పిచ్చుక పిల్లల తప్పు

-కందేపి రాణి ప్రసాద్

          ఒక చెట్టు మీద పిచ్చుక తన పిల్లలతో భార్యతో జీవిస్తోంది. పిల్లలు ఇప్పుడిప్పుడే పెద్దవాల్లవుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు  చెప్పి పిచ్చుకలు బయటకు వెలుతుంతుంటాయి. ఆనదంగా సంసారం సాగిస్తున్నాయి. పిచ్చుకలు జంట చీకటి పడగానే తినేసి నిద్రపోతుంటాయి. పిల్లలు మాత్రం చాలాసేపు మేలుకుంటున్నాయి. అప్పుడప్పుడు రాత్రిపూట మెలకువ వచ్చి చూసినప్పుడు పిల్లలు దగ్గర నుంచి వెలుగు కనిపిస్తోంది. నిద్ర మత్తులో ఏమి పట్టించుకోకుండా నిద్రపోతుంది తల్లి పిచ్చుక.
ఒకరోజు తండ్రి పిచ్చుకకు నిద్ర పట్టక అలా దొర్లుతూ ఉంది. అప్పుడు పిల్లల దగ్గర నుంచి వెలుతురు కనిపించింది.  రాత్రిపూట ఈ వేలుతురేమిటి? అని ఆశ్చర్యపోయి లేచింది. నాలుగు పిల్లలూ కలిసి ఫోన్ చూస్తున్నాయి. ఫోన్లోని వెలుతురే దానికి కనిపించింది. వెంటనే లేచి పిల్లల దగ్గరకెళ్ళి అడిగింది. ఇదెక్కడిది అని. పిల్లల్లో పెద్ద పిచ్చుక భయపడుతూ భయపడుతూ ఏది అనడిగింది. మిగితా పిల్లలన్నీ భయంతో వనకసాగాయి. మరీ మరీ అంటూ నసగాసాగింది. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు అంటూ తండ్రి పిచ్చుక గద్దించింది.పెద్ద పిల్ల నాకు కోతిపిల్ల తెచ్చిచ్చింది. మన పక్కూరు నుంచి తెచ్చుకుందట చాలా బాగుంది. అని ఎన్నో విశేషాలు చెప్పి ఇచ్చింది నాన్నా అన్నది.
అది కోతిపిల్ల దానికి భయం భక్తీ లేదు. అల్లరి పిల్లలు అనే పేరు వాళ్ళకి దానితో నీకు స్నేహమేమిటి? అని  తండ్రి పిచ్చుక ఇంకా గట్టిగా మండలిచింది. లేదు నాన్నా నాకేమి తనతో స్నేహం లేదు నిన్న తనే మన గూటి దగ్గరకు వచ్చి ఇచ్చి వెళ్ళింది. రాత్రంతా చూసుకొని రేపివ్వు అన్నది.పెద్దపిల్ల చెప్పింది. 
          ఇంతలో తల్లి పిచ్చుక నిద్రలేచి వచ్చింది. వీరి సంభాషణ అంత విన్నది. ఇంతకు ముందు కుడా నాకు రెండు మూడు సార్లు వెలుతురు కనిపిస్తే ఏంటో అనుకున్న కదా ! అన్నది కోపంతో ఇంతకు ముందు కూడా తెచ్చుకున్నారా  కోపంగా అన్నది తండ్రి పిచ్చుక అవును నాన్నాఅప్పుడు కూడా మేం వద్దంటున్నా చాలా బాగుంటదని చెప్పితే తీసుకున్నాము భయంతో వణికి పోతూ చెప్పింది పెద్దపిల్ల. ఎవరూ ఏమిచ్చినా తీసుకో గూడదు ఇంకా ఏం పెట్టినా తినకూడదు రోజులు బాగాలేవు కదా  తల్లి పిచ్చుక అనునయంగా చెప్పింది అసలు ఈ సెల్ ఫోనులు అంటే ఎమిటో తెలుసా ! మన పిచ్చుకుల పాలిట యమ దూతలు ! మనుష్యులు వారి స్వార్ధం