వెనుతిరగని వెన్నెల(భాగం-37)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్ళి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ళ అనుమతితో పెళ్ళిజరుగుతుంది. పెళ్ళయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. కష్టమ్మీద తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసవుతుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. తన్మయి స్థానిక రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగానికి కుదురుకుని జే.ఆర్.ఎఫ్ కూడా సాధిస్తుంది. 

***

          ఆ వారాంతం ఇంటికి వెళ్లింది తన్మయి.

          తండ్రి ముఖం లోని చిటపటలు, తల్లి ముఖంలో ప్రశాంతత కనిపించేయి తన్మయికి. మనసంతా ఎప్పుడూ లేనంత హాయిగా తేలికగా ఊంది తన్మయికి. తను ఇప్పుడు సర్వ స్వతంత్రురాలు. ఏవ్వరి మీదా ఆధారపడి లేదు, ఎవ్వరికీ తన మీద హక్కులు లేవు, తన మీద ఎవ్వరి అజమాయిషీ లేదు. అందుకే తండ్రికి ధైర్యంగా చెప్పింది.

          “ఏం చేద్దామని విడాకులు తీసుకున్నావు?” గట్టిగా అరిచేడు భానుమూర్తి.

          “నాన్నగారూ, మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంత జరిగేక అతనితో కలిసి ఎలా ఉంటానని అనుకున్నారు? ఛీ, వాడి విషయం తలుచుకుంటేనే కంపరం పుట్టుకొస్తూంది.” అంది తన్మయి.

          “తండ్రిని నేననే వాణ్ణొకడిని ఉన్నాను. నన్ను అడగాలని ఇంగిత జ్ఞానం నీకు లేకపోయింది. నీ అంతట నువ్వు నిర్ణయం తీసేసుకోవడమే. రేప్రొద్దున్న ఈ పిల్లోడు తండ్రి కావాలంటే ఏం సమాధానం చెప్తావ్? ఇంత తొందరపాటు నిర్ణయం ఏంటి?…”
ఆవేశంగా మాట్లాడుతున్న తండ్రి వైపు ఆశ్చర్యంగా చూసింది తన్మయి.

          “మొదట్నీంచీ జరిగిన ప్రతీ సంఘటనా తెలిసీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అయినా మొదట విడాకుల కోసం నోటీసు పంపినది అతనా, తనా? ఆతనికై అతను అటు వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే వరకూ తను పిచ్చి దానిలా అతనేం చేసినా భరించింది. అతనికి విడాకులు ఇవ్వననే కోర్టు చుట్టూ అర్థం లేకుండా తిరిగింది. ఏ విధంగానూ తను తొందర పడలేదు. అయినా తండ్రి అంటున్నదేవిటి? “తనది తొందర్పాటా?”
అదే చెప్పింది.

          కుర్చీ లోంచి లేవబోయి తూలి పడ్డాడు భానుమూర్తి.

          “నాన్న గారూ!” అంటూ చటుక్కున దగ్గరికి వెళ్లి పట్టుకుంది తన్మయి.
గుండె రాసుకుంటూ పక్కనే మంచమ్మీద చతికిలబడుతూ బైటికి వేలు చూపించేడు భానుమూర్తి.

          “వెళ్ళు, ఇంకెప్పుడూ ఇక్కడికి రాకు”

          బుగ్గలమీంచి ధారాపాతంగా కారుతున్న వెచ్చని కన్నీళ్లు తనని గంగా ప్రవాహమై ఉవ్వెత్తున ముంచి తనని కలిపేసుకుంటే బావుణ్ణని అనిపించింది తన్మయి. చప్పున మేరీ అన్న మాటలు గుర్తొచ్చేయి.

          “మగవాళ్లెప్పుడూ మగవాళ్లే. తమ పరిధిలో తల్లయినా, భార్యయినా, కూతురైనా చెప్పిన మాట వింటూ తు.చ తప్పకుండా నడుకున్నన్నాళ్లూ గొప్ప వాళ్లుగానే ప్రవర్తిస్తారు. వాళ్ల ఆధిపత్యంలో ఉన్న ఆడవాళ్ళు నచ్చనివి చేసిన్నప్పుడే వాళ్ల అసలు స్వరూపం బయటపడుతూంది.”

