ఆకాశంలో సగం

-లక్ష్మీకందిమళ్ళ

నీ అడుగుతో

నా అడుగు

ఈ నడక

కొత్తగా 

మొదలైంది కాదు 

బంధంతో బతుకు 

బతుకుకో బంధం

ఎప్పుడో ముడిపడింది

మనసు మనసు.మురిపెం

హద్దులు దాటని పరిధి 

నదులుగా తడుస్తూ

అహం తెలియని 

ఆసరాల ఆలింగనాలు

ఆవేశం కాని

ఆలోచనలు 

నువ్వు ఆకాశమై

నీలో సగమై నేను.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.