పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు) -కర్ణ రాజేశ్వర రాజు రంభలా మేకప్ చేసి వదులుతారు నే రంభను కాను టీ కప్పు అందించమంటారు టీ బాయ్ ను కాను ముద్దుగుమ్మలా ఒదిగి ఒదిగి కూర్చోమంటారు నే గంగిరెద్దును కాదు తల పైకెత్తి కనులతో కనులు కలిసి చూడమంటారు నే మెజీషియన్ను కాను అక్కరకు రాని లక్ష ప్రశ్నలు సందించుతారు కోర్టులోనే ముద్దాయిని కాను ఎందుకీ యుద్ధభూమిలో నిస్సహాయురాలైన నన్ను క్షతగాత్రిని చేస్తారు నాకూ మనసూ మానవత్వం ఉంది […]
చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు) -డా. సి. భవానీదేవి మార్పు అనివార్యమైనా… ఇంత అసహజమైనదా ? మనకు ఇష్టం లేకుండా మనం ప్రేమించలేనిదా ? అయితే ఈ పొలాల మీద ఇంకా ఏ పక్షులు ఎగరలేవు ఏ పాములూ.. పచ్చని చెట్లూ.. ఇక్కడ కనిపించవు ఎటు చూసినా మనుషులే ! అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య జరుగుతున్నది గ్రామాలక్లోనింగ్ ! ఒంటరి భూతం కోరలకి పట్టణాలే కాదు పల్లెలూ బలి ఇక్కడ తలుపుల్నీ టీవీ యాంటీనాలు మూసేసాయి మానవ సంబంధాలు […]
మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు) -ఓల్గా మార్కెట్ ఓ సమ్మోహనాస్త్రం తళుకు బెళుకు వస్తువుల భీభత్స సౌందర్యపు కౌగిళ్ళ బిగింపుల గిలిగింతల పులకింతలతో మనల్ని ఊపిరి తీసుకోనివ్వదు ఒక్కసారి అటు అడుగు వేశామా మార్కెట్ మార్ఫియా ఇంట్రావీనస్ లో ఎక్కుతుంది కొను కొను ఇంకా కొను ఇంకా ఇంకా ఇంకా కొను సరుకులు బరువైన కొద్దీ మనసు తేలికవుతుంది ఇప్పుడు మనం మార్కెట్ లేకపోతే మనుషులం కాదు కొనుగోలు శక్తి ముందు ఏ బలమైనా బలాదూరవుతుంది **** ఇప్పుడు […]
ముందస్తు భయం( కవిత) -సాహితి ప్రపంచానికి జ్వరమొచ్చింది. ఏ ముందుకు చావని వింత లక్షణం వణికిస్తోంది. హద్దులు లేకుండా స్వచ్ఛగా పరిసారాన్ని సోకి ప్రాణం తీసే ఓ వైరసు కు భయపడ్డ మానవాళికి చావు భయంపట్టుకుంది. జీవితంలో తొలిసారిగా బతుకు భయాన్ని తెలియచేస్తూ వీధులు తలుపులు మూసి మూతికి చిక్కాన్ని తొడుక్కుమని జీవితాలకి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటే ఇళ్లు సంకెళ్లుగా మారి బంధాలన్ని ఏకాంత ద్వీపాలుగా మార్చి భద్రత బోధిస్తున్నాయి. ఏ వైపు నుంచి గాలి […]
కాసింత ఉపశమనం (కవిత) -గవిడి శ్రీనివాస్ అలసిన దేహంతో మేలుకుని ఉన్న రాత్రి తెల్లారే రెప్పలు వాల్చి నవ్వులు పూసిన తోటలో ఉపశమనం పొందుతుంది . మబ్బులు ఊగుతూ చెట్లు వేలాడుతూ పూవులు ముద్దాడుతుంటాయి . కొన్ని క్షణాలు ప్రాణాలు అలా లేచి పరిమళం లోకి జారుకుంటాయి . గాలి రువ్విన బతుకుల్లో చీకటి దీపాలు వొణుకుతుంటాయి . ఏదీ అర్ధం కాదు బతుకు రెక్కల మీద భ్రమణాలు జరుగుతుంటాయి . నేటి దృశ్యం రేపటి ఓ […]