్పుకుంటూ వినవినగా ముందుకు కదుల్తోంది అన్నెమ్మనాయురాలు. ఆవిడిది ఒక్కసారి చూస్తే మరపురాని మూర్తి. నేనూ వాసిలి దారిచ్చేను. మా అమ్మ కుశల ప్రశ్నలకి జవాబులిస్తూ వీధి వరండాలో జనాల మాటలు వింటూవుంటే కొన్ని అర్థమయ్యేయి. కొన్ని అర్థం కాలేదు

నెహ్రూ ప్రభుత్వం దేశ ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు చేపట్టింది. రెండు ప్రణాళికలు అమలయ్యిన తర్వాతి రోజులవి. సామాన్య ప్రజానీకానికి ప్రభుత్వ సౌకర్యం మృత్తికా క్రమక్షయం జరక్కుండా (వర్షాలకి, వరదలకి, భూసారం కొట్టుకుపోకుండా) గట్టు ఎతించడానికి లోన్లులాంటివి పులగం మీద పప్పులా తరగతికే అందేవి.

రెవిన్యూ ఉద్యోగులు తమ సంతృప్తికి ఇచ్చే తాంబులాల ఖర్చులు అప్పు తీసుకునేవారి సంఖ్య పెరిగిన కొద్దీ పర్సెంటేజీలగా రూపాంతరం చెందింది. తాంబూలం ఖర్చు పర్సెంటేజీలుగా మారినా అభ్యంతరం ని ఉండేది కాదు. ఆ పర్సంటేజీల మొత్తం పెరిగితే దానివలన తో రైతులు నష్ట పోకుండా ఉద్యోగులే వాళ్ళకి దారులు సూచించేవారు. బండీ బక్కల లోను తీసుకున్నవాడికివాడికంతకుముందే లోను వున్నా లేనట్టు ధృవీకరించడానికి ఒక వేళ గ్రామోద్యోగులకు అభ్యంతరాలున్నా రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు, తాసిల్దార్లకు అభ్యంతరం ఉండేది కాదు. నూతుల్నే నాలుగు రాళ్లతో చుట్టూ గోడ కట్టించడానికిగాని, అసలు నూతులు తవ్వకపోయినా తవ్వినటుగా ధృవీకరించడానికి గాని అభ్యంతరాలుండేవిగావు. అలాగే జరగని అభివృద్ధి కంతటినీ జరిగినట్టు భావిస్తూ రైతులకు అప్పులమీద అప్పులు అందే బినామీ అప్పులు ఏర్పాట్లు జరిగిపోతుండేవి. వ్యవసాయదారుల పరిస్థితి అద్దంలో చూపారు. అన్నెమ్మ నాయురాలు వాళ్ళు అహర్నిశలు కష్టపడి పంటలు పండించేవారు.

అన్నెమ్మనాయురాలు, తరం రైతులుఅప్పన్నా నిప్పున్నా శత్రువుతో సమానంగా చూసేవారు. ‘మిక్సడ్!ఎకానమీపేరుతో వచ్చిన మార్పులను చెప్తూనే వాణిజ్య పంటలను వేయలేదు. అయితే ఆమె మునిమనుమడు ఎదురుతిరిగి ఈ పంటలనేస్తే అతని ధాటికి నిలువలేకపోయింది అని కథను ప్రపంచీకరణ ప్రమాదాలు క్రమంగా ఎట్లా వచ్చిపడ్డాయో అద్భుతంగా నడిపారు కారా గారు. ప్రమాదాన్ని గ్రహించే జాగ్రత్త పడిందో, జీవ లక్షణమైన అపాయశంక, ఆ రైతుబిడ్డను కాపాడిందోఆదినుండి పంటలకు తాను దూరంగానే వుంటూ వచ్చింది.

మానసిక చిత్రణ కోణం నుండి రాశాననిసంకల్పంకథను గురించి కారా గారు అన్నట్టు మానవ జీవనం ఎంతటి మార్పుచేర్పులకు ఎట్లా లోనవుతుందో వారి కథలన్నీ చెబుతాయి.

అభిమానాలుకథలో సాధారణంగా సగటు కుటుంబాలలో ఎట్లా జీవిస్తారో చెప్పిన విధానం చూస్తే దుఃఖితులూ, దురదృష్టవంతులూ బ్రతుకుతూనే ఉంటారు, దుఃఖ రహితులూ, అదృష్టవంతులూ కూడా బ్రతుకుతూనే ఉంటారు. బ్రతుకులెట్లా ఉంటాయో చెప్పాల్సిన ఒక బాధ్యత కథారచయిత మీద ఉంటుంది. సమస్యల వలయంలోంచి బయటపడే విషయాలను సూచనప్రాయంగా చెప్పడం చేయి తిరిగిన కథకుల లక్షణం.

