కరమజోవ్ సోదరులు

-సుశీల నాగరాజ

 

కరమజోవ్ సోదరులు-1

          నరేంద్ర గారు  దాస్తొయేవ్ స్కీపుస్తక ఆవిష్కరణ సమయంలొ మాట్లాడిన  వీడియో ఈ రోజు పూర్తిగా విన్నాను. అద్భుతం!. ఎంత క్లిష్టమైన పుస్తకం. అది పాఠకులకు ముఖ్యంగా నా లాంటి వారికి ఇంతమాత్రం తలకెక్కాలంటె, తమాషాకాదు. Narendra garu Voracious reader in both  English and Telugu literature.  ఎక్కడా confusion కు చోటే ఉండదు. చాలా స్పష్టంగా ఉంటుంది. చెప్పే విషయం గురించి తడబాటు ఉండదు. వారి interview చూసినపుడు అదే అనిపించింది. ఎక్కడా గొప్పలు చెప్పుకొంటున్న ట్లుండదు. సరళంగా, సహజంగా, సామాన్యంగా ఉంటుంది. ఎక్కడో వీరి  ఒకటి రెండు కథలు చదవటం అంతె. మంచి అవకాశం కల్పించిన  రష్యన్ సాహిత్య అభిమానులకు మనఃపూర్వక అభినందనలు.
 
          అరుణగారు, మీరెవరొ నాకు తెలియదు. దొస్తోయవస్కి వీడియోలు చూస్తూ , వింటూ  అరుణ ప్రసాద్ గారు ఎవరని  ప్రకాష్ గారిని అడిగాను. వారి ద్వారా తెలిసింది ” The Brothers Karamzov” ను అనువదించారని. అప్పుడు  మీ వీడియో చూడటం మీ  మాటలు వినటం. మొట్టమొదట నా మనఃపూర్వక అభినందనలు అందుకోండి. ఈ అనువాదం సామాన్యమైన కార్యంకాదు. అలాంటి నవలను అనువదించటం  చాలా గొప్ప సాధన !! .అసాధారణమైన సాధన! ఈ కార్యం  ఒక గురితొ యజ్ఞం చేసినట్లు చేశారు. మానవునిలోని అన్ని ముఖాలను చూపించిన నవల అని చెప్పారు. చివరికి మిగిలేది ఆధ్యాత్మికత! ఒక నవల ఆధ్యాత్మికతను ప్రసాదించటమంటె అంతకన్నా ఇంకేమి సార్థకత!! డిగ్రీ చదివె రోజుల్లోనె ఈ నవల చదివి జీర్ణం చేసుకొని థ్రిల్ అయ్యారంటె!!! ఆ బంధం మిమ్మల్ని అనువాదం వరకు తీసుకువచ్చింది. ఇంకొకమాట చెప్పారు ఇది soul ను పరిశుభ్ర పరిచేస్తుందని. ఒక నిర్వికారమైన స్థితి, ఎంత యోగా, ధ్యానం, చేసి పొందాలనుకొనేది ఈ ఒక్క పుస్తకం చేసిందంటె ఇంకేమికావాలి! It is whirlwind of emotions.!  మీ సంభాషణ విన్న తరువాత నాకనిపించింది మీరు రచయిత ఆత్మను పట్టుకోవటమెకాదు , దర్శించారు. చాలా చిన్న వయస్సులోనే గొప్ప అనువాదాన్ని చేశారు. Simply Great. Proud of you Arunagaru. 
    
కరమజోవ్ సోదరులు–2
 
          ‘కరమజోవ్ సోదరులు’  పుస్తకం గురించి మధురాంతకం నరేంద్రగారు  చెప్పిన మాటలు’ప్రకృతి, మనిషి , దైవం – మూడూ ఒకటే!! 
 
          అరుణగారితొ ఈ పుస్తకం గురించి చాలానే మాట్లాడాను.ఆ పుస్తకం గాత్రం  నన్ను భయపెట్టింది. చదవగలనా అని. అయినా ఆ ఆకర్షణ నుంచి తప్పించుకోలేకపోయాను. చివరికి ధైర్యంచేసి  పుస్తకం తెప్పించేశాను.  
 