          “నిజమేనా?” విసవిసా పక్క గదిలోకెళ్లి పోయీంది తన్మయి. శేఖర్ ఎంత బాధించినా అతను మరొక కుటుంబం నించి వచ్చిన వ్యక్తి కాబట్టి అతని పద్ధతులు వేరు అనుకుంది. కానీ తండ్రి? ఒక్కతే కూతురు కావడం వల్ల చిన్నప్పటినించీ తల్లి తనని అమ్మాయిగానూ, తండ్రి అబ్బాయిగానూ పెంచేరు. సైకిలు తొక్కడం నేర్చుకుంటానని ఆరో తరగతిలో తండ్రి పెద్ద సైకిలు మీద మొదటి రోజు ఫెడలు తొక్కడానికి ఒక రోజంతా తనకి శిక్షణ ఇచ్చేడు. తండ్రి టివీఎస్ ఫిప్టీ మోటారు సైక్లు కొని తీసుకొచ్చిన మొదటి రోజే బండి నడపడం నేర్చేసుకున్న తన వైపు ప్రశంసా పూర్వకంగా చూసిన చూపు ఇంకా మర్చి పొలేదు తన్మయి. నువ్వే అబ్బాయి వైతే బావుణ్ణురా అని ఎన్నో సార్లు తనతో అన్న తండ్రిని ఎంతో ప్రేమించింది. నువ్వు మీ నాన్నలాగే ఉంటావు అని ఎవరైనా అంటే ఎంతో పొంగిపోతూ వచ్చింది. అలాంటి నాన్నేనా ఇలా మాట్లాడుతున్నది? ఓక మగాడి సంరక్షణలో తప్ప స్వతంత్రంగా తను బతకలేనని ఎందుకు బాధపడ్తున్నాడు? ఇంట్లో ఇంత గొడవ జరుగుతూన్నా తల్లి ముభావంగా ఉండిపోయింది. తన్మయికి మనసంతా దిగులు కమ్ముకుంది.

          జీవితం ఎప్పుడూ పోరాటమేనా? ఇన్నాళ్లూ తను చేసిన పోరాటం వేరు, ఇక మీదట చెయ్యబోయేది వేరు. మొదటిసారిగా తనెంత ఒంటరో అర్థం కాసాగింది. అయినా తప్పదు, ఇక మీదట తల్లిదండ్రుల అండ కూడా లేదు తనకి. తన పాట్లేవో తనే పడాలి. అంతే. ఇక బాబుని తనతో తీసుకెళ్లి పోయి స్వతంత్రంగా బతకాలని నిశ్చయించుకుంది తన్మయి.

          “ఏదో ఆవేశంలో అన్నారులే. రెండ్రోజుల్లో నిన్నూ, వాడినీ చూడకుండా ఉందలేనని అనరూ” అని తల్లి తనని ఓదారిస్తే బావుణ్ణని అనిపించింది. తన బాధ్యత తల్లికీ దుర్భరంగా అనిపిస్తూందా? బాబు సంఘర్షణ భారంగా తయారైందా? ఏమో, ఏవీ ఊహించుకోవడం ఇష్టం లేదు, అలాగని తల్లి మనన్సులోని అభిప్రాయమూ తనకు తెలియడం లేదు.

          ఓక పక్క తనకి శేఖర్ పీడ విరగడైనందుకు సంతోషంగా ఉన్నా, ఏదో తెలీని అసహనం ఎందుకు కనిపిస్తూందో అర్థం కాలేదు తన్మయికి. కారణాంతరాలు ఏవైనా ఇప్పుడిక అసలు జీవితం ప్రారంభించబోతూంది తను. కళ్ళు తుడుచుకూంది. “దేనికీ కుంగి పోకూడాదు. తను ఎటు వంటి నిర్ణయం తీసుకున్నా అనుభవించేది తనే. తల్లి దండ్రులు కాదు. తనకు తెలిసినంత వరకూ తను మంచి నిర్ణయాలే తీసుకుంటూంది.
ఇక వాళ్ల కోపతాపాలతో తనకి సంబంధం లేదు. వాళ్ళు తనని చూడాలనిపిస్తే వాళ్లే వస్తారు.

