యక్షిణి

ఆంగ్లమూలం: అనురాధా విజయకృష్ణన్

తెలుగు సేత: ఎలనాగ

ఒక ప్రాచీన కథ ప్రకారం …
 
విరగబూసిన పాలవృక్షం మీద రాత్రివేళ ఆశ్చర్యపోయిన చంద్రుని కాంతిలో పువ్వులు రహస్య దీపాలలా వెలుగుతున్నప్పుడు, లేదా చంద్రుడు లేని చీకటిరాత్రిలో పరిమళాలు పాముల్లా గాలిలో నాట్యం చేస్తూ, ఆటపట్టిస్తూ, భయపెడుతున్నప్పుడు ఆ పాలవృక్షం ఆ స్త్రీ మీద పువ్వుల్ని వర్షిస్తే అప్పుడామె యక్షిణిగా మారుతుంది. ఆమె గోళ్ళు దాహంగొన్న మేలిమి కత్తులుగా మారుతై. అవి ఒక్క ఉదుటున గుండెల్ని అమాంతంగా పెకలించ గలవు. ఆమె తలనీలాలు చుట్ట చుట్టుకుంటూ, విప్పుకుంటూ, మళ్ళీ చుట్ట చుట్టుకుంటా యి. భారీ ఆకారాన్ని దాల్చి, ఆమె జిత్తులమారిగా, వంచకురాలిగా మారి, వికటాట్టహాసం చేస్తూ, అల్లకల్లోలం సృష్టిస్తూ మూర్ఖమానవులకు ప్రమాదంగా పరిణమించగలదు. ఆమె పెదవులు వెడల్పై, చిక్కని రంగుల్ని, భావాన్ని సంతరించుకోగలవు. ఎంతగా అంటే, తను కోరుకున్న లేదా మనసు పడినవాటికి దాదాపు సమానంగా.
 
ఎవరైనా హాస్యానికి ఈ కథను చెప్పగా నువ్వు విన్నావనుకో. అప్పుడు నా గురించి ఆలోచించు. నేనెవరినై వుంటాను అని యోచించు.  

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.