“నెచ్చెలి”మాట 

శుభకృత్ ఉగాది

-డా|| కె.గీత 

అన్నీ శుభాలేనుష 

శుభకృత్ ఉవాచ 

రోగాలు 

యుద్ధాలు 

బాధలు 

సమసిపోతాయా?

మళ్ళీ చైనాలో కరోనా అట 

ఉక్రెయిన్ లో యుద్ధం ముగిసేది ఎప్పుడో 

శ్రీలంకలో ధరలు దిగేదెన్నడో 

శుభాలు 

మాత్రమే కావాల్సిన చోట 

మరి మనిషి దుష్ట తలరాత సంగతేంటి?

అసలు 

భవిష్యత్తు పంచాంగమంత సరిగ్గా ఉంటే 

ఎంత బావుణ్ణు!

ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాలు 

మానప్రాణాలు గాల్లో కలుస్తున్న యుద్ధాలు 

జీవచ్ఛవాల శతకోటి బాధలు 

శుభకృత్ తీరిస్తే బావుణ్ణు!

ఎక్కడో మిణుక్కుమనే 

ఆశని సజీవంగా ఉంచే 

శుభాన్ని ఆశించడం 

తప్పుకాదేమో!!

అన్నీ శుభాలేనంటున్న  

శుభకృత్ ని 

ఉగాదులొద్దు 

ఉషస్సులొద్దు 

అని  

తిరస్కరిస్తే 

అన్నీ 

అన్నీ అశుభాలేనుష!

పండిత ఉవాచ!! 

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

 ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి బహుమతి ప్రదానం చేస్తాం. బహుమతి మొత్తాన్ని కామెంటు రాసిన వారికే కాక ఆర్టికల్ కు సంబంధించిన రచయిత/త్రికి కూడా పంచుతాం. పాతరచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

 

మార్చి, 2022 లో బహుమతికి ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: శశి ఇంగువ 

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఎప్పటికి వస్తుంది స్వేచ్ఛ ? (కవిత),  కవయిత్రి: శ్రావణి బోయిని

బహుమతిగ్రహీతలకు అభినందనలు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.