          బాబు బ్యాగు సర్దింది నిశ్శబ్దంగా తన్మయి. ఉదయం మొదటి బస్సుకి విశాఖ పట్నానికి బయలుదేరింది. విశాఖపట్నం పొలిమేరల్లోకి రాగానే మరింత దిగులు కమ్ముకుంది. ఈ నగరం వైవాహిక జీవితంలో తను కన్న అపురూప కలలన్నీ కూల్చి వేసింది. ఎన్నో దుఖ్పూరిత రాత్రుళ్లని మిగిల్చింది. ఎన్నో పాఠాలు నేర్పింది. అయినా కొందరు మంచి మనుషుల్ని పరిచయం చేసింది. ఆధ:పాతాళాన్నీ, ఆత్యున్నత విజయాన్నీ పరిచయం చేసింది. కొన్ని మెట్లనీ ధిగమింపజెసింది. కొత్త జీవితాన్నిచ్చింది.
ఎంతో విచిత్రమైన జీవితం! ఒళ్లో నిద్ర పోతున్న బాబు తల నిమిరింది.

          ప్రాపంచిక బాధలెరుగని పసివాడు! వాడి నుదుటి మీద ముద్దు పెట్టి చుట్టూ కప్పిన శాలువాని మరింత దగ్గిరికి లాగుతూ దగ్గరకు తీసుకుంది. తల్లి ఓంటి వెచ్చదనానికి ఆదమరిచి నిద్రపోతున్నాడు బాబు. ఓక్క సారి ఊపిరి గట్టిగా పీల్చింది. బయట తొలి మంచు వెలుతురు మెల్లగా విచ్చుకుంది. తడి ఆరని తన్మయి కళ్లలో జీవితం పట్ల ఆశలాగా.

***

          నిద్రపోతున్న బాబుని ఒక చేత్తో గట్టిగా పట్టుకుని వాడు చేతుల్లోంచి జారి పోకుండా, కొంగు తీసి నడుం చుట్టూ బిగించుకుంది. మరో చేతికి పర్సు తగిలించుకుని, అదే చేత్తో బ్యాగు మోసుకుంటూ ఆటో దిగి హాస్టలు ఆవరణలోకి నడవసాగింది.

          వార్డెన్ అడిగితే ఏం సమాధానం చెప్పాలో ముందే నిర్ణయించుకుంది. “ఒక వారం సమయం చూస్కుని ఎక్కడైనా ఇల్లు చూసుకుని వెళ్ళిపోయే వరకూ దయచేసి ఏమీ అనకండి.” హాస్టలుకి చేరగానే నిసత్తువ వచ్చేసింది తన్మయికి. కానీ విశ్రాంతి తీసు కోవడానికి లేదు. చేతిలో ఉన్న కాసిన్ని డబ్బ్బులతో ఇంటికి అడ్వాన్సు ఇచ్చేస్తే ఈతరత్రా ఖర్చులెలా వస్తాయి? మొదత్నించీ తన్మయికి తన దగ్గర డబ్బులు లేకపోతే తినడం మానేసి పస్తులయినా ఉంటూంది కానీ, ఎవరినీ చెయ్యి జాచి అప్పుగా నయినా అడిగే అలవాటు లేదు. తనకే ఎందుకిలా జరుగుతూంది? బాబు పక్కనే పడుకున్న తన్మయి బుగ్గల్ని వెచ్చని కన్న్నీల్ళూ తడిపేయ సాగేయి. ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు మేరీ వచ్చి తట్టి లేపేంత  వరకు. అప్పటికే నిద్ర లేచి పక్కనే ఆడుకుంటూన్న బాబు “అమ్మా” అంటూ వచ్చి ఒళ్ళో చేరేడు.

          “అమ్మా” అన్న వాడి పిలిపు కోసమే తను ఇంకా బతికి ఉంది. వాడి కోసం ఎన్ని కష్టాలనయినా భరించ గలిగే గొప్ప స్ఫూర్తి వాడు. ఛిన్ని నాన్నా, బంగారు తండ్రీ! అంటూ గుండేలకు హత్తుకుంది. తన్మయి కల్లలో నీటి పొరలు చూడగానే మేరీకి అర్థమయ్యింది ఏదో జరిగిందని. పక్కనే కూచుని చేతి మీద  రాయ సాగింది.

