“నెచ్చెలి”మాట 

తస్మాత్ జాగ్రత్త 

-డా|| కె.గీత 

కోవిడ్ కాలంలో 

ఉద్యోగాల్లేక 

డబ్బు వచ్చే మార్గాల్లేక 

జనం విలవిల్లాడడం మాట విన్నారా?

సానుభూతి పడ్డారా? 

అయ్యో… పాపం…  

అని సాయం చెయ్యబోయి 

చెయ్యికాల్చుకున్నారా?

మోసపోయారా?

తస్మాత్ జాగ్రత్త!

కోవిడ్ కాలంలో

మామూలు మోసగాళ్ళేం ఖర్మ 

ఘరానా మోసగాళ్లు 

ముందుకొచ్చేరు!!

 

డబ్బు కోసం 

పీకెలు కోసెయ్యడం

పట్టపగలే దోచెయ్యడం 

కనబడ్డ వస్తువల్లా మాయం చేసెయ్యడం 

హత్యలు, దోపిడీలు వంటి

గొప్ప నేరాలు ఘోరాలే కాకుండా –

ఆన్లైన్ లో మాస్కులు

కొన్నారా?

సర్జికల్, సర్టిఫైడ్ లంటూ ఏం వస్తాయో 

స్విగ్గీ ఆర్డర్ 

చేసారా? 

అనుకున్న సరుకు బదులు ఏం వస్తుందో 

ఫేసుబుక్కులో 

తెలియని వారికి మెసేజీ పెట్టారా?

ఏ అకౌంటు ఖాళీ అయిపోతుందో తెలీదు

 

ఇక నమ్మించి మోసం చేసేవాళ్ళ 

సంగతి చెప్పనవసరం లేదు 

బంధువులనో 

స్నేహితులనో 

తెలిసిన వాళ్ళనో 

తెలిసో తెలియకో 

పని అప్పగించేరా 

అంతేసంగతులు 

డబ్బు చేతపెట్టేరా 

ఇక 

మరిచిపోవాల్సిందే 

 

తస్మాత్ జాగ్రత్త 

మీరు ఇండియాలో 

ఉద్యోగంలో ఉన్నారా?

వందల్లో, వేలల్లోనూ 

విదేశాల్లో ఉన్నారా?

వేలల్లో, లక్షల్లోనూ  

డబ్బు గుంజే 

ఘరానా దోపిడీ దొంగల ఎరలు 

ఎక్కడపడితే అక్కడ 

సిద్ధంగా ఉన్నాయి 

 

కోవిడ్ కాలంలో 

ఆరోగ్యంతో సమానంగా 

మెలకువ వహించాల్సిన 

మోసపూరిత 

విషయాల పట్ల 

మరింత జాగ్రత్త! 

తస్మాత్ జాగ్రత్త!!

*****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా కామెంట్లు పోస్టు చెయ్యండి. ఇలా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటుకే కాక ఆయా ఆర్టికల్ రాసిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ! 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.