జీవితం

ఆంగ్లం: క్యారీ లా మోర్గన్ ఫిగ్స్

తెలుగు సేత: ఎలనాగ

1

ఆనందపు క్షణం, ఆర్తి నిండిన ఘడియ
ఎండ కాసిన ఒక దినం, వాన కురిసిన ఏడు రోజులు
శాంతి విరిసిన పక్షం, ఘర్షణ ముసిరిన ఒక మాసం
ఇవన్నీ కలిస్తే జీవితమౌతుంది

2

డజను శత్రువుల మధ్య
నిజమైన స్నేహితుడొక్కడు,
మూసిన ఇరవై గేట్లను మరిపిస్తూ
తెరిచివున్న ద్వారాలు రెండు
భోగభాగ్యాల సింహాసనం,
ఆపైన పాడుకాలపు పట్టాకత్తి
మిత్రులారా! ఇవన్నీ కలిస్తే జీవితం

3

ప్రభాతవేళలో ఒక ప్రసూనం,
పగటిపూట ఒక గులాబీపువ్వు
సంజవెలుగులో అది వడలిపోతుంది
సాయంకాలానికి ముడుచుకుపోతుంది
గందరగోళపు రొద, వేణువు ఎదలోని సొద
ఇవీ మరికొన్నీ కలిస్తే జీవితం

4

ఒక చిరుదరహాసం, ఆపైన
మార్మికముత్యమల్లే ఒక అశ్రుబిందువు
ఒక విరామం, వెంటనే
సుడిలో అడుగిడే ఒక ఉధృత ఉరవడి
ప్రేమ నిండిన ఒక చుంబనం,
ఆపైన ద్రోహి ఒక కత్తితో పొడవడం
మీరందరూ ఒప్పుకుంటారనుకుంటా,
ఇవన్నీ కలిసి జీవితమౌతుందని

*****

Please follow and like us:

One thought on “జీవితం(ఆంగ్లం మూలం: క్యారీ లా మోర్గన్ ఫిగ్స్ తెలుగు సేత: ఎలనాగ)”

Leave a Reply

Your email address will not be published.