“నెచ్చెలి”మాట 

చిన్న సున్నా (ఓమిక్రాన్)

-డా|| కె.గీత 

నిన్నమొన్న డెల్టా నుంచి తేరుకోకముందే 

ఉల్టా అయింది పరిస్థితి-

గ్రీకు అక్షరాలు వరసపెట్టి అయిపోతున్నాయి…   

ఆల్ఫా, బీటా

గామా, డెల్టా

ఎప్సిలాన్, జీటా

ఎటా,తీటా, అయోటా

కప్పా, లాంబ్డా

ము, ను, జి

ఓమిక్రాన్….. 

మాట వింటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనీ  

ఓమిక్రాన్ (ఓ- మైక్రాన్)

అంటే చిన్న సున్నా అట 

కానీ 

ధైర్యం పెద్ద సున్నా అయ్యేట్టుందనీ 

బాధ పట్టుకుందా?! 

మరి 

వైరస్ కీ దమ్ముంది

కంటికి కనబడదని 

చిన్నచూపు చూస్తే 

పెద్దచూపు చూడదూ!

మాస్కు మెడకి తగిలించేసుకుని 

వేళ్లు  శానిటైజర్ లో ముంచేస్తే  

పోలా 

అనుకుంటే 

దొంగదెబ్బ తీయదూ!!

“అన్ స్టాపబుల్”  మనుషులమంటూ 

ముక్కూ ముక్కూ 

రాసుకునేస్తే 

మూడు చెరువుల నీళ్లు తాగించదూ?!

పెళ్లిళ్లూ, పేరంటాలు 

పార్టీలు, పబ్బులు 

అంటూ  

విజృంభిస్తే 

విరగబడదూ?! 

అన్నట్టు 

మరో క్లిష్ట విషయమేవిటంటే 

బూస్టర్ వాక్సిన్ దెబ్బకు తట్టుకోవడానికి కూడా 

మాంఛి గుండె నిబ్బరం కావాలట!  

అయినా పోరాటం తప్పదు 

ఆ చిన్న సున్నా 

మన్ని మించిపోయి 

మానవ మేధస్సుని 

పెద్ద గుడ్డు సున్నాగా  

మార్చకుండా  

ఉండాలంటే 

క్లిష్టతల్ని మొయ్యాల్సిందే!

*****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా కామెంట్లు పోస్టు చెయ్యండి. ఇలా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటుకే కాక ఆయా ఆర్టికల్ రాసిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ! 

*****

Please follow and like us:

2 thoughts on “సంపాదకీయం- డిసెంబర్, 2021”

  1. బావుందండి.
    అందరకీ సులువుగా అర్ధమయ్యే భషలో రాసారు.
    నేను నా ఫేస్బుక్ లో షేర్ చేసాను కవితని.
    అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.