కారా గారి కథల్లో భాష, వాక్యాలు

చావు కథబలబల తెల్లవారే సరికి చితి కుమిలింది. కారా గారి కథలో ఒక్కరోజు విషయాన్ని కథలాగా మలిచారు.

  1. లేత ఎండలో ఊరు నిద్ర లేచింది.
  2. సీతాకాలం పేరు సెబితే మా సెడ్డ బయం.

కన్నయ్య మనసు ఆముతిన్న పసరంలా కిందమీదు ఔతోంది.

ఎరకయ్య తల్లి ముసల్ది చచ్చిందిఆరోజుసారా కొద్దు నేనీయేల సార తాగనుఅంటాడు దహనం చేయడానికి,

బతికిన బతుకు సరే! సచ్చినసావు కాడామమసులికి పదం అక్కర్నేదా?

బతికున్న మనిసైతే నీదీ నాదీ సచ్చిన శవం ఊరందరిదీనూ. అందుకే గదా ఏలప్పుడు ఇక్కడోటు ఇంతమంది

పేర్నాంకాలం సమయం చెప్పాలి. అర్ధరాత్రి చలికాలం.

ఎరకయ్య పెద్దకొడుకునాయనమ్మ శవాన్ని కాల్చాలంటాడు.

సూరయ్య సుబ్బరాయుడుకొందరక్కడన్నరు రచయితగాఎప్పుడూ ఏం జరిగినా, కనిపించని ఒక అనిర్వచనీయమయిన ఆనందం. మనిషి ముఖం మీద వెల్లివిరుస్తోంది. అతనిలో నలుపంత చెదిరి అతని వెనక నీడగా వడబోతలేది. మంటల వెలుగులు నీడను కూడా చెల్లాచెదురు చేస్తున్నాయి. కట్టెల మోపులు ఎత్తుకురావడందీనికి ధైర్యం గురించి చెప్పడంతగినోళ్ళకి ఇది ఎక్కువ అనడం.

బాష

కలికాలంలోనూ బగవంతుడు అవుతారం ఎత్తుతాట. ఐతే యీపాలి బాణాలు గీణాలు, శక్రాలు, గిత్రాలు అన్నీ ఒగ్గేసి కత్రోటుకు నెగుస్తాట్ట, నెగిసి, యినాగ ఊరూరు ఎళ్ళి; ఎనాగని గుర్రం మీన, యీ పాపాలు సేసినోళ్ళందర్నీ నరికి పోగులెడతా.

రామాయణం, భారతం కూడా చర్చలోకి వస్తాయి. సీత, రావణుడు కథంతా నాలుగు మాటల్లో చెప్తాడు.

ఆడదానికాడా, ఆస్తికాడా మంచి మంచోళ్ళే మంచి కినుకోరు” – దేవుని గురించి.

పెద్దలేటంటారంటేకాలం సందీమంది కొచ్చినప్పుడల్లా ఆడునానడూ లేదా అన్నకాడికొస్తాదట. అనాటప్పుడు ఆడింక పైన ఉండట్ట. అవుతారవో ఎత్తి బూమ్మీనకే దిగతాట.

అయితే నాగ! శంకూ శక్రం గదా గిద యియ్యేటుండువు. దేవునాగరాడు మనిసినాగ. మనిసి కడుపున పుట్టే మనిసి సెయ్యగలిగిన పన్డే సేస్తాడంట. మరలాగ ఆడొచ్చినప్పుడు ఆడెంట సావు కూడా బూమ్మీన్నకొస్తాదట సూరయ్య.

నారెమ్మ, అప్పారావు : ముసల్దాని చావు కర్చు లెక్క కట్టుకోగానేగోయిందా పీడ వెడి కడియాలు గోయిందా!” అంటుంది నారెమ్మ. పోలమ్మకు కోపం వస్తుందీమాటతో.

  1. కథా సామాగ్రిగా వర్ణనలు.
  2. కథకు అవసరమున్న చోట అవసరమున్నంతనే వర్ణించాలి.
  3. కథ చెప్పడం రెండువిధాలు
  4. నేరుగా చెప్పడం.

2 కళా సామాగ్రిని రమ్యంగా అమర్చడం ద్వారా కథను చెప్పడం సన్నివేశాలు, పాత్రలు, సంభాషణలు, సంఘటనలూ వర్ణనలుహావభావ చిత్రణలు ఇవి సామాగ్రి కథకు..

విలక్షణమైన కథా రచయిత కారా గారు, కాళీపట్నం రామారావుగారి రచనలే గాదు వారి జీవితమూ ఆదర్శప్రాయమైనవి. నేటి తరం వారి రచనా శిల్పాన్ని అందిపుచ్చుకుని సమాజం పక్షానా నిలవాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.