కోసం వీటిని కనిపెట్టారు. వీటి కోసం అక్కడక్కడా సెల్ టవర్లు కడతారు వాటి నుంచి తరంగాలు వెలువడతాయి ఆ తరంగాల వలన మన పిచ్చుకలకు ప్రాణ హాని జరుగుతున్నది మన తాత నానమ్మ కూడా అలానే చనిపోయారు నీకు తెలుసా ఈ విషయాలన్నీ మన ప్రాణాలు తీసే వాటిని తెచ్చి ఏకంగా ఇంట్లోనే పెట్టావు అర్ధమయిందా కోపంగా అన్నది తండ్రి పిచ్చుక. నాకు అస్సలు తెలియదు నాన్న తాత నాన్నమ్మ కుడా ఈ సెల్ఫోనులు వలెనే చనిపోయారు ఎదో బొమ్మలు బాగున్నయ్యంటే చూశాను కానీ తప్పు జరిగింది. ఇంకోసారి  చేయను బుద్దిగా చెప్పింది పెద్ద పిల్ల చిన్న పిల్లలు వంత పలికాయి. 
          తండ్రి పిచ్చుక కొద్దిగా కోపం తగ్గింది పిల్లలు అలా వణికి పోతూ మాట్లాడుతుంటే చిన్న పిల్లలు కదా తెలియక చేస్తుంటారు. నేను నిదానంగా చెప్పాలి కదా! తన తల్లి తండ్రి మరణం తననెంత కుంగాదీసిందో ఆ ఆవేశంలో ఆపుకోలేక గబ గబా అరిచేసింది. తనను తను తమాయిన్చుకున్నది తండ్రి పిచ్చుక. 
          నిదానంగా పిల్లలతో ఇలా చెప్పింది. చూడండి మేవేం చెప్పినా మీ మంచి కోసమే  సెల్ ఫోన్ టవర్ల నుంచి వెలువడే సిగ్నల్స్ మన ప్రాణాలు తీస్తాయి. మనం ఎవరికీ హాని చేయకుండా మనం బతుకేదో మనం బతుకుతున్నాం. మనం మరణిస్తే మనుష్యులకే నష్టం పొలాల్లో ఉండే చిన్న పురుగుల్ని మనం తిని వాళ్ళను కాపాడుతాం. పిచ్చుకల జాతి తగ్గిపోతోందని మన కోసం ఒక రోజును కూడా కేటాయించారు. పిచ్చుకలను బతికించటానికి శాస్త్రవేత్తలు నానా తంటాలు పడుతుంటే సాధారణ మానవులు ఇంటికి నాలుగు ఫోన్లు కొనుక్కొంటున్నారు. పూర్వం ఎక్కడంటే అక్కడ వాలే పిచ్చుకలు ఇప్పుడు కంటికే కనబడటం లేదు మన ప్రాణాలు తీసే వాటికీ మనింటికే తెచ్చుకోవచ్చా అందుకే మేము జాగ్రత్తలు చెప్పేది.
          పిల్లలు అర్థమైనట్లు గా తలూపారు. చాల కొత్త విషయాలను తెలుసుకున్నారు. తండ్రి పిచ్చుక చెప్పే విషయాలను కళ్ళు పెద్దవి చేసుకొని  మరీ ఆశ్చర్యంగా విన్నారు. పిచ్చుక పిల్లలన్ని ఒక్కసారిగా ఇలా అన్నాయి. మాకీ విషయాలు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు కాబట్టే  తెలీక కోతిపిల్ల దగ్గర సెల్  ఫోన్ తీసుకున్నాను. ఇంకోసారి ఈ పొరపాటు జరగనివ్వం మీమాట ఎప్పుడూ జవదాటం నాన్నా అంటూ తండ్రిని హత్తుకున్నాయి. 
          నాకు తెలుసురా నా పిల్లలు బంగారాలు అంటూ తండ్రి పిచ్చుక తల్లి పిచ్చుక పిల్లలను దగ్గరకు తీసుకున్నాయి.

    *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.