          నాకు తెలిసిన స్కూలు ఒకటి ఉంది. అందులో నువ్వు ఉద్యోగానికి కుదురుకుంటే బాబుకీ ఎడ్మిషను ఫ్రీగా దొరుకుతుంది. స్కూలు ఒక్క పూటే. కొత్తగా పెట్టిన ఇంటర్నేషనల్ స్కూలు అది.

          ఇప్పుడిప్పుడే పీహెచ్డీ  మొదలు పెట్టేవు కాబట్టీ, నీకు ప్రీ పీహెచ్.డీ ఎగ్జాంస్ అయ్యేంత వరకూ పెద్దగా ఆ పనుండదు. మీ గైడు గారితో మాట్లాడుకుని ఉదయం అక్కడ పనిచేసి మధ్యాహ్నం నువ్వు రీసెర్చి పని చేసుకోవచ్చు. నేను ఊదయం నా పనులు చూసుకుని, మధ్యాహ్నం నేను వచ్చి బాబుని చూస్తాను. టెన్షను పడకు తన్మయీ. అన్నిటికీ ఆ ప్రభువు ఉన్నాడు. అని ఓదారుస్తూన్న తన్మయి మేరీ అర చేతిని పట్టుకుని నిశ్శబ్దంగా రోదించ సాగింది. “ఈ అమ్మాయికి తను ఏమవుతుంది? ఎందుకింత దయ తన మీద? “నీకు థాంఖ్స్ చెప్పడం కూడా చిన్నమాటే మేరీ. నీ స్నేహాన్ని నేను నా జీవితంలో ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను.” అంది తన్మయి మేరీతో.

          యూనివర్శీటీకి  దగ్గర్లో గది దొరుకుతుందేమో వెతకడం మొదలు పెట్టేరు.
దాదాపుగా అన్నీ బాగా చిన్నవి, అద్దె ఎక్కువ. మూడో రోజుకల్లా అర్థమైన విషయం ఏవిటంటే ఊరి నించి దూరంగా వెళ్తేనే కాస్త సౌకర్య వంతమైన ఇల్లు దొరుకుతుంది.
దిగులుగా కూచున్న తన్మయితో, “నాకూ నీతో రావాలనే ఊంది తన్మయీ, కానీ నాకొచ్చే అరకొర స్కాలర్ షిప్పుతో నాకు హాస్టల్లో తప్ప ఇంకెక్కడా ఉండే స్తోమత లేదు.” నీకు తెల్సుగా అంది.

          ఆ మర్నాడు యూనివర్శీటీ బయట బెంచీ మీద బాబుతో బాటు కూచుని కబుర్లు చెప్తూన్న తన్మయి “ఏ…ఏవిటి బాగున్నారా?” అనే పిలుపు వినబడి తలెత్తి చూసింది.
దివాకర్ నవ్వుతూ నిలబడ్డాడు.

          “అయ్యో, మీరు ఇళ్ళ కోసం ఎక్కడో వెతకడం ఏవిటీ? మా ఇంటీ వరండాని ఆనుకుని ఉన్న పెద్ద గదిని మీకు తక్కువకి అద్దెకు ఇప్పిస్తాను. ఇంతకు ముందు బ్రహ్మచారి  మేస్టారు ఒకరు ఉండేవారు. ఆయనకు మొన్ననే పెళ్ళై వెళ్ళిపోయేరు. మీకు సమస్యా తీరుతుంది. మీ బాబుని మా అమ్మగారు చూస్తారు” అన్నాడు.

          తన్మయి ఆశ్చర్యంగా చూసింది. తనకొక కష్టం వచ్చి కళ్ళ నీళ్ళ పర్యంత కాగానే ఒక సహాయం అందజేస్తున్న అజ్ఞాన మిత్రునికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.

          “రెందు చేతూలూ ఎత్తి నమస్కరీంచింది దివాకర్ కి.

          “అయ్యో, భ..భలే వారు” అంటూ దారి  తీసేడు దివాకర్.

          “ఇ..ఇంకా ఏ ఉద్యోగంలోనూ కుదురుకోలేదు. ఇ..మీరు చెప్పిన రెసిడేన్షియలు బ్బ..బాగా దూరం. ఆఅ..అందుకే వెళ్లలేదు…” అని చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్న దివాకర్ వైపు చూసింది తన్మయి.

          ఈతని తత్త్వం చిన్నపిల్ల వాడిదయినా, హృదయం ఎందరో పెద్దవాల్ళకన్నా ఎంతో విశాలమైనది.

          దివాకర్ తల్లి ఎంతో ఆత్రంగా, “రామ్మా” అని పలకరించింది. అడ్వాన్సు ఇవ్వబోతే, “మా అమ్మాయి లాంటి దానివి. మాకు అడ్వాన్సులు అక్కరలేదు” అని చిరునవ్వుతో  తిరస్కరీంచింది.

          తల్లి దగ్గరనించి మంచి తనన్ని పుణీకి పుచ్చుకున్నాడన్న మాట దివాకర్.
హాస్టలుకి సంతోషంగా  తిరిగి వచ్చింది. “ ఆదివారం ఇంట్లో చేరుతాను మేరీ” అంది సంతోషంగా తన్మయి.

          “చేరుద్వు గాని, ముందీ ఇంటర్వ్యూ అయ్యేక” అని కళ్ల ముందు కవరు అందించింది మేరీ. నీకు కాలేజ్ సర్వీస్ కమీషను నించి ఇంటర్యూకి పిలిపు వచ్చింది. గవర్నమెంట్ లెక్చరర్ పోస్టూకి. అంది మేరీ.

          తన్మయి ఈ హడావిడిలో పడి రిటెన్ టెస్టు రిజల్ట్సు వచ్చేయని కూడా పట్టించుకో లేదు. హైదరాబాదులో ఇంటర్వ్యూ. వచ్చే వారంలో. తల్లికి మొదటగా ఫోను చేసి చెప్పాలనిపించింది.

          “పోంన్లేమ్మా, దెవుడి దయ వల్ల ఈ ఉద్యోగం నీకు వచ్చేస్తే బావుణ్ణు.” అంది అట్నీంచి జ్యోతి. “ఉద్యోగం వస్తుందా, రాదా అన్నది ప్రధానం కాదు తన్మయీ. నీకు ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయన్నది తెలుస్కోవడానికి ఇదొక మంచి అవకాశం. నీ ప్రతిభకు తగ్గ ఉద్యోగం ఇది. ధైర్యంగా అటెండ్ అవ్వు. నువ్వు వచ్చే వరకూ బాబుని నేను చూస్తాను అంది మేరీ. ఆ మాట వింటూనే పరుగున వచ్చి తల్లిని కౌగలీచుకున్నాడు బాబు.”విడిచి వెళ్ళొద్దన్నట్టు”

          ఆలోచనలో పడింది తన్మయి. హైదరాబాదులో తల్లికి పెదన్నాన్న గారి అమ్మాయి, తనకి పెద్దమ్మ వరస అయ్యే ఆవిడ ఉంది. ఇంటర్యూకి వెళ్ళి రావడం అంటే ఒక్క రోజు పని కాదు ప్రయాణంతో కలిపి అయిదు రోజులు పడుతుంది.

          తల్లిని తనతో తీసుకు వెళ్లడమే ఉత్తమం. గట్టిగా ఊపిరి ఫీల్చుకుని వదిలి, “నిన్నొదిలి వెల్ళను నాన్నా, అమ్మమ్మని కూడా మనతో తీసుకెళ్దాం” సరేనా? అంది తన్మయి సంతోషంగా.

          జే. ఆర్. ఏఫ్ కి తయారు చెసుకున్న నోట్సులన్నీ తీసి రాత్రీ పగలూ చదవసాగింది తన్మయి. హాస్టలు వార్డేను ఏ కళ నుందో, ఒక వారం అన్నది రెండు వారాలకి ఒప్పుకుంది బాబుని తనతో ఉంచుకోవడానికి. దివాకర్ కి కబురు చెప్పింది “ఇంటర్వ్యూ చూసుకుని, వచ్చే నెలలో చేరుతాను” అని.

***

          డిపార్టుమెంటులో సెలవుకి అప్లికేషను ఇచ్చి బయటికి రాగానే వెనక్కి తిరిగి ఒకసారి చూసింది. “తనకి గవర్నమెంట్ వస్తుందా? లేదా ఇక్కడే తను రిసెర్చి చేస్తూ మరో అయిదేళ్లు ఉంటుందా?”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.