          పుస్తకం చేతికిరాగానే ఇంకా నీరుగారిపోయాను. 912+16 పేజీలు. తక్షణం కళ్ళ ముందు దోస్తొయేవ్ స్కీ గుర్తురాలేదు. అనువాదం చేసిన అరుణాప్రసాద్ గుర్తుకొచ్చారు, కళ్ళముందు నిలిచారు. (వీడియోలొ చూశాను కాబట్టి) ఏమిటి ఈ అమ్మాయి ! ఎలా చేశారు !!. మన దేశం కాదు, భౌగోళిక అంశాలు వేరే, సంస్కృతి వేరే. రష్యన్ భాష నుంచి ఇంగ్లీషు నుంచి అనువాదం. ఎంత పట్టు ఉండాలి భాష పై!! నూరా, ఇన్నూరు పేజీలా అంటె కాదు ఏకంగా 900 పైన. 87 పేజీలు కలిపి ఉంటె విశ్వనాథ సత్యనారాయణ గారి వేయిపడగలు !  It is whirlwind of emotions.! అన్నారు అరుణగారు.  చదువుతుంటె ఈ వాక్యం అర్థం అనుభవంలోకి వచ్చింది. ముందుమాటలొ ‘ కూనపరాజు కుమార్ గారు అనువాదం గురించి ఒక మాట చెప్పారు , ‘ ‘జనరంజకంగా’ చేశారని. అది ఏమిటని చదువుతుంటె అర్థమైంది.
 
          కొన్ని రోజులు ఆ తలపుల్లోనే ఉన్నాను. పుస్తకం తెరవడానికి భయం!!! పుస్తకం చాలా బాగా వేశారు. అక్షరాలు, పేపరు చాలా నాణ్యమైన పనితనం. చివరికి  మెల్లగా చదవడానికి ప్రారంభంచేశాను. చదువుతుంటె ఎక్కడా అనువాదం అనిపించలేదు. ఆ పేర్లు , ఊర్లు తప్పించి ,తెలుగు నవల చదువుతున్న అనుభూతి. 200 పేజీలు చదివేవరకు ఎక్కడా ప్రత్యేకత కనిపించలేదు. అన్ని సమాజాలలోను, అన్ని కుటుంబాలలోను, మనుషులలో ఉండే బలహీనతలతో నడిచింది. తరువాత మెల్లగా పుంజుకొంది . 200సంవత్సరాల వెనుక రాసిన నవల. మనుషుల గురించి, వారి మానసిక బలాలు, బలహీనతలు మిత్యా, యివాన్, అల్యోష ద్వారా వినిపించారు. చదువుతుంటె ఆశ్చర్యం, భయం, జుగుప్సా ఇలా ఎన్నో భావాలు  ముప్పిరిగొన్నాయి. 200 సంవత్సరాల తరువాత కూడా మనిషి మారలేదు!!!! మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. నాలుగు గోడల మద్య ఉన్న సాధువులు, బయటి ప్రపంచంలోని మనుషులకంటె గొప్పవారని భావించరాదు. విశ్వజనీన ప్రేమతొ ప్రపంచాన్ని గెలవవచ్చు. !! అయినా మనిషి మారలేదు, రెండు మహా ప్రపంచయుద్దాలు! అంతేనా ఇప్పుడు ప్రపంచమే రణరంగమై పోయింది. ఆ సమాజం, ఆ మనుషులు, వారి జీవితాలు, దేవుడు, దెయ్యం, అన్ని కోణాలలోని మనిషి క్రూరత్వం, చదువుతుంటె  ‘శ్రీ శ్రీ కవిత’ గుర్తుకొచ్చింది. 
 
      ” ఏ  దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం.!
     భీభత్సరస ప్రధానం,
పిశాచగణ సమవాకారం!
      దరిద్రులను కాల్చుకు తినడం
రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు.!
   వైషమ్యం, స్వార్ధపరత్వం,
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు
చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం!!!! 
     సమతాభావం కనిపించదు.  
 
