యుద్ధం

-గిరి ప్రసాద్ చెల మల్లు

దేశం కోసం  
సరిహద్దుల్లో 
 
కులమతాల భద్రతకోసం 
లోలోన చంపుకునేందుకు 
చంపేందుకు 
మంచుదుప్పట్లో వాడక్కడ కాపలా 
 
లైన్ ఆఫ్ కంట్రోల్ మీదుగా 
రాడ్లు కర్రలు బాహాబాహీ 
భూముల గెట్ల తగాదాలో లోపల 
 
అక్కడ సమిష్ఠి బాధ్యతకై వాడు 
ఇక్కడ పెత్తనం కోసం 
బలవంతుడు బలహీనుడిని తొక్కుతూ
 
అక్కడా పెట్టుబడీ ఇక్కడా పెట్టుబడీ కోరలు 
అక్కడాఇక్కడా అవినీతి జాడ్యం 
చిదిమేది బడుగు బతుకునే 
 
దేశమంటే మనుషులని వాడు అచ్చట ప్రాణాలొడ్డి 
దేశమంటే కులాలఎంపిక మతాల తరిమేత ఇక్కడ 
గద్దెకోసం రగడ రాజేయు అన్నివేళలా ఇక్కడ
సౌభ్రాతృత్వం కోసం వాడు రగులు అచ్చట 
 
అచ్చట వాడికి మూడురంగుల జెండా యే కనపడు 
ఇచ్చట ఎన్నెన్నో రంగులు మారు ఊసరెల్లిలా 
ఉన్నదంతా ఊడ్చుకునేందుకు 
 
అచ్చట వాడు పోతే దేశభక్తి 
ఇచ్చట వాడిపై కులజెండాకప్పే సంస్కృతి 
మీరు నమ్మే ఆత్మే ఉంటే క్షోభిస్తుంది 
 
కన్నకొడుకు దేశంకోసం ప్రాణాలు  అర్పించినా 
కడుపుకోత తీర్చలేనిది 
కట్టుకున్నవాడి యాదిలో శేషజీవితం ఎంత కష్టం
నాలుగు తుపాకులు గాల్లోకి లేస్తాయి 
ఆలివ్ గ్రీన్ దుస్తులు సెల్యూట్ కొడతాయి 
ఖేల్ ఖతం !
 
యుద్దం మూలాన్వేషణేది ?
చర్చోపచర్చల్లేవు యుద్దప్రకటనల్లేవు 
ఐనా భావావేశాలు రగులుతున్నయ్ అక్కడ 
రగిలిస్తూ ఆజ్యం పోస్తున్నదెవడు 
వైఫల్యాల కప్పివేత దాటవేతలో 
బలి ఎవరు ?!
రాజ్యమా ! నీ బిడ్డ పోతే సిగ్గనిపించట్లేదా !
నీవిచ్చే బిరుదులొద్దు 
తండ్రుల్లేని బిడ్డలని జేయక 
చర్చలతో పరిష్కరించు !
 
మరో మరణం చూడొద్దు 
శాంతి పావురంఎగురేద్దాం 

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.