ఆమె ధరణి
-కందిమళ్ళ లక్ష్మి
కొందరు అప్పుడప్పుడు
కఠిన మాటలతో
ఆమెను శిలగా మారుస్తుంటారు.
ఆమె కూడా
చలనం లేని రాయిలా
మారిపోతూ ఉంటుంది.
ఆమె
ఒక మనిషని మరచిపోతుంటారు.
కానీ
ఆమె మాత్రం చిరచిత్తంతో
మమతానురాగాల వంతెనపైనే
నడుస్తూ ఉంటుంది.
ఆమెను
ఒక చైతన్య మూర్తిగా
ఎప్పుడు గుర్తిస్తారు??
మీకు తెలియదా??
ఆమె ఎప్పుడూ
లాలిత్యాన్ని వదలని ఒక ధరణని!!
*****
చాలా బావుంది
థాంక్యూ అక్కా
కవిత చాలా బాగుంది. అభినందనలు లక్ష్మి గారు.
థాంక్యూ వసుధగారు