          కరమజోవ్ సోదరులు, వారి తండ్రి వారి చుట్టు ఉన్న వ్యక్తుల ద్వారా అప్పటి సమాజాన్ని చూపించారు. ఎన్నో పరమార్థాలను, సత్యాలను  విశ్లేషించారు. ప్రపంచంలో ఉన్న వేలకొద్ది  సమస్యలు, ప్రశ్నల గురించి చర్చిస్తారు. తల్లి దండ్రులు చేసిన తప్పుల కు పిల్లలు బాధ్యత వహించటం ఏం న్యాయం!!  ప్రపంచంలో మానవుల  బాధలు, ఆకలి,
దురాశ,  ఈర్ష్యా,  సత్యాసత్యాలు,  క్రూరత్వం ఇలా ఇంకా ఎన్నో కోణాలను కళ్ళకు కట్టినట్లు చర్చించారు. ‘జీవిత పరమార్థం కంటె ఎక్కువగా జీవితాన్ని ప్రేమించాలి’. ఒక్కొక్క పాత్రద్వారా ఎన్నో జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. నాలుగు వందల పేజీలు చదివి రాసినది. మొత్తం పైన  ఈ పుస్తకం చదివి జీర్ణించుకోవటంతొ పాటు పుస్తకం గురించి రాయటం చాలా కష్టమని అనిపించింది. !!! ఇక మిగిలిన ఐదువందల పేజీలు చదివిన తరువాత  !!!
 
కరమజోవ్ సోదరులు-3
 
          అరుణా ప్రసాద్ అనువాదం చేసిన ‘ కరమజోవ్ సోదరుల’   912 పేజీల నవల  చదివి ముగించాను. వీరభద్రుడు గారు ఒకటిన్నర రోజులొ, లక్ష్మి నరసింహరావుగారు 6 రోజుల్లొ అని చెప్పారు. నేను ఒక నెలపైనే  తీసుకొన్నాను. 
 
          నేను చదివి పూర్తిచేశానని మెసేజ్ పెట్టాను. అరుణా ప్రసాద్ ఎంత సంబరపడి పోయారంటె తన అనువాదం పూర్తయినపుడూ అంత సంబరపడి ఉండరనుకొంటాను.! మా సంభాషణ మళ్ళీ అనువాదం గురించే ! ఒక్కవాక్యం చెరపలేదు, ఒక్క కాగితం చించలేదు, ఒక్కసారి కూడా వెనక్కు వెళ్ళి చదవలేదు, కరెక్షన్ చేయలేదు.  ప్రతి ఒక్క వాక్యమూ  ఒక  పెద్ద ప్యారాగ్రాఫ్! అన్నీ కామాలె. వాటిని అర్థగర్భితమైన వాక్యాలుగా విడదీసి రాశానన్నారు. ఎంత ఏకాగ్రత! ఎంత నిబద్దత!ఎలా ఎలా రాశారు అరుణ.!!!  చేతి రాతలొ 1600 పేజీలైందట. అరుణ మీ గురించి రాయటానికి పదాలు దొరకటంలేదు. You are  wizard. ( A Person who is highly skilled )
        
          ఈ నవల గురించి రాయటం చాలా క్లిష్టం!   జటిలమైన, సంక్లిష్టమైన నవల. ఏ ఒక్కరి గురించి రాయడానికి కాదు. ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అందరూ ఈ నవలలొ ఉన్నారు.  అన్ని ముఖాల , వ్యక్తిత్వాల మిశ్రమం. నరేంద్రగారు చెప్పారు ఈ నవల చదవడానికి వినయం- సహనం రెండూ ఉండాలి. ‘ తల్లి ! నిన్ను తలంచి పుస్తకం చేతన్ బూనితిన్. ‘ చేతులు జోడించాల్సిందే.
 
