చిత్రలిపి

కర దీపిక

-మన్నెం శారద

యవ్వనం ఉరకలేస్తున్నప్పుడు 

మనసు ముందుకే ఉరకలు వేస్తుంది 

సై అంటే సై అని కాలు దువ్వుతూనే ఉంటుంది 

పర్వతాలని అధిరోహించాలని 

పైపైకి ఎగబాకాలని 

సవాళ్ళని ఎదుర్కోవాలని  

అందరికన్నా ముందు నిలవాలని 

కొండమీద జెండా పాతాలని 

ఎన్నో కలలు !

మరెన్నో ఆశలు !

అలుపెరుగని పయనం 

ఇప్పుడిక ప్రొద్దుగుంకుతున్నది ,

 పగలంతా ప్రచండం గా వెలిగిన వెలుగులిప్పుడు

  ఎర్రబడి ఆనక  నల్లబారుతున్నాయి 

అధిరోహణవెంట  అవరోహణ అంటుకునే ఉంటుంది 

ఎత్తులక్రింద లోయల నీడలు పరచుకుంటూనే ఉంటాయి 

నిరాశ ఏమీలేదు ….

ఓటమి కూడా కానేకాదు .

..నీ దగ్గర ఇంకా చాలా ధనముంది 

ముందుతరాలకు  పంచగల జ్ఞానముంది 

వెలుగు పిదప మలిగిపోక తప్పదు కదా 

నవ్వుతూ నిజాన్ని అంగీకరించి 

ఒక దీపం వెలిగించి 

వెనుక బడినవారికి దారి చూపించు …

మార్గదర్శకమై  ముందుకి నడిపించు 



*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.