“నెచ్చెలి”మా

యుద్ధం

-డా|| కె.గీత 

ఎప్పుడూ
విననివీ
కననివీ

ఎవరికో
జరిగినవని
జరుగుతున్నవని

వార్తల్లో
చదువుతున్నవి
వింటున్నవి
కంటున్నవి

అన్నీ
గుమ్మం
ముందుకొచ్చి
కూచున్నట్టే
యుద్ధమంటే

సరాసరి
ఇంట్లోకొచ్చి
బాధలు
తిష్ట వేసినట్లే

ఎప్పుడు
ఎవరి నెత్తి మీద
ఏం పడుతుందో
ఎవరికీ
ఎప్పుడు
మూడుతుందో
తెలియని
భవిష్యత్తు
యుద్ధం

కయ్యానికి
కాళ్లూ చేతులూ
దువ్వుతున్నపుడు
పోరాటమూ
తప్పదు
జీవన పోరాటమూ
తప్పదు

ఎవ్వరేం
చేసినా
చెయ్యకున్నా
జరిగేది
జరగక
తప్పదు

గత చరిత్ర
ఎక్కడ
తవ్వినా
బయల్పడేవి
ఎన్నెన్నో
యుద్ధాలు

ఇప్పుడిక
వర్తమానాన్ని
తడిమినా
యుద్ధాలే

ప్రాణభయం
ముందు
అన్ని భయాలూ
బలాదూర్
యుద్ధంలో

ఏ దేశపు
సామాన్య
బతుకైనా
ఛిద్రమే

ఎంతకీ
తెమలని
యుద్ధపు
రక్కసి
కోరల్లో
ఆరని
ఎరుపు

తెగిపడిన
అవయవాల
మధ్య
కూడగట్టుకున్న
అవయవాలతో
రోజువారీ
యుద్ధం

ఎప్పుడు
ఏం
మూడుతుందో
ఎవరి నెత్తి మీద
ఏం కూలుతుందో
తెలియని
యుద్ధంలో

విశ్రమించిన
ఒక్క నిమిషమైనా
వైషమ్యాల్ని
మర్చిపోగలిగితే
బావుణ్ణు
యుద్ధమనేది
చరిత్రతోనే
ఆగితే
బావుణ్ణు

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణాత్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి”లో  వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఏప్రిల్, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు:  దామరాజు విశాలాక్షి 

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు:లంకంత ఇల్లు (కథ) – కె.వరలక్ష్మి 

 ఇరువురికీ  అభినందనలు!

****

Please follow and like us:

One thought on “సంపాదకీయం-మే, 2025”

  1. నిజమే.. బయటా, లోపలా అంతటా యుద్ధమే. బయటి యుద్ధం ప్రయత్న పూర్వకంగా ఆపవచ్చు. మరి లోపలి యుద్ధం? తెలియకుండానే అంతరాంతరాళాల్లో జరుతున్న విధ్వంసం? అందరం ఏదో క్షణంలో ఇటువంటి లోలోపలి రహస్య యుద్ధ బాధితులమే. మననుంచి మనల్ని విముక్తం చేయడం తెలియాలి. ఏదిఏమైనా.. చివరకు మనకి మనం మిగలాలి. యుద్ధానికి, యుద్ధానికి మధ్య విరామంగా కాదు.. బతుక్కు బతుక్కు మధ్య శాశ్వతంగా మానవత్వ శాంతి పరిఢవిల్లాలి.

Leave a Reply

Your email address will not be published.