          సాహిత్యం, కవిత్వం, నాటకం, సినీమాలు, ఏవి తీసుకొన్నా నాటి సమాజాన్ని, రాజకీయాన్ని, సామాన్య మానవుని  కష్టాల్ని, కన్నీళ్ళను ప్రతిబింబిస్తాయి. శ్రీమంతుల ఐషారామ జీవితాలు, అందుకుగాను పిల్లలు చెల్లించె  ముడుపు, వారి భవిష్యత్తు, వారి వ్యక్తిత్వం, ఆ కారణంగా సమాజంపై దాని ప్రభావం ఇలా  ఎన్నో దశలను  చూపిస్తుంది !!!నవల చదువుతుంటె ఇవే నా కళ్ళముందు నిలిచాయి.  నరేంద్రగారు చెప్పినట్లు ‘జాగ్రత్తగా చూస్తే కథ రెడీమేడ్ గా దొరుకుతుంది జీవితంలో. ‘ దోస్తొయేవ్ స్కీ తన జీవితాన్ని, సమాజాన్ని ప్రతిబింబించారు ఈ నవలలొ! 
 
          మనిషిలొ ఇంత క్రౌర్యం , స్వార్థం, ప్రలోభం, వ్యామోహం  సాధ్యమా!!  సాధ్యం! ధనమేరా అన్నిటికి మూలం!!! శ్రీమంతులు — న్యాయాన్యాయాలు లేని జీవితం –  ఐషారామ జీవితం, ఏ నియమాలు నిబంధనలు లేని జీవితం, డబ్బును విచ్చలవిడిగా తాగుళ్ళకు, స్త్రీ సాంగత్యం కోసం వినియోగించటం, ఎంతో జుగుప్స కలిగిస్తుంది. ఆ వర్గం స్త్రీ ల జీవితమూ దీనికేమీ మినహాయింపు కాదు.  అందుకు విరుద్ధంగా పేదవాళ్ళ జీవితాలు కళ్ళ ముందు తాండవంచేస్తాయి.       
         
          ఇది తండ్రి ఫ్యోదోర్ పావ్లోవిచ్ –  ముగ్గురు సంతానం, (నాలుగవ సంతానం) వీరి చుట్టూ, వారితొ అల్లుకొన్న వ్యక్తులు, ఆ నాటి సమాజం, అందులోని  వైవిధ్యమైన వ్యక్తులు, వారిలోని మంచి చెడు, కరుణ క్రూరత్వం  ,స్వార్థం- నిస్వార్థం, ఇలా మనిషిలోని అన్ని కోణాలను చూపించిన నవల. ముగ్గురూ  విభిన్న ప్రవృత్తులు కలవారు. మిత్యా తనబాల్యం కారణంగా  భావోద్వేగాలను లేశమాత్రమూ నియంత్రించుకో లేక, డబ్బుతొ అన్నీ పొందవచ్చనుకొని, అనేక కష్టనష్టాలకు లోనై చివరికి తండ్రి హత్యారోపణకులోనై శిక్షింపబడతాడు. రెండవ సోదరుడు యివాన్  వ్యక్తిత్వం సంక్లిష్టం. దేవుడు – దెయ్యం నడుమ ఇరుక్కొని పోయినవాడు. ఇక మూడవ కొడుకు అలెక్సీ కథానాయకుడు, చాలా ఉదాత్తమైన వ్యక్తిత్వం! 
 
          చివరి అధ్యాయం లాయర్లవాదన చాలా ఆశక్తి దాయకంగ,  ఆశాదాయకంగాను ఉంటుంది. మిత్యానె నేరస్తుడనుకొంటూ, చివర నాలుగవ సంతానం స్మెర్ద్యకోవ్ చేసిన హత్య, ఆతని ఆత్మహత్యతొ మిత్యానె నిందితుడిగా నిరూపించబడి శిక్షార్హుడౌతాడు.
 
          చివరికి మిగిలేది ప్రేమ,కరుణ, అందరూ కలిసిఉండటం . మానవుడు సంఘజీవి. మంచి పని మంచినే ఇస్తుంది. ప్రేమ ప్రేమనె ఇస్తుంది మానవత్వమె దైవత్వం. దైవత్వమే మానవత్వం. నవల పూర్తి చేసిన తరువాత మిగిలేది ఏదో నిర్వికారమైన భావం! ఇంతే ఈ జీవితం!! సార్థకమా నిరర్థకమా!! కళ్ళు తెరిపిస్తుంది! ఎన్నో గుణపాఠాలు!!!!
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.