పునాది రాళ్లు-14

-డా|| గోగు శ్యామల 

మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ సజీవ కథ

(సాoస్కృతిక  కళారూప రంగాల్లో కులం & జండర్ల ఆధిపత్య రాజకీయాల పాత్ర) 

 రాతకు నోచుకోని వందలాది  మౌఖిక   గాధలను, పురాణాలను అలవోకగా పాడే విశిష్ట  మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ.  ఈమె చిందు  కళాకారుల వంశంలో పుట్టి పెరిగింది. బాల్యం నుండే కళాకారిణిగా రానిoపచేయడం చిందు వంశానికే సాధ్యమైన అరుదైన కళాకారిణి.  చిందు బాగోతం, (చిందు యక్షగానం) కళారూపంలో చిందేస్తూ,  సంగీతసాధన చేస్తూ, పాటలు పాడుతూ , నృత్యం చేస్తూ చిందు ఎల్లమ్మగారు పెరిగి పెద్ద య్యారు.  తద్వారా  గాధలను పురాణాలను  ప్రదర్శిస్తూ, పాడుతూ ముపై రాగాలకు పైగా  అలవోకగా పలుకుతూ  భారత కళా ప్రపంచంలో, ముఖ్యoగా తెలుగు కళారంగంలో  బహుముఖ ప్రజ్ఞ్యాశాలిగా  తనదైన  ముద్రవేశారు. బహుళ కళా  నైపుణ్యాలు, బహుళ అస్తిత్వాలని కలిగినటువంటి ‘ మేటి కళాకారిణి’  అనే పేరునుఅర్థాన్ని ఇటాలియన్ భాషలో ‘Maestro Prima Donna’ ( First lady with music dance and singing through community  and troup  )అంటారు.  ఈ అర్ధం చిందు ఎల్లమ్మకు సరిగ్గా సరిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు . ఇక పోతే,  చిందు ఎల్లమ్మకున్న ప్రాచుర్యo  కూడా చిన్నదేం కాదు. తెలుగు రాష్ట్రాల్లో   ముఖ్యముగా  తెలంగాణలోని  ప్రతి గ్రామంలో , అన్ని కులాల వారికీ,  అన్ని వయసులవారికి  ఈమె పరిచయమే. 1998-99లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ” చిందుల హంస” అనే బిరుదు ప్రధానం చేసింది. దేశ రాజధానిలో కూడా  పురస్కారాన్ని అందుకున్నారీమే.  ఆ విధంగా ప్రధాన స్రవంతిలో కూడా  చిందు కళారూపం గుర్తింపు పొందినదనుకోవచ్చు.  అయినా  రావాల్సినంతగా  గుర్తింపు,   ఆదరణ  ఇంకా రాలేదనే చెప్పాలి.  ఈ నేపథ్యంలో  ఈ కళారూపం  యొక్క  చారిత్రాత్మక లోతులను,  గ్రామీణ వ్యవస్థలతో గల సంబంధాన్ని,  కనిపించే ఈసడింపులు,  కనపడని వెలివేతలు, కొన్ని గుర్తింపులు చాలా నిర్లక్ష్యాలు  వంటి  సంక్లిష్టతలను  పరిశీలించాల్సిన  అవసరం ఎంతో ఉంది.  కనుక చిందు ఎల్లమ్మగారి  జీవితంతో, ఆమె యొక్క కళాపోషణ చరిత్రతో , చిందు కమ్యూనిటితో,  చిందు మేళంతో అనుసంధానం కావాల్సిందే. సంవాదం జరపాల్సిందే.   అందుకోసం  మనం  ఎన్నుకునే   పరిశోధనా తీరు ఎలా ఉండాలి? ప్రత్యేక దృష్టి కోణం  ఎలా ఉండాలి?  ఎంత  శ్రద్ధ వహించాలి, ఎంత  ఓర్పును కలిగివుండాలి, ఎంత  గౌరవాన్ని  కలిగి ఉండాలనేవి  కూడా ముఖ్యమే. అయితే ఈ కళారూపంను  గురించి  నాగయ్య తన రచనలో ఇచ్చిన   నిర్వచనంలో  “యక్షగానం పాటలు మాత్రమే కాకుండా, నృత్య ప్రదర్శనలు, సంగీత సాధనలు  మరియూ  స్క్రిప్ట్ తో  ఉంది” కనుక  ఇది ప్రామాణికతను తెలియజేస్తుంది   అని చెప్పడం   విశేషం.  అంతే కాకా బీరుదు రాజు  రామ రాజు “   జాంబవపురాణానికి  యక్షగాన కళారూపం  ప్రోటో ఆర్ట్ రూపం వంటిది ” అని వ్యాఖ్యానించడంలో ప్రాచీనత  ప్రాముఖ్యత కనబడుతుందనే చెప్పాలి.  అయితే ఈ కళారూపాన్ని ప్రదర్శించే  చిందు కళాకారుల బృందాన్ని సిందోల్ల మేళం/ చిందు మేళం అని  ప్రముఖంగా  పిలుస్తారు.  ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే  భాగోతం / యక్షగానం కళా  రూపాన్ని నిశితంగా పరిశీలించినట్లయితే  స్థానిక  సంబురం , ఆకర్షణ  /కంటెంట్  ఒకవైపు  హిందూ పురాణాలు మరొక వైపు కలగలిసిన  ఇతివృత్తాలు   వీరి ప్రదర్శనల్లో కనిపిస్తాయి.  అయితే  వీటికి భిన్నమైన  నేపథ్యాన్ని సంప్రదాయాల్లో , జీవన శైలిలో చూస్తాం అనేది గమనించాలి . ఇందులో భాగమైన జాంబవ పురాణంను   పరిశీలించినట్లయితే, చిందు కుటుంబం,  కమ్యూనిటీ పుట్టుక  తల్లివ్యవస్థ దేవతగా కొలువబడే ఎల్లమ్మ( కల్ట్ ) వారసత్వం నుండి పుట్టుకొచ్చాయని  చెప్పుకుంటారు. ఎల్లమ్మ క్రతువు సంప్రదాయo ప్రకారం  ఈమె  ప్రకృతి, పచ్చదనం,  సహజవనరులు,  వ్యవసాయను రక్షించే  రక్షకురాలని ఈ కమ్మూనిటీల ప్రజలు నమ్ముతయారు,  ఆరాదిస్తారు. అంతే కాకా భూమిని  ఆహార ఉత్పత్తి వనరుగా, ఆహార  భద్రతా వనరుగా, ఆరోగ్య రక్షణగా భావిస్తారు. ఈ రకమైన భావాన్ని కలిగి ఉన్నది  చిందు కమ్యూనిటీతో పాటు,  బంధు  కంమ్యూనిటీలు , పని పాటోళ్లు, సబ్బండ జాతులు, మొత్తంగా గ్రామీణ భారత దేశమంతా  ఉత్పత్తి, ఆర్థిక, సంస్కృతీ సంప్రదాయాలన్ని ప్రకృతీ పచ్చదనపు ఆరాధన జీవన  సరళిని  కలిగి ఉంటారు. వీటన్నింటికి పునాది తల్లి దేవతారాధాన  , గ్రామదేవతల సంస్కృతిగా ఎల్లమ్మ తల్లి దేవత ప్రముఖంగా కనిపిస్తుంది. ఎల్లమ్మ కథతోనే చిందోళ్ల ప్రదర్శన  ప్రారంభమౌతుంది.   చిందు మేళం  గ్రామనడిబొడ్డున ప్రదర్శించే వందలాది కథలు  ఎల్లమ్మకథతోనే మొదలు పెడతారు. ఆసక్తి కరమైన విషయమేమంటే  తల్లి దేవత పేరునే  చిందు ఎల్లమ్మగా  తన  తల్లి తండ్రి  నామకరణం చేసుకున్నారు. ఈ పేరు గురించి మరో ఆసక్తికరమైన  విషయం  తరువాతనే చెప్పొచ్చు. మరో అంశం ఏమంటే  ‘చిందు’ అనే కళారూపం పేరు వీరి కమ్మూనిటి పేరుగా ఉండడం, ఈమెకు చిందు ఎల్లమ్మ అని ఇంటిపేరుగా స్థిరపడడం, అదే చిందు భాగవతం కళారూపాన్ని ఈమె జీవిత  ద్వేయంగా, వృత్తి వారసత్వoగా స్వీకరించడం   కళాప్రపంచంలోనే  అరుదైనాంశం. అంతేకాక ఈ చిందు కమ్మూనిటీ  మాదిగ కమ్మూనిటీకి మిగితా డక్కలి, బైండ్ల, మాస్టిన్, కొమ్ము, మాతరి, మోచి, బుడగ జంగాలు,  నులకచందయ్యల వంటి అనేక బందు కమ్మూనిటీలలో చిందు కమ్యూనిటీ  ఒకటి.   ఇంకా చిందు కళా రూపం విషయానికొస్తే కథనం  క్రమం లో జాంబవంతుడిని  ప్రవేశపెట్టడం ఒక కీలక ఘట్ట్టముగా మార్చ బడుతుంది. అందులో భాగంగానే  చిందు కథనo లో తీక్షణ మైన పదజాలంతో దూషించడం  చేస్తుంది. అది మనువాదపు  అసమాన వర్ణ కుల  వ్యవస్థను చిందు కళారూపంలో బ్రాహ్మణీయ పితృస్వామ్య  సాంస్కృతిక ఆధిపత్య పద్ధతులను  నిరసించే  కథనంగా జాంబవ పురాణం నిలబడుతుంది. కనుక చిందు కళారూపం యొక్క  బహుళ  అస్తిత్వాలను  తయారుచేసే  బహుళ మార్పులను  ఇక్కడే చూడగలం.  కళ మరియు సమాజం గురించి భిన్నమైన అభిప్రాయాలు,  అవగాహన చాలా క్లిష్టంగా ఉంటాయి. అందువల్ల చిందు  కళారూపం, చిందు కమ్యూనిటీ  మరియు చిందు ఎల్లమ్మ పై  పరిశోధనలు చేయడం  చాలా కీలకమైంది.

ఈమె బాల్యంను చూ స్తే  ముక్యంగా తెలంగాణలో  చిందు బాగోతం ప్రస్తావన చిందు ఎల్లమ్మ పేరును గుర్తుకు తెస్తుంది. ఆమె తల్లిదండ్రులు, పిల్లెట్ల ఎల్లమ్మ మరియు పిల్లెట్లనబిసాబ్.  నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లోని అహ్మదాపూర్ గ్రామo  ఈమెది.

 ఆమె తల్లిదండ్రులు ఆమెతో చెప్పిన ప్రకారం  ‘ నీవు  బంజాపెల్లి చెరువు కట్ట  (బంజెపల్లి చెరువు ) నిర్మాణం ప్రారంభించిన  సమయంలో నీవు  పుట్టినావు.’ అని చెప్పారట. దీనిని ఇప్పుడు నిజాం సాగర్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఇది 1923 లో ఏప్రిల్ మొదటి తేదీనాడు  ఏర్పడింది. కాబట్టి  1923 ఏప్రిల్  ఒకటవ తేదీనాడు ఎల్లమ్మ జన్మించారని చెప్పాలి.

చాలా చిన్న వయసు నుండి  బాల కళాకారిణిగా ఎల్లమ్మ  చిందు కళారూప జీవన విధానం. కళారూపాలు ఆమె బాల్యంలో భాగమైతూ కొనసాగింది. ఆమె మేటి కళాకారిణిగా ఎదిగిన తీరును  కథలు కథలుగా చెప్పుకోవచ్చును.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.