లయాత్మక గుసగుసలు…

రష్యన్ మూలం: జినైడ గిప్పియస్

ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ

శబ్దాలు కలగలిసిపోయే చోట
లయాత్మక గుసగుసలు కోరుతాను
అడుగు లేని సల్లాపాన్ని
ఆశగా జీవితాంతం వింటుంటాను

దుఃఖపు చెరువులో
పెద్దపెద్ద అనిశ్చయాల వలలు విసురుతాను
మురికి నిండిన మార్గాల గుండా పయనించి
అంతిమంగా సౌకుమార్యాన్ని చేరుకుంటాను

అబద్ధపు ఉద్యానవనంలో
మెరిసే మంచుబిందువుల కోసం వెతుకుతాను
జమచేసిన ధూళికుప్పల్లో
ప్రకాశించే సత్యపు గోళాల్ని భద్రపరుస్తాను

దిగులు నిండిన కాలంలో
ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేస్తాను
దేహదుర్గాన్ని ఛేదించి
ఆధునిక విశ్వమానవునిగా జీవిస్తాను

మచ్చలేని సహనం కోసం
దుర్గమ పథాల్లో పయనిస్తుంది నా అదృష్టం
చీకటిదారుల గుండా నడిచి
ఆహ్లాదాన్ని సొంతం చేసుకుంటుంది

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.