ప్రముఖ రచయిత్రి జలంధర గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(జలంధరగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

          జలంధర చంద్రమోహన్‌ (మల్లంపల్లి జలంధర) తెలుగు పాఠకులకు పరిచయం అవసరంలేని ప్రముఖ రచయిత్రి. జూలై 16, 1948 న జన్మించారు. ప్రముఖ వైద్యులైన గాలి బాలసుందర రావు గారి కుమార్తె. బి.ఎ ఎకనమిక్స్ చదివారు. ప్రముఖ తెలుగు సినీనటుడు చంద్రమోహన్ గారి భార్య.

          ఎన్నో కథలు, నవలలు రాసారు. వీరి కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి. కథాంశాల్లో కూడా నవ్యత, సంఘంపైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.

          వీరు గృహలక్ష్మి స్వర్ణకంకణం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, డా.సి.నారాయణరెడ్డి పురస్కారం, డా. తెన్నేటి లత-వంశీ సాహితీ పురస్కారం, తెలుగు కళాసమితి, అమృతలత అపురూప అవార్డు వంటి ఎన్నో పురస్కారాల్ని అందుకున్నారు.

వీరి రచనల్లో ప్రసిద్ధిగాంచినవి-
కథా సంపుటం: జలంధర కథలు
నవల: పున్నాగపూలు

*****

Please follow and like us:

4 thoughts on “ప్రముఖ రచయిత్రి జలంధర గారితో నెచ్చెలి ముఖాముఖి”

  1. జలంధరగారితో ఇంటర్వ్యూ చాలా బావుంది
    You made her speak whole heartedly.congratulationsto you both Jalandhara Garu and

  2. జలంధరగారితో
    మీ ఇంటర్వ్యూ చాలా బావుంది గీత గారూ ఎప్పటిలాగానే , you made her speak whole heartedly.

Leave a Reply

Your